Venkatarao
-
‘అనర్హత’ పిటిషన్లపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. రాజ్యాంగపరమైన అంశాల నేపథ్యంలో ఏప్రిల్ నుంచి సుదీర్ఘ వాదనలు విన్నది. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పలు తీర్పులను ఉదహరిస్తూ వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కేపీ.వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లోకి చేరారని ఆయనను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయతి్నంచిన స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఎలీ్పనేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. దానం, కడియం తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదు. స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పదిరోజులకే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్‌కు కనీస గడువు కూడా ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదు. తాజా పిటిషన్లను కొట్టేయాలి.. లేనిపక్షంలో డివిజన్ బెంచ్‌కు నివేదించాలి. గత శాసనసభ స్పీకర్ ఎదుట పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లో స్పీకర్‌కు నిర్దిష్ట గడువు నిర్ణయించేందుకు ఇద్దరు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది’అని పేర్కొన్నారు. లిఖితపూర్వక వాదనలను శుక్రవారం సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి.. తీర్పు రిజర్వు చేశారు. -
కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో బీఆర్ ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినా, కాంగ్రెస్ సమావేశాలకు కూడా ఆయన హాజరవుతున్నారు. శనివారం తుక్కుగూడలో జరిగిన జనజాతర సభకు కూడా ఆయన హాజరై వేదికపై కూర్చున్నారు. ఈయన కాంగ్రెస్‌లోకి వస్తారన్న ప్రచారం చాలాకాలంగా జరుగుతున్నా ఆదివారం పార్టీ కండువా కప్పుకుని అధికారికంగా ఆ పార్టీలో చేరారు. వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది ఎమ్మెల్యేలు ఆ జిల్లాలో ఉండగా, వెంకట్రావు చేరికతో పదికి పది చోట్లా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కావడం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరడం గమనార్హం. -
6న కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే?
ఇల్లెందు: భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన గత నెల 12న మణుగూరులో కాంగ్రెస్ ఆధ్వర్యాన జరిగిన సభకు సైతం హాజరయ్యారు. మంగళవారం ఇల్లెందులో జరిగిన మహబూబాబాద్ లోక్‌సభ స్థాయి కాంగ్రెస్ సమావేశంలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీనిపై వెంకట్రావును వివరణ కోరగా త్వరలో వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. వ్యవస్థలను కేసీఆర్ నాశనం చేశారు: తుమ్మల ఇల్లెందు సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ దుర్వి నియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతామని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగిస్తూ కొత్తవి కూడా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 7,145 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రతి గింజనూ కొంటామన్నారు. ఇప్పటికే 92.36 శాతం రైతుబంధు పంపిణీ పూర్తి చేశామని, పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. -
అంబరాన్నంటిన పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత మంగళవారం ఉదయం పైడితల్లి అమ్మవారికి మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వ్రస్తాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకే సిరిమాను హుకుంపేట నుంచి ఆలయానికి చేరుకుంది. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను కట్టడాలు పూర్తి చేసి, పూజలు చేశారు. 4:30 గంటలకు మూడు లాంతర్లు వద్దనున్న చదురుగుడి నుంచి సిరిమాను రథం బయల్దేరింది. మూడుసార్లు ఆలయం నుంచి కోట వరకూ వెళ్లింది. సిరిమానుపై ఆశీనులైన పూజారి రూపంలో ఉన్న అమ్మవారు పైనుంచి అక్షితలను చల్లి భక్తులను ఆశీర్వదించారు. ఉత్సవం సాయంత్రం 5.56 గంటలకు పూర్తయింది. సిరిమాను తిరుగుతున్నంతసేపూ ఆలయంలోని అమ్మవారికి వేదపండితులు లక్ష పుష్పార్చన చేశారు. సుమారు మూడున్నర లక్షల మంది సిరిమాను ఉత్సవాన్ని వీక్షించినట్లు అధికారులు అంచనావేశారు. విజయనగరం కోటపై నుంచి అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, జిల్లా సహకార బ్యాంకు ప్రాంగణంలోనుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సిరిమానును వీక్షించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర నిఘా పెట్టడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సిరిమానోత్సవాన్ని ఆద్యంతం పర్యవేక్షించారు. సిరిమానోత్సవం సందర్భంగా నిర్వహించిన విజయనగరం సాంస్కృతిక ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు సిరిమానోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే పలువురు ప్రముఖులు, భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులతో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, సినీ నటుడు సాయికుమార్ తదితరులు దర్శించుకున్నారు. -
జనం లేకే కుట్రకు తెర
సాక్షి ప్రతినిధి, విజయవాడ/హనుమాన్ జంక్షన్ రూరల్/నూజివీడు: యువగళం పాదయాత్ర జనాలు లేక వెలవెలబోయింది. గురువారం మధ్యాహ్నం తర్వాత జనం బాగా పలుచబడి పోవటంతో ఇటీవల టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుపై లోకేశ్ విరుచుకుపడ్డారు. అసమర్థుడు.. జనాలను తేలేకపోయాడని ఇతర నాయకుల ముందే చిందులు తొక్కారు. కొల్లు రవీంద్రను పిలిచి మీరైనా జనాన్ని పోగు చేసి.. జిల్లాలో చివరి రోజు యాత్రలో పరువు పోకుండా కాపాడాలని కోరారు. దీంతో కొల్లు రవీంద్ర గతంలో టీడీపీలో పని చేసిన కొంత మంది నాయకులకు ఫోన్ చేసి.. బతిమిలాడి రప్పించారు. కొంత మంది నేతలు కార్యకర్తలను బలవంతంగా అప్పటికప్పుడు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టీడీపీ నేతలు, కార్యకర్తల తీరు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నాలుగేళ్లుగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైఎస్సార్సీపీ నాయకుడు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కసుకుర్తి శ్రీనివాసరావు, ఆయన తనయుడు చిన్ను వారి సొంత స్థలంలో బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనిపై లోకేశ్ యువగళం టీం సభ్యులు రౌడీమూకల్లా విరుచుకుపడ్డారు. క్షణాల్లో ఆ బ్యానర్‌ను ధ్వంసం చేసి, అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తలారి ఈశ్వరరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కసుకుర్తి శ్రీనివాసరావు, ఆయన తనయుడు చిన్ను, పార్టీ నాయకులు తలారి పండు, మెడబలిమి చిరంజీవిలపై విచక్షణారహితంగా దాడి చేశారు. బ్యానర్‌ను కట్టిన కర్రలతో వైఎస్సార్సీపీ నాయకులను ఇష్టారాజ్యంగా కొట్టారు. కిందపడేసి కాళ్లతో తొక్కారు. అరుపులు, కేకలతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నారా లోకేశ్, దేవినేని ఉమా కనుసైగతో రెచ్చిపోయి రాక్షసత్వంగా ప్రవర్తించారు. వారి నుంచి కర్రలను లాక్కునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. అనంతరం టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించారు. ఈ దాడిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా విరుచుకుపడ్డారు. కొందరి సెల్ఫోన్లు, కెమెరాలు లాక్కుని డేటాను డిలీట్ చేశారు. ఎమ్మెల్యే వంశీ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కులం పేరుతో దూషించారు.. టీడీపీ నేతలు తమను ఎస్సీ, ఎస్టీ కులం పేరుతో దూషించారని, దాడి చేసి కొట్టారని వైఎస్సార్సీపీ నేతలు వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతలో టీడీపీ నేత దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, ఇతర నేతలు, కార్యకర్తలు వారిని దూషిస్తూ పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చారు. ఆ ముగ్గుర్ని కులంపేరుతో దూషిస్తూ పోలీసుల ఎదుటే వారిపై దాడికి యత్నించారు. పోలీసులు టీడీపీ నేతలను బయటకు పంపారు. ఈ ఘటనపై దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కొల్లు రవీంద్రతో కలిపి 22 మంది పోలీస్‌స్టేషన్‌లోనే తమపై దాడికి యత్నించారని, కులం పేరుతో దూషించారని వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అంతకు ముందు వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మైలేజ్ కోసం దిగజారిన టీడీపీ కృష్ణాజిల్లాలో యాత్ర చివరి రోజు జనాలు లేకపోవటంతో ఏదో ఒక రకంగా శాంతిభద్రతల సమస్య సృష్టించి మైలేజ్ పొందాలని టీడీపీ నేతలు పన్నాగం పన్నారు. వైకాపా కార్యకర్తలను, పోలీసులను కవ్వించి ఏదొక విధంగా శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగా కొద్దిసేపు ధర్నా, నిరసన చేపట్టారు. పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంయమనం పాటించి ఎదురు దాడికి దిగకపోవడంతో వారు చేసేదేమీ లేక యాత్రను త్వరగా ముగించుకుని ఏలూరు జిల్లాలోకి వెళ్లిపోయారు. కాగా, యువగళం పాదయాత్రలో లోకేశ్‌ను అడ్డుకున్నారని, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమను పోలీస్‌స్టేషన్‌లోకి రాకుండా అడ్డుకున్నారని టీడీపీ నేతలు కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. ఆయా ఘటనల్లో వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ జాషువా తెలిపారు. పాదయాత్రలో ఏబీవీ ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం వద్ద టీడీపీ నేత లోకేశ్ పాదయాత్ర ఏలూరు జిలా్లలోకి ప్రవేశించింది. పలువురు నేతలు ఆయనకు స్వాగతం పలికారు. సింగన్నగూడెంలో గౌడ సామాజిక వర్గీయులతో, మల్లవల్లిలో బీసీ కులస్తులతో, కొత్త మల్లవల్లిలో ఆయిల్‌పామ్ రైతులతో ఆయన భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మల్లవల్లిలో లోకేశ్‌ను కలిసి మంతనాలు సాగించారు. పరోక్షంగా ఏర్పాట్లు సైతం పర్యవేక్షించారు. గురువారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో బస వద్ద ఆయన లోకేశ్‌ను కలిసి చర్చించారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, రావి వెంకటేశ్వరరావుతో కూడా మాట్లాడారు. టీడీపీ నేతల బ్యానర్లలో ఆయన ఫొటో ముద్రించడం గమనార్హం. -
అధికారం ఇచ్చినా ఏమీ చేయని అసమర్థులు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఒక్కసారి అధికారం ఇవ్వండి అని కాంగ్రెస్ అడుగుతోంది. ఇప్పటి వరకు పది పదకొండు మార్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేని అసమర్థులు కాంగ్రెస్ నేతలు. వారు ఇప్పుడు ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా వ్యవహరిస్తూ, పేదల కోసం పనిచేసే కేసీఆర్‌ను తిడుతున్నారు. ఎవరి వల్ల మంచి జరుగుతుందో చూడండి. ఎవరైనా డబ్బులు ఇస్తే ఏం చేయాలో ఆలోచించుకుని ఓటు మాత్రం కేసీఆర్‌కు వేయండి’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో గురువారం మంత్రి సమక్షంలో కాంగ్రెస్ నేత డాక్టర్ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉన్న తెల్లం వెంకట్రావు, నెల రోజుల క్రితం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా, గురువారం తిరిగి బీఆర్ఎస్లో చేరిన వెంకట్రావుకు, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. కాంగ్రెస్ పార్టీతో వెళ్లడం అంటే కుక్కతోకను పట్టుకుని గోదావరి ఈదినట్లే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో అపార ఆదరణ లభిస్తోంది. రోజుకో పార్టీ విలీనంతో జాతీయ స్థాయిలో కేసీఆర్ శక్తిమంతమైన నేతగా ఎదుగుతున్నారు. బీఆర్ఎస్కు జాతీయ స్థాయిలో పునాది పడాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో 90 నుంచి 95 సీట్లు ఇవ్వడం ద్వారా మన నాయకుడికి కొత్త శక్తి, ఉత్సాహం ఇవ్వాలి. ఇక్కడి తీర్పు మహారాష్ట్రలో ప్రతిధ్వనించేలా మీ నిర్ణయం ఉండాలి. రేపటి రోజున కేంద్రంలో మనం లేకుండా ఎవరూ ప్రధాన మంత్రి అయ్యే పరిస్థితి ఉండదు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలు గెలిచేలా మద్దతు ఇవ్వండి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో ముందుకు గిరిజన పోరాట యోధుడు కొమురం భీం కోరుకున్న జల్ జంగల్ జమీన్ నినాదం స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా కేసీఆర్‌తోనే సాధ్యమైందని, పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో మిషన్ భగీరథ, పోడు భూములకు పట్టాలు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలు ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు, నక్సలైట్లు గతంలో చెప్పిన సమ సమాజ స్థాపన ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోందని, పెరుగుతున్న సంపదతో పట్టణాలు, పల్లెల మధ్య అంతరం తగ్గుతోందని పేర్కొన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నా, రూ.200 పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పడు రూ.4 వేలు ఇస్తామని చెపుతోందని, అయితే కాంగ్రెస్ నాయకులు రూ.40 వేలు ఇచ్చినా ప్రజలు నమ్మబోరని కేటీఆర్ అన్నారు. యాదాద్రి ఆలయ స్థాయిలో భద్రాచలం ఆలయా న్ని అభివృద్ధి చేస్తామని, భద్రాచలానికి వరద ముప్పును తప్పించేందుకు కరకట్ట నిర్మిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నాయకులు ఇప్పుడు తెలంగాణ అమరవీరులు, ఉద్యమం గురించి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీలు తాతా మధు, మధుసూదనాచారి, ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరారు. -
ఆర్బీకేలు ఓ వినూత్నమైన ఆలోచన
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం (మైలవరం): ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా గ్రామ స్థాయిలో పశుపోషకులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని కేరళ రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి జె. చించురాణి అన్నారు. ఆర్బీకేలే ఓ వినూత్నమైన ఆలోచన అని, వీటి ద్వారా గ్రామ స్థాయిలో సేవలందించడం నిజంగా గొప్ప విషయమని ప్రశంసించారు. ఏపీ పశు దాణా చట్టం – 2020 అమలుపై అధ్యయనం చేసేందుకు మంత్రి చించురాణి నేతృత్వంలోని కేరళ ప్రభుత్వ సెలక్ట్ కమిటీ బృందం బుధవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి ఆర్బీకేను సందర్శించింది. ఆర్బీకే ద్వారా పశుపోషకులకు అందిస్తున్న సేవలను బృందం సభ్యులు పరిశీలించారు. కియోస్క్ ద్వారా సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్)ను పాడి రైతులు స్వయంగా బుక్ చేసుకొనే విధానాన్ని పరిశీలించారు. డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. అంబులెన్స్ ద్వారా మూగ, సన్న జీవాలకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. హైడ్రాలిక్ లిఫ్ట్‌తో పశువును వాహనంలోకి ఎక్కించడం, ఆస్పత్రికి తరలించడాన్ని పరిశీలించారు. వెల్నెస్ సెంటర్లో అందుతున్న వైద్యం, మందులు, 104 సేవలు తెలుసుకున్నారు. మంత్రి చించురాణి, ఇతర సభ్యులు నట్టల నివారణ మందును పశువులకు తాగించారు. అనంతరం కంచికచర్ల మండలం పరకాలపాడులోని డాక్టర్ వైఎస్సార్ దేశీయ గో జాతుల పెంపక కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఉత్పత్తి చేసే పాల పదార్థాలు, గో మూత్రం, పేడ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచి దేవమాత వారిని సత్కరించారు. అనంతరం మంత్రి చించురాణి మాట్లాడుతూ రాష్ట్రం పశుపోషణకు పెద్ద పీట వేస్తూ గ్రామ స్థాయిలో పశుసంవర్ధక అధికారి ద్వారా రైతు ముంగిటే సేవలందిస్తున్న తీరు అద్భుతమన్నారు. నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణాను 60 శాతం సబ్సిడీపై అందించడం మంచి విధానమని చెప్పారు. సంచార పశు ఆరోగ్య సేవా రథం డిజైన్ చాలా బాగుందని, ఇలాంటి సౌకర్యాలు తమ రాష్ట్రంలోని అంబులెన్స్‌లో లేవన్నారు. ఏపీని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. ఈ బృందంలో కేరళ ఎమ్మెల్యేలు సీకే ఆశా, జాబ్మైచిల్, సీహెచ్ కుంబంబు, కేపీ కున్హమ్మద్ కుట్టీ, డాక్టర్ మాథ్యూ కుజల్ నాదన్, కురుక్కోలి మొయిద్దీన్, డీకే మురళి, మోన్స్ జోసఫ్, కేపీ మోహన్, యూ ప్రతిభ, కేడీ ప్రసేనన్, ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏక కౌసిగన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఏపీ పసుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ ఎస్.వెంకట్రావు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
కృష్ణా పుష్కరాలలో తొలిరోజు విషాదం
-
కృష్ణా పుష్కరాలలో తొలిరోజు విషాదం
కృష్ణా పుష్కరాల మొదటిరోజు విషాదం చోటుచేసుకుంది. విజయవాడ సమీపంలో ఇన్నోవా కారు ఢీకొని ఓ కానిస్టేబుల్ మరణించారు. చిత్తూరు జిల్లాకు చెందిన వెంకట్రావు అనే కానిస్టేబుల్ కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వర్తించేందుకు విజయవాడ వచ్చారు. అలా వచ్చినవారందరికీ గూడవల్లి వద్ద ఓ కాలేజిలో వసతి కల్పించారు. శుక్రవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు వెంకట్రావు బయల్దేరి జాతీయ రహదారి దాటుతుండగా.. వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఆయనను ఢీకొంది. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో విజయవాడకు కూడా తరలించారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకట్రావు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టిల మోసగాడికి మహిళల దేహశుద్ధి
తగరపువలస(విశాఖపట్టణం): చిట్టిల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన ఒక వ్యక్తికి మహిళలు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన విశాఖ జిల్లా తగరపువలసలోని కొండపేట గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిట్టిల నిర్వాహకుడు వెంకట్రావు పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. తీరా డబ్బులు తిరిగి ఇవ్వాల్సి సమయంలో ముఖం చాటేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. గురువారం రాత్రి అతన్ని పట్టుకున్న మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు.