veerabhadram mullapudi
-
'వెటకారమే నా సక్సెస్‌కు కారణం'
రాజమండ్రి : ‘‘వెటకారంతో కూడిన హాస్యమే తన సక్సెస్‌కు కారణమని, అదే తనను సినీ ఇండస్ట్రీలో నిలిపింది’’ అని అన్నారు ప్రముఖ సినీదర్శకుడు ముళ్లపూడి వీరభద్రం. చుట్టాలబ్బాయ్ చిత్రం షూటింగ్ నిమిత్తం బుధవారం పల్లవెంకన్న నర్సరీకి వచ్చిన ఆయన షూటింగ్ విరామంలో ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. ‘‘డిగ్రీ పూర్తయ్యాక ఎంసీఏ చేద్దామనిహైదారాబాద్ వచ్చిన నాకు ఈవీవీ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి నా సినీజీవితం మొదలైంది. ఈవీవీ, తేజలతోపాటు పలువురు సక్సెస్ఫుల్ డెరైక్టర్ల వద్ద కో డెరైక్టర్‌గా చేశాను. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ కావడంలో గోదావరి పరిసరప్రాంత ప్రజలు ముందుంటారు. అందుకే అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా సినీ రంగంలో ఇక్కడి వారు బాగా రాణిస్తున్నారు. హాస్యనటుడు సునీల్‌ను సిక్స్‌ప్యాక్ బ్యాడీతో హీరోగా చూపించిన పూలరంగడు చిత్రాన్ని ఉభయగోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కడియం నర్సరీ ప్రాంతంలో ప్లాన్ చేశాం. కానీ ఔట్ డోర్ షూటింగ్లో సునీల్ సిక్స్‌ప్యాక్ కసరత్తులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో స్టూడియోలో చేయాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు. గోదావరివాసుల ఆదరణ నచ్చింది : ఆది ఉభయగోదావరి జిల్లా వాసుల ఆదరణ తనకెంతో నచ్చిందని యు వ హీరో ఆది అన్నారు. షూటింగ్ విరామంలో ఆయన స్థానిక విలేకరుల తో మాట్లాడారు. తన అత్తారిల్లు రాజమహేంద్రమైనా కడియం నర్సరీల్లోకి రావడం ఇదే మొదటిశారన్నారు. ఇప్పటి వరకు ఏడు సినిమాల్లో హీ రోగా నటించానని, అన్నింటికంటే భిన్నమైన కథతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా విజయవంతమవుతుందన్నారు. ఇక్కడి వారి ఆదరాభిమానాలు ఎన్నటి మరువలేనన్నారు. ఇక్కడే బాగుంది : నమిత మళయాళంలో పలువురు అగ్రహీరోల సరసన 18 సినిమాల్లో హీరోయిన్గా నటించానని హీరోయిన్ నమిత అన్నారు. తెలుగులో చుట్టాలబ్బాయ్ తన తొలి చిత్రమన్నారు. షూటింగ్లో భాగంగా అనేక ప్రాంతాలు చూశానని, అయితే వాటన్నికంటే కడియం నర్సరీలు బాగున్నాయన్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే సినిరంగంలోకొచ్చిన తాను ప్రస్తుతం బీఏ లిటరేచర్ చేస్తున్నట్టు చెప్పారు. -
దర్శకుడిని కాకపోతే రైతు అయ్యేవాడిని..
- దర్శకుడు వీరభద్రం ఏలూరు : తాను డైరెక్టర్ కాకపోతే రైతు అయ్యేవాడినని అన్నారు సినీ దర్శకుడు ముళ్లపూడి వీరభద్రం. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు రైల్వేస్టేషన్ సమీపంలో 'చుట్టాలబ్బాయి' సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండున్నర గంటల పాటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలను అందించడమే తన లక్ష్యమన్నారు. చుట్టాలబ్బాయి చిత్రం యాభై శాతం పైగా షూటింగ్ పూర్తయిందని, ఆరు పాటలు ఉంటాయని చెప్పారు. మే నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గతంలో తాను తీసిన అహనా పెళ్లంట, పూలరంగడు, భాయ్ చిత్రాలకు భిన్నంగా దీనిని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమకథా చిత్రంగా నిర్మిస్తున్నామన్నారు. తనది చాగల్లు మండలం కలవలపల్లి అని బీకాం చదివానని చెప్పారు. ఇవీవీ సత్యనారాయణ, తేజ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశానని చెప్పారు. అహనా పెళ్లంటతో దర్శకుడిగా అవకాశం వచ్చిందని, పూలరంగడు మంచి గుర్తింపు తీసుకువచ్చిందని చెప్పారు. గోదావరి ప్రాంత యాస, గ్రామీణ వాతవరణంతో తీసిన చిత్రాలు విజయం సాధిస్తున్నాయని తెలిపారు. హీరో రామ్, నాని, రవితేజతో సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నానన్నారు. షార్ట్‌ఫిల్మ్, నటనలో నైపుణ్యం పెంచుకుంటే చిత్రసీమలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. గుర్తింపు పొందాలంటే మాత్రం అదృష్టం కూడా ఉండాలని వీరభద్రం అన్నారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చుట్టాలబ్బాయి సినిమా షూటింగ్లో భాగంగా శుక్రవారం హీరో ఆది, హీరోయిన్ నమితా ప్రమోద్, ప్రతినాయకుడు చరణ్‌దీప్ మధ్య యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు వీరభ్రం చిత్రీకరించారు. హీరోయిన్ నడిచి వెళుతుండగా ఆమెను విలన్ గ్యాంగ్ వెంబడించగా హీరో రక్షించే సన్నివేశాలు, ఫైట్‌ను తెరకెక్కించారు. ఈ నెల 20 వరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని దర్శకుడు తెలిపారు. సాయికుమార్, రఘుబాబు, పృద్వీ, జీవా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారన్నారు. సంగీతం ఎస్ఎస్ థమన్ అందిస్తున్నారని చెప్పారు.