
యురేనియం ప్రాజెక్టు ప్రాంగణం
వైఎస్సార్ జిల్లా : వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు ప్రాజెక్టు వద్దకు చేరుకున్న రైతులు, ప్రాజక్టులోకి వెళ్లనివ్వకుండా అధికారులను అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ప్రాజెక్టులోకి వెళ్లనివ్వమనంటూ రైతులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు వ్యర్థాలతో భూగర్భ జలాలతో పాటు, త్రాగు నీరు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు, భూములకు నష్ట పరిహారం చెల్లిస్తే గ్రామాలు ఖాళీచేసి వెళ్లి పోతామని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment