స్వాతంత్య్ర సమరయోధుడి మృతి
వేములపల్లి: నల్గొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ స్వాతంత్ర్య సమరయోధుడు కన్నుమూశారు. వేములపల్లి మండలం పోరెడ్డిగూడెం గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి(100) మృతిచెందారు. జాతిపిత గాంధీజీ స్ఫూర్తితో వెంకట్రామిరెడ్డి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.