vendetta politics
-
అర్నాబ్ న్యాయ పోరాటం
సాక్షి, ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసుకు సంబంధించి తన 'అక్రమ అరెస్టు' ను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర అలీబాగ్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేశారని, తన ఇంట్లోకి చొరబడి మరీ పోలీసులు తనపైనా,తన కుటుంబంపైనా దాడిచేశారని అర్నాబ్ పిటిషన్లో ఆరోపించారు. తనను అక్రమంగా, చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారన్నారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, తన కుమారుడిపై దాడిచేశారన్నారు. తన ఛానెల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో ఇది మరో ప్రయత్నమని విమర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను వేటాడుతున్నారని(విచ్–హంట్ చేస్తున్నారని) తన పిటిషన్లో అర్నాబ్ పేర్కొన్నారు. జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను విచారించనుంది. కాగా ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోస్వామిని బుధవారం అరెస్టు చేసిన పోలీసులు రాయ్‌గడ్ జిల్లాలోని అలీబాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. తరువాత ఆయనను అలీబాగ్‌లోని మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరచగా, నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. (అర్నబ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు) -
బీజేపీ స్వయంకృతం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉందని.. బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు మాని... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పడం బీజేపీ స్వయంకృతమని, అన్ని అంశాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే వృద్ధిరేటు మందగమనంలో సాగుతోందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కావడం.. ఆర్థిక మాంద్యం కొనసాగుతోందనేందుకు సూచన అని ఆయన చెప్పారు. ఇంతకంటే ఎక్కువ వేగంగా వృద్ధి చెందే సామర్థ్యం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేకపోయిందని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత, రైతులు, వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక వేత్తలకు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరించారు. తయారీ రంగం వృద్ధి 0.6 శాతం మాత్రమే ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమల్లో లోపాల ఫలితాల నుంచి దేశం బయటపడలేదు అనేందుకు తాజా పరిణామాలు నిదర్శనమని విమర్శించారు. మోదీ హయాంలో దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని, వాటి స్వతంత్ర ప్రతిపత్తికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్బీఐ నుంచి అందిన రూ.1.76 లక్షల కోట్లతో ఏం చేయాలన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నది నిజమైతే... ఆర్బీఐకు పరీక్షేనని అన్నారు. పన్ను ఆదాయంలో భారీ కోత పడగా.. చిన్న, పెద్ద పారిశ్రామికవేత్తలందరూ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వేధింపులకు గురవుతున్నారన్నారు. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.5 లక్షల ఉద్యోగాలు పోయాయని, గిట్టుబాటు ధరల్లేక రైతుల ఆదాయాలు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
ప్రధాని మోదీపై మమతా ఘాటైన వ్యాఖ్యలు
రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ అరెస్టుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రధాని మోదీ అరెస్టు చేయాలనుకుంటే తనతో పాటు, తమ ఎంపీలు, ఎమ్మెల్యేలందర్ని అరెస్టు చేసుకోండని, కానీ పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా తాము చేపట్టే నిరసనను మాత్రం వదిలేది లేదని పట్టుబిగించారు. సాధారణ ప్రజల కోసం తమ నిరసన కచ్చితంగా కొనసాగిస్తామన్నారు. రాజకీయ కుట్ర కొత్త అవతారమెత్తిందని, తమ ఎంపిలందరిన్నీ ప్రధాని అరెస్టు చేపించినా తాను ఆశ్చర్యపోనని చెప్పారు.. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు బ్లాక్‌మనీని వెనక్కి తీసుకొస్తానని మోదీ చేసిన వాగ్దానం మంటగలిసిపోయిందని విమర్శించారు. బ్లాక్‌మనీ డిపాజిట్ కాకపోగా, కనీసం ప్రభుత్వం వాటిని గుర్తించను కూడా గుర్తించలేదున్నారు. సాధారణ ప్రజానీకం దగ్గర అసలు ఆ నోట్లే లేవన్నారు. మోదీ తీసుకున్న ఈ చర్యతో మొదటిసారి ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోయిందని, ఆర్బీఐ పైనా విశ్వసనీయత కోల్పోయారని చెప్పారు. అంబేద్కర్ పేరుమీద నేడు ప్రధాని లాంచ్ చేసిన భీమ్ యాప్‌పైనా మమతా మండిపడ్డారు. అంబేద్కర్ పేరుపై ఈ లాటరీ యాప్‌ను ఆవిష్కరించడం, మోదీ క్రూర మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. బలహీన ప్రజలను ఇది అవమాన పరుస్తోందని విమర్శించారు.