Venakiah naidu
-
కేంద్ర ప్రభుత్వంలోకి టీఆర్ఎస్?
-
కేంద్ర ప్రభుత్వంలోకి టీఆర్ఎస్?
రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం రెండు మంత్రి పదవులు తీసుకోనున్న గులాబీ పార్టీ ప్రతిగా రాష్ట్ర కేబినెట్లో బీజేపీకి రెండు బెర్తులు ఖాళీ చేయడం కోసం ఇద్దరు మంత్రులకు ఉద్వాసన రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ అవసరాల కోసం నిర్ణయం! పెదవి విప్పని ఇరు పార్టీల నేతలు సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భాగస్వామి కానుందా? రెండు కేంద్ర మంత్రి పదవులను తీసుకుని.. రాష్ట్రంలో బీజేపీకి రెండు మంత్రి పదవులను కేటాయించనుందా..!? దీనిపై అనూహ్య నిర్ణయం తీసుకునే దిశలో టీఆర్ ఎస్ పయనిస్తోందా..? కొద్దిరోజులుగా రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలోనూ ఇదే తరహా ప్రచారం విస్తృతంగా సాగుతోంది.. ఇదే సమయంలో ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోందనే అభిప్రాయాలూ వస్తున్నాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర అధికార పీఠాన్ని ఎనిమిది నెలల కింద టీఆర్ఎస్ సాధారణ మెజారిటీతో దక్కించుకుంది. సుస్థిరత సాధించే యోచనతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేసి బలాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కోసం ప్రయత్నిస్తోంది. ఇది ఫలిస్తే త్వరలోనే టీఆర్ ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ రాజకీయ అవసరాలతో పాటు కొత్త రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం మద్దతు, వెన్నుదన్ను అవసరమన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆలస్యంగా తెలిసిందన్న విమర్శకుల మాటలకు జవాబు చెప్పేలా ఎత్తులు వేస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాల్సినంత అవసరం బీజేపీకి లేకున్నా... తెలంగాణలో పార్టీ భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని మొగ్గుచూపుతున్నట్లు పేర్కొంటున్నారు. దగ్గరయ్యేందుకు తహ తహ! టీఆర్ఎస్ మూడు నాలుగు నెలలుగా కేంద్రంలోని బీజేపీ నేతలకు దగ్గరయ్యే ప్రయత్నాలను వేగవంతం చేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సీహెచ్ విద్యాసాగర్‌రావుకు, కేంద్ర మంత్రిగా పదవి పొందిన బండారు దత్తాత్రేయకు పౌర సన్మానం చేసింది. ఇక ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛభారత్’ను తొలుత టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్లకు సమావేశం నిర్వహించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాలని మార్గనిర్దేశనం చేశారు. తర్వాత ఢిల్లీలో మంత్రులతో భేటీలు, తాజాగా సోమవారం ప్రధానితో సమావేశం ద్వారా తాము పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నామన్న సంకేతాలిచ్చే ప్రయత్నం చేశారు. కనీసం ఇద్దరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కావాలన్న ప్రయత్నాల్లో టీఆర్ఎస్ నేత ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర కేబినెట్లోకి బీజేపీ..? మరోవైపు రాష్ట్ర మంత్రి వర్గంలోకి బీజేపీని చేర్చుకోవడం ద్వారా మైత్రీ బంధాన్ని దృఢం చేసుకునే యోచనతో గులాబీ నేతలు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన మంత్రుల్లో ఇద్దరిని పార్టీ కార్యకలాపాలకు పరిమితం చేసి, ఖాళీ అయ్యే ఆ స్థానాలను బీజేపీ ఎమ్మెల్యేలతో భర్తీ చేయాలన్న వ్యూహంతో ఉన్నారని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మోదీ హవా కనిపించినా... తెలంగాణలో మాత్రం పనిచేయలేదు. ఆ పార్టీ కేవలం ఒకే ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. టీడీపీతో పొత్తు ద్వారా ఐదు ఎమ్మెల్యే స్థానాలతో తృప్తిపడింది. భవిష్యత్‌లోనైనా రాష్ట్రంలో బీజేపీని తిరుగులేని శక్తిగా మలుస్తామన్న భరోసా ఆ పార్టీ నాయకత్వానికి లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భ విష్యత్ రాజకీయ అవసరాల కోసమైనా... అధికారం పంచుకుంటే మేలన్న భావన ఈ పార్టీ నాయకుల్లోనూ అంతర్గతంగా ఉంది. ఇక దేశంలో ‘జనతా పరివార్ ’ కూటమి బలపడకుండా కూడా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోందన్న విశ్లేషణలు అందుతున్నాయి. దీంతోపాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలి తాల తర్వాత కమలనాథులు జాగ్రత్త పడుతూ టీఆర్ఎస్ లాంటి పార్టీలను చేరదీసేందుకు సుముఖంగానే ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఈ పరిణామాలపై ఇరు పార్టీల నేతలు నోరు మెదపడం లేదు. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం త్వరలో జరగబోయే మార్పులకు అద్దం పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇద్దరు మంత్రులు ఔట్! రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఇద్దరిని పూర్తిగా పార్టీకి అంకితం చేసే ఆలోచనలో గులాబీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. వారి సేవలను పార్టీకి వినియోగించుకోవడం ద్వారా రెండు బెర్తులు ఖాళీ చేయించవచ్చని తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత లక్ష్మణ్‌లను ఆ స్థానాల్లో భర్తీ చేస్తారని మరో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రి వర్గంలోకి రాజ్యసభ సభ్యుడు కేశవరావు, నిజామాబాద్ ఎంపీ కవితను పంపుతారన్న వార్తలు షికారు చేస్తున్నాయి. కేంద్ర కేబినెట్లో టీఆర్ఎస్ చేరుతుందన్న వార్తలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆదివారం ఖండించినా.. సోమవారం కూడా ఈ ప్రచారం మాత్రం తగ్గలేదు. దేశ రాజధాని కేంద్రంగా జాతీయ మీడియాలోనూ ఈ అంశం ప్రధాన వార్త కావడం గమనార్హం. -
కుల రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చేటు
ఆత్మీయ అభిమాన సదస్సులో కేంద్ర మంత్రి వెంకయ్య విశాఖపట్నం: కుల రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యానికి చేటు చేకూరుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో దీని ప్రభావం ఎక్కువగా చూపుతుందన్నారు. రుషికొండ ప్రాంతం సాయిప్రియ బీచ్ రిసార్ట్స్ వేదికగా ఆదివారం ఏర్పాటైన ఆత్మీయ అభిమాన సదస్సులో ప్రసంగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కులం, ధనం, మద్యం, విందులు ప్రాధాన పాత్ర పోషించాయన్నారు. ఇలా ఖర్చుచేసి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజా సేవలకు ప్రాధాన్యం ఇవ్వలేరని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు కుర్చీ కోసం కులాన్ని వినియోగించుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి సంస్కృతి మారాలన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్డీఏ మంచి పాలన అందిం చి దేశ ప్రజలకు మేలు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్టణాన్ని సాంస్కృతిక, వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం మరో కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలించిన కాంగ్రెస్‌ను ప్రజలు ఇంటికి పంపారన్నారు. ఈ సదస్సుకు వెంకయ్యనాయుడితో కలిసి చదువుకున్నవారు, స్నేహితులు, కలిసి పార్టీలో పనిచేసినవారు పెద్ద సంఖ్యలో హాజరై సత్కరించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని నాలుగు అడుగుల తెలుగుతల్లి విగ్రహాన్ని బహూకరించారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణు కుమార్రాజు, లలితకుమారి, బీజేపీ నాయకుడు పి.వి.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమస్యలపై వెంకయ్యకు వినతి సీతమ్మధార : రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఎన్ఎంయూ ప్రతినిధులు మంత్రి వెంకయ్యను కోరారు. ఈ మేరకు యూనియన్ గౌరవాధ్యక్షుడు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆధ్వర్యంలో రుషికొండలోని సాయిప్రియ రిసోర్ట్స్లో వినతి పత్రా న్ని అందజేశారు. సీమాంధ్రలో కొత గా ఆర్టీసీ కేంద్ర కార్యాలయం ఏర్పా టు చేయాలని, కొత్తబస్సులను డిపోలకు ఇవ్వాలని, సీమాంధ్ర ఆర్టీసీని ప్ర భుత్వంలో విలీనం చేసేవిధంగా చర్య లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అంత కు ముందు వెంకయ్యను గజమాలతో సత్కరించారు. ఎన్ఎంయూ విజయనగరం జోనల్ కార్యదర్శి పి.వి.వి.మోహన్, రాష్ట్ర కార్యదర్శి కె.నందగోపాల్, సీసీఎస్ బోర్డు సభ్యుడు టి.ఎస్.రావు, రూరల్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి పి.ఎన్.రావు, ఎం.వి.ఆర్.మూర్తి, వాల్తేరు డిపో కార్యదర్శి ఆర్.వసంతరావు, అర్బన్ కార్యదర్శి ఎ.కె.శివాజీ పాల్గొన్నారు. -
బస్సుయాత్ర తర్వాత తీర్థయాత్రే
కాంగ్రెస్‌పై ఏలూరు సభలో వెంకయ్య ధ్వజం పవన్ కల్యాణ్ రాక లోక కల్యాణం కోసమేనని వ్యాఖ్య ‘సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోరుుంది. మిగిలిన కొద్దిపాటి నాయకులూ ఏం చేయాలో తెలియక బస్సు యాత్రలు చేస్తున్నారు. బస్సు యూత్రలయ్యూక కాంగ్రెస్ పార్టీకి తీర్థయూత్రలు ఖాయం’ అని బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ‘మోడీ ఫర్ పీఎం’ ప్రజా ఉద్యమంలో భాగంగా శనివారం సాయంత్రం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు క్రీడా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ అధ్యక్షతన నిర్వహించిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ లోక కల్యాణం కోసం వస్తున్నాడని.. వద్దనే ప్రసక్తే లేదన్నారు. రెండు మూడు రోజుల్లో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి రానున్నాయన్నారు. అరవయ్యేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం సర్వనాశనమైందని.. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. దేశానికి ఆశాకిరణంలా మోడీ ప్రజల ముందుకు వచ్చారని చెప్పారు. పోలవరాన్ని ఆపడం, నీళ్లు రాకుండా చేయడం ఎవరితరం కాదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ అతి తెలివితో ఇటు సీమాంధ్రలోనూ, అటు తెలంగాణలోనూ రకరకాలుగా మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలుపెంచుతున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలు దేశాన్ని పాలించలేవంటూ.. జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘తెలంగాణ, సీమాంధ్రలను మళ్లీ కలుపుతాడట.. ఇదేమన్నా పాతాళభైరవి సినిమానా?’ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకివే ఆఖరి ఎన్నికలని వెంక య్యనాయుడు స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ అహంకారానికి చెంపపెట్టు: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు- కాంగ్రెస్ అహంకారానికి చెంపపెట్టని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు దునుమాడారు. బీజేపీపై దుష్ర్పచారం చేసినా, నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషించినా, ఓట్ల కోసం చివరి నిమిషం వరకు అనేక ప్రలోభ పథకాలు ప్రకటించినా ఓటర్లు కాంగ్రెస్‌ను తుంగలో తొక్కి విజ్ఞత చాటారన్నారు. పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, అరుణాజ్యోతి, ఎన్.రామచంద్రరావు, ఎస్.కుమార్‌తో కలిసి ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా కాంగ్రెస్ వ్యతిరేకతే వ్యక్తమైందన్నారు. అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా పాలన సాగించిన బీజేపీయే ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో షీలా దీక్షిత్ సహా కాంగ్రెస్ నేతలందరూ ఓడిపోవడమే ప్రజలు మార్పుకోరుతున్నారనే దానికి నిదర్శనమని చెప్పారు. ఆదర్శ పాలన అందిస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు బాగా స్పందించారన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలోనూ గెలుస్తాం: కిషన్‌రెడ్డి కుటుంబ వారసత్వ రాజకీయాలను తోసిరాజని ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశ ప్రజలు మార్పుకోరుతున్నారనే దానికి నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయమే సంకేతమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏమి చేయబోతున్నారో, ఏమి కోరుకుంటున్నారో ఈ ఫలితాలు స్పష్టంచేశాయని చెప్పారు. రాష్ట్ర అనిశ్చితికి తెరపడి ఉభయ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని, మోడీ హవా కొనసాగుతుందన్నారు. రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని దత్తాత్రేయ చెప్పారు. రాహుల్ పేరు చెబితేనే ప్రజలు పారిపోతున్నారని నాగం జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలన్నారు. -
మోడీ జనాదరణను చూసి కాంగ్రెస్‌కు భయం: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకుగాను కాంగ్రెస్ పార్టీ.. సీబీఐని ప్రయోగించాలని ప్రయత్నిస్తోందని, అదే జరిగితే దేశంలోనే ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని బీజేపీ సీనియర్ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు హెచ్చరించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన బీజేపీ ‘నవభారత యువభేరి’ సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశ ప్రజలందరూ ఇప్పుడు గుజరాత్ మోడల్ పాలనను, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని.. అందుకు భయపడి కాంగ్రెస్ ఆయనపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా పేరున్న సీబీఐని ఆ పార్టీ మోడీ దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశ ప్రజలు ఈ రోజు మార్పును కోరుకుంటున్నారని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలను ఒక్కటి చేసే పార్టీ బీజేపీయేనని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్, రాయలసీమ కాంగ్రెస్, కోస్తా కాంగ్రెస్‌లుగా చీలిపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలోనూ కాంగ్రెస్ అనేక రకాల పేర్లతో ఎన్నో సార్లు చీలిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రత్యర్థిగా చెప్పుకునే కమ్యూనిస్టులు కూడా రకరకాలు చీలిపోయారని, జనతాదళ్ పార్టీ సైతం చీలికలు పీలికలు అయిందన్నారు. దేశ ప్రజలకు సమగ్ర విశ్వాసం కలిగించగలిగేది బీజేపీ ఒక్కటేనని చెప్పారు. ముస్లింలీగ్ లాంటి పార్టీలను ముద్దాడిన కాంగ్రెస్‌కు బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శించే అర్హత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. మజ్లిస్ కోరలు పీకగలిగేది బీజేపీ ఒక్కటేనని చెప్పారు. దేశంలో మూడో ఫ్రంట్ ఎండమావేనన్నారు.