Vemula
-
A2 ఎవరు ...?
-
సీఎం జగన్ ను హత్య చేసేందుకే..రిమాండ్ రిపోర్ట్ నిజాలు..!
-
వేముల ప్రభాకర్‌కు కీర్తి పురస్కారం
జగిత్యాల: పట్టణానికి చెందిన ప్రముఖ కవి రచయిత వేముల ప్రభాకర్‌కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. వేముల ప్రభాకర్ శ్రీవరకవి భూమాగౌడుశ్రీ నవల రచనకు గాను కీర్తి పురస్కారం ప్రకటించగా ఈనెల 28న అందుకోనున్నారు. ఇప్పటివరకు మూడు నవలలు, ఒక కథ సంపుటి, ఆరు కవిత సంపుటిలు, స్వీయరచనతో పాటు రెండు సాహితీ గ్రంథాలు, ఒక మాసపత్రిక వారి సంపాదకత్వంలో వెలువడ్డాయి. ఈ సందర్భంగా వేముల ప్రభాకర్‌ను సాహితీవేత్తలు, విద్యావేత్తలు, రచయితలు అభినందించారు. -
రైతులకు యూసీఐఎల్ అన్యాయం చేస్తోంది
సాక్షి, కడప సిటీ: ‘యురేనియం ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేదు.. ప్రారంభంలో చెప్పిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగడం లేదు. బాధితులకు పరిహారం, ఉద్యోగాలు అందలేదు. గ్రామాల్లో అభివృద్ధి పనులను చేయడం లేదు. వ్యర్థాలతో తీవ్ర నష్టం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అని వేముల మండలం తుమ్మలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, మబ్బుచింతలపల్లె, కేకే కొట్టాల, కనంపల్లె, వేల్పుల తదితర యురేనియం ప్రభావిత గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టర్ సి.హరి కిరణ్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం వందలాది మంది బాధిత గ్రామాల ప్రజలు కడప కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చారు. కలెక్టర్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. డిమాండ్ల పరిష్కారం కోసం వేముల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గత ఐదు రోజులపాటు ఆందోళనలు చేపట్టినా యూసీఐఎల్ యాజమాన్యం కన్నెత్తి కూడా చూడలేదని వాపోయారు. అభివృద్ధి పనులను విస్మరించారన్నారు. 70 శాతం ఉద్యోగాలు యురేనియం బాధిత ప్రాంత రైతులకే కేటాయించాలన్నారు. సరిహద్దులు నిర్ణయించిన మేరకు భూములన్నీ తీసుకోవాలన్నారు. టైలింగ్‌పాండ్ వ్యర్థాలతో తీవ్ర నష్టం జరుగుతోందని, కలుషిత నీటితో పంటలు దెబ్బతినడంతోపాటు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు పర్యవేక్షణ బావులు నిర్మించాలన్నారు. కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటాలన్నారు. భూగర్భ జలాలు శుద్ధి చేస్తేగానీ పంటలు పండవన్నారు. అంతవరకు రైతులకు నష్టపోయిన పంట నష్టాన్ని నిరంతరాయంగా చెల్లిస్తూనే ఉండాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ద్వారా వ్యవసాయం కోల్పోయిన రైతులందరికీ తగు రీతిలో ఉపాధి కల్పించాలన్నారు. భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు వెంటనే నష్టపరిహారంతోపాటు వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ వద్దని, బాధిత గ్రామాల్లోని రైతులతో కమిటీ వేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. మొత్తం 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ హరికిరణ్‌కు అందజేశారు. దీనిపై కలెక్టర్ హరికిరణ్ స్పందించారు. త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. యురేనియం బాధిత గ్రామాల నాయకులు, వైఎస్సార్సీపీ వేముల మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ కేవీ బయపురెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు. డిమాండ్లన్నీ పరిష్కరిస్తేనే... డిమాండ్లు పరిష్కరించమంటే యురేనియం ప్రాజెక్టు యాజమా న్యం కాలయాపన చేస్తోంది. అన్ని డిమాండ్లు పరిష్కరిస్తేనే యురేనియం బాధిత గ్రా మ ప్రజలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చే స్తాం. ప్రజాభిప్రాయసేకరణ అసలు ఒప్పుకోం. కమిటీ వేసి సమస్యలన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. – మరకా శివకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ, రాచగుంటపల్లె, వేముల మండలం ప్రజాభిప్రాయ సేకరణ వద్దు యురేనియం ప్రాజెక్టు యాజమాన్యం జనవరి 6వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామన్నారు. దీనికి ఒప్పుకునే పరిస్థితి లేదు. అలా కాకుండా ముందుకు వెళితే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తాం. యురేనియం బాధిత గ్రామాల ప్రజలతో కమిటీ ఏర్పాటు చేసి డిమాండ్లను పరిష్కరిస్తేనే అంగీకరిస్తాం. – నాగేళ్ల సాంబశివారెడ్డి, మండల కన్వీనర్, వేముల -
యురేనియం సమస్యలపై కమిటీ ఆరా
సాక్షి, వేముల: వైఎస్సార్ జిల్లాలోని వేముల మండలంలో యురేనియం కాలుష్య సమస్యపై నిపుణుల అధ్యయన కమిటీ సోమవారం పర్యటించింది. టైలింగ్ పాండ్ పరిధిలోని బాధిత రైతు సమస్యలపై యురేనియం సంస్థ అధికారులతో ఆరా తీసింది. తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ముడి పదార్థాన్ని శుద్ధి చేసి టైలింగ్ పాండ్‌లో నింపుతున్నారు. టైలింగ్ పాండ్‌లోని వ్యర్థ పదార్థాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఈ సమస్యపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో సమీక్ష నిర్వహించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త బాబూరావు, రైతులు కలసి యురేనియం కాలుష్యం, కలుషిత జలాలపై కాలుష్య నియంత్రణ మండలిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి 11 మందితో నిపుణుల అధ్యయన కమిటీని నియమించింది. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త బాబూరావు ఆధ్వర్యంలో కమిటీ కర్మాగారాన్ని, టైలింగ్ పాండ్‌ను సందర్శించింది. ముందుగా తుమ్మలపల్లెలో యురేనియం అధికారులతో కమిటీ భేటీ అయింది. అధికారులిచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి నీరు కలుషితం కాలేదనే∙దానిపై ఆధారాలు చూపాలని ప్రశ్నించినట్లు సమాచారం. తర్వాత యురేనియం శుద్ధి కర్మాగారాన్ని కమిటీ సందర్శించింది. టైలింగ్ పాండ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని కమిటీ బృందం గుర్తించినట్లు తెలుస్తోంది. యూసీఐఎల్ అధికారులు ప్రాణేష్, రావు, వీకే సింగ్ తదితరులు ఉన్నారు. (ఇది చదవండి: యురేనియం కాలుష్యానికి ముకుతాడు) -
యురేనియం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
వైఎస్సార్ జిల్లా : వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు ప్రాజెక్టు వద్దకు చేరుకున్న రైతులు, ప్రాజక్టులోకి వెళ్లనివ్వకుండా అధికారులను అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ప్రాజెక్టులోకి వెళ్లనివ్వమనంటూ రైతులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు వ్యర్థాలతో భూగర్భ జలాలతో పాటు, త్రాగు నీరు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు, భూములకు నష్ట పరిహారం చెల్లిస్తే గ్రామాలు ఖాళీచేసి వెళ్లి పోతామని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. -
దారుణం
వేముల(పులివెందుల): వేముల మండలం నల్లచెరువుపల్లెలో దారుణం జరిగింది. భార్య గొంతు కోసి.. తాను విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మరణంతో మూడేళ్ల చిన్నారి అనాథగా మారింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన కవిత(21)తో వేముల మండలం నల్లచెరువుపల్లె ఎస్సీ కాలనీకి చెందిన పరిగల రామాంజనేయులు(31)కి ఐదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అయిన ఏడాది పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో కొన్నాళ్ల పాటు వీరు అత్త ఊరైన లింగాపురంలోనే జీవనం సాగించారు. ఇటీవల సొంత గ్రామమైన నల్లచెరువుపల్లెకు చేరుకొని మృతుడి తల్లిదండ్రులు బ్రహ్మయ్య, ఓబుళమ్మతో కలిసి ఉన్నారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు. రామాంజనేయులు, కవిత ఇంట్లో నిద్రించగా.. బ్రహ్మయ్య, ఓబుళమ్మ, మనుమరాలు బ్రహ్మణి ఇంటి బయట నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున 2.16 గంటలకు మనుమరాలు బ్రహ్మణికి నీరు దప్పిక కావడంతో.. వారు పిలవగా లోపలి నుంచి ఎవరూ పలకలేదు. దీంతో అనుమానం వచ్చి గట్టిగా అరిచారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ లోపే చుట్టు పక్కల వారు నిద్ర లేచి గుమికూడారు. ఇంటి ద్వారం వద్ద రక్తపు మడుగులో కవిత పడి ఉండటాన్ని గమనించారు. ఆమె గొంతు కోయబడింది. రామాంజనేయులు నోటి నుంచి బురగ కారుస్తూ పడి ఉండటాన్ని చూడారు. అప్పటికే వీరు మృతి చెందినట్లు గుర్తించారు. అనాథగా మారిన చిన్నారి : తల్లిదండ్రుల మరణంతో మూడేళ్ల కుమార్తె బ్రహ్మణి అనాథగా మారింది. తల్లిదండ్రులు చనిపోయిన విషయం సరిగా తెలియని ఆ చిన్నారి అమాయకంగా చూస్తూ.. ఏడుస్తుండటం అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. అయితే తమ కుమార్తె, అల్లుడును మృతుడి తల్లిదండ్రులు బ్రహ్మయ్య, ఓబుళమ్మతోపాటు సోదరుడు పవన్ కలిసి చంపారనే అనుమానం కింద మృతురాలి తండ్రి బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్రకుమార్ తెలిపారు. ఆస్తి తగాదాలతోనే చంపారని ఆరోపణ : తన కుమార్తె కవితను అల్లుడు రామాంజనేయులు గొంతు కోసి చంపేసి.. విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారని మృతురాలి తండ్రి బాలరాజు పేర్కొన్నాడు. అయితే కొన్నాళ్లుగా ఆస్తి కోసం గొడవ పడుతున్నారని.. ఆస్తి పంచి ఇవ్వమంటే.. తల్లిదండ్రులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించాడు. ‘మీ కుమార్తె, అల్లుడు చనిపోయారు’ అని మృతుడి సోదరుడు ఫోన్ చేసి చెప్పారని చెప్పాడు. -
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
వేముల: వరకట్న వేధింపులు తాళలేక నాగశిల్ప(22) అనే వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వేములలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేంద్రకుమార్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బలపనూరు గ్రామానికి చెందిన నాగశిల్పను వేములకు చెందిన కొమెర మధుకు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు. కొన్నాళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. అయితే గత కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవపడేవారు. అదనపు కట్నం తేవాలని తన కుమార్తెను వేధించేవారని.. ఇది తాళలేకే శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని తన కుమార్తె నాగ శిల్ప ఆత్మహత్య చేసుకుందని తండ్రి పెద్ద వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు రాములయ్య, ఈశ్వరమ్మ, మధు, విజయ్, ప్రసాద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ వేములలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నాగశిల్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థలాన్ని పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, సీఐ రామకష్ణుడు శనివారం సందర్శించారు. అనంతరం మృతురాలి బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ మృతురాలి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. -
యూసీఐఎల్ కార్మికుల ధర్నా
వేముల : వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) కార్మికులు శుక్రవారం విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. దీంతో యూరేనియం తవ్వకాలతోపాటు, ఉత్పత్తి నిలిచిపోయింది. డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇంటి భత్యం పెంచాలని, తమ పిల్లలకు స్కూల్ ఫీజులు చెల్లించాలని, ఉచిత బస్సు సౌకర్యం, తాగునీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. -
ఆటో, సుమో ఢీ : మహిళ మృతి
వేముల (వైఎస్సార్ జిల్లా) : వేగంగా వెళ్తున్న టాటా సుమో వాహనం కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పది మంది గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం వైఎస్సార్ జిల్లా వేముల మండలంలో జరిగింది. వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొంత మంది మహిళలు కూలి పనుల కోసం ఆటోలో వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటోను సుమో ఢీ కొట్టింది. ఈ ఘటనలో మండల కేంద్రానికి చెందిన గంగాదేవి(50) అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ఉన్న మరో 10 మంది గాయపడ్డారు. వారిలో రంగమ్మ, పుల్లమ్మ, తులసమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతానికి వీరి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా గాయపడిన వారు ప్రస్తుతం పులివెందుల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యురేనియం తవ్వకాలతో నీరు కలుషితం
వేముల, న్యూస్‌లైన్: యురేనియం తవ్వకాలతో మండలంలోని మబ్బుచింతలపల్లె గ్రామంలోని మంచినీటి పథకం తాగునీరు కలుషితమవుతోంది. గత 20రోజులుగా బోరులో నుంచి కలుషితనీరు వస్తోంది. వర్షాలతో అలా వస్తోందనుకుని బోరు లోతు తగ్గించారు. అయినా నీటిలో ఏ మాత్రం మార్పు లేదు. నీటి మోటారు ఆన్‌చేసి రోడ్డుపైకి నీరు వదలితే కొద్దిసేపటికే రోడ్డుపై వ్యర్థ పదార్థం పేరుకపోతోంది. గ్రామస్తులు యురేనియం అధికారుల దృష్టికి తీసుకురాగా మైన్స్ మేనేజర్ కె.కె.రావు, మైనింగ్ డిప్యూటీ సూపరింటెండెంటు భద్రాదాస్ గతవారం గ్రామానికి వె ళ్లి నీటిని పరిశీలించారు. ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వెనుతిరుగుతుండగా గ్రామస్తులు అడ్డుకుకి హామీ ఇచ్చేవరకు వెళ్లనీయమని పట్టుబట్టారు. పర్సనల్ మేనేజర్ ఆలీ అక్కడికి చేరుకొని నీటిని పరీక్షలకు పంపుతామని, అప్పటివరకు ట్యాంకర్లతో అందిస్తామని హామీ ఇచ్చారు. పరిశోధనలో బయటపడిన వాస్తవాలు మబ్బుచింతలపల్లె తాగునీటి బోరు నుంచి సేకరించి నీటిని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహించారు. ఆ బోరులోని తాగునీరు పూర్తిగా కలుషితమైందని, నీరు తాగేందుకు పనికిరావని పరిశోధనలో తెలిసింది. అండర్ మైనింగ్ బోరుకు సమీపంలోనే తవ్వకాలు సాగుతున్నాయని, దీంతో మైనింగ్‌లోని వ్యర్థ పదార్థం మంచినీటి బోరులోకి వెళ్లి నీరు కలుషితమైందని పరిశోధనలో తేలినట్లు సమాచారం. గ్రామంలోని బోరు నీరు కలుషితమైనందున ప్రత్యామ్నాయంగా దోబీఘాట్ వద్ద బోరువేసి తాగునీరు ఇవ్వాలని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు పట్టించుకోకపోతే యురేనియం ఉత్పత్తిని స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నారు. -
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రలోభాల పర్వం