రాజమండ్రిలో రియల్టర్ దారుణహత్య
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం నాగదేవి థియేటర్ సమీపంలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి కోర్లంపేటకాలనీకి చెందిన కటికతల వెంకట శేషు(53)గా గుర్తించారు. శేషును గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. వ్యాపార లావాదేవీల్లో గొడవ జరగడం వల్లే హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.