vellore jail
-
నళిని నిరాహార దీక్ష విరమణ
వేలూరు (తమిళనాడు): వేలూరు మహిళా జైలులో గత ఐదు రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న నళిని ఆదివారం దీక్ష విరమించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు మహిళా జైలులో నళిని, పురుషుల జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్ శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. అయితే తనను చెన్నై పుళల్ జైలుకు మార్చాలని ఈ నెల 12వ తేదీన నళిని జైలు అధికారులకు వినతి పత్రం అందజేశారు. లండన్‌లో ఉన్న తన కుమార్తెకు వివాహ ఏర్పాట్లు చేస్తున్నామని, తనను పుళల్ జైలుకు మార్చితే ఏర్పాట్లపై సమీపంలో నివాసం ఉంటున్న తన బంధువులతో మాట్లాడుకోవచ్చని ఆమె వినతిలో పేర్కొన్నారు. అయితే వినతి పత్రాన్ని స్వీకరించిన అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ ఈ నెల 14వ తేదీ నుంచి నళిని నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పుళల్ జైలుకు మార్చాలన్న వినతిపై చర్యలు తీసుకుంటామని ఆదివారం జైలు అధికారులు హామీ ఇవ్వడంతో నళిని ఆహారం తీసుకున్నారు. -
కన్నీటితో వెలుతున్నా.. ఓ తల్లి ఆవేదన
వేలూరు: జైలులోని కుమారున్ని చూడలేక కన్నీటితో శ్రీలంక వెలుతున్నానని మురుగన్ తల్లి చోమని అమ్మాల్ వాపోయారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లు పురుషుల జైలులో, మురుగన్ భార్య నళిని మహిళా జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మురుగన్ తల్లి చోమని అమ్మాల్ శ్రీలంక నుంచి ఒక నెల టూరిస్ట్ విసాతో తమిళనాడుకు వచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేలూరు సెంట్రల్ జైలుకు వెళ్లి కుమారుడు మురుగన్‌ను చూడాలని దరఖాస్తు చేసుకుంది. అయితే జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె బయటకు వచ్చి విలేకరులతో కన్నీటి పర్వంతమవుతూ మాట్లాడారు. తాను ఒక నెల పర్యాటక విసాపై వచ్చానని గత వారంలో జైలు వద్దకు వెలితే తనను లోనికి అనుమతించలేదన్నారు. మురుగన్‌ను చూడాలని ధరఖాస్తు చేసుకుంటే రెండు గంటల అనంతరం వచ్చి మురుగన్ జైలులో సెల్‌ఫోన్ ఉపయోగించిన కారణంగా మూడు నెలల వరకు ఎవరిని కలవకూడదని నిషేదించినట్లు తెలిపారన్నారు. అదే విధంగా తన కోడలు నళిని చూసేందుకు కూడా అనుమతించలేదని తెలిపారు. అనంతరం జైలులో ఉన్న శాంతన్‌ను చూసి మాట్లాడనని, తమిళనాడు ప్రభుత్వం తమను విడుదల చేస్తుందనే నమ్మకంతో ఉన్నామని తనతో చెప్పాడని తెలిపారు. -
నళిని నిరాహార దీక్ష!
దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ను చూసేందుకు కోర్టు అనుమతించక పోవడంతో మహిళా జైలులో నళిని ఆహారం తినకుండా నిరాహారదీక్షకు దిగింది. మురుగన్ పురుషుల జైలులో, భార్య నళిని మహిళా జైలులో శిక్ష అనుభవిస్తు న్న విషయం తెల్సిందే. వీరు ప్రతి 15 రోజు లకు ఒకసారి మాట్లాడేందుకు గతంలో కోర్టు అనుమతించింది. అయితే కొద్ది రోజుల క్రితం మురుగన్ నుంచి సెల్‌ఫోన్, నగదును పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యం లో ఈ నెల 12న నళిని, మురుగన్‌లు కలుసుకోవాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతించలేదు. నిబంధనలకు విరుద్దంగా మురుగన్ జైలులో నగదు పెట్టుకున్నాడన్న నెపంతో రెండు నెలలు నళిని చూడకుండా నిషేధం విధించారు. విషయం తెలుసుకున్న నళిని జైలులో మౌన పోరాటం చేసోంది. మహిళా జైలులోని అధికారులు చర్చలు జరిపారు. ఆ సమయంలో తనకు ఆహారం వద్దని భర్తను చూడకుండా ఉండలేక పోతున్నానని నళిని కన్నీరు పెట్టుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. గురువారం పూర్తిగా ఆహారం తీసుకోలేదు. చర్చల అనంతరం శుక్రవారం ఉద యం ఆమె ఆహారం తీసుకున్నట్లు తెలిపారు.