ఆర్బీకేలు ఓ వినూత్నమైన ఆలోచన | RBKs are an innovative idea | Sakshi
Sakshi News home page

ఆర్బీకేలు ఓ వినూత్నమైన ఆలోచన

Published Thu, Jun 22 2023 4:15 AM | Last Updated on Thu, Jun 22 2023 10:24 AM

RBKs are an innovative idea - Sakshi

సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం (మైలవరం): ఆం­ధ్ర­ప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీ­కే) ద్వా­రా గ్రామ స్థాయిలో పశుపోషకులకు నా­ణ్య­మై­న సేవలు అందిస్తున్నారని కేరళ రాష్ట్ర పశు­సంవర్ధక శాఖమంత్రి జె. చించురాణి అ­న్నా­రు. ఆర్బీకేలే ఓ వినూత్నమైన ఆలోచన అని, వీటి ద్వారా గ్రామ స్థా­యిలో సేవలందించడం నిజంగా గొప్ప విషయమని ప్రశంసించా­రు. ఏపీ పశు దాణా చట్టం – 2020 అమలుపై అధ్యయనం చేసేందుకు మంత్రి చించురాణి నే­తృ­త్వంలోని కేరళ ప్రభుత్వ సెలక్ట్‌ కమిటీ బృందం బుధవారం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి ఆర్బీకేను సంద­ర్శించింది.

ఆర్బీకే ద్వారా పశుపోషకులకు అందిస్తున్న సేవ­లను బృందం సభ్యులు పరిశీలించారు. కియోస్క్‌ ద్వారా సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎ­ం­ఆర్‌)­ను పాడి రైతులు స్వయంగా బుక్‌ చేసుకొనే విధానాన్ని పరిశీలించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరో­గ్య సేవ వాహనంలో­ని అత్యాధునిక సౌకర్యా­ల­ను పరిశీలించారు. అం­బులెన్స్‌ ద్వారా మూగ, సన్న జీవాలకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నా­రు. హైడ్రాలిక్‌ లిఫ్ట్‌తో పశువును వాహనంలోకి ఎక్కించడం, ఆస్ప­త్రికి తరలించడాన్ని పరిశీలించా­రు. వెల్‌­నెస్‌ సెంటర్‌లో అందుతున్న వైద్యం, మందు­లు, 104 సేవలు తెలుసుకున్నారు.

మంత్రి చించు­­రాణి, ఇతర సభ్యులు నట్టల నివారణ మందు­ను పశువులకు తాగించారు. అనంతరం కంచిక­చర్ల మండలం పరకాలపాడులోని డాక్టర్‌ వైఎస్సార్‌ దేశీ­య గో జాతుల పెంపక కేంద్రా­న్ని సందర్శించా­రు. అక్కడ ఉత్పత్తి చేసే పాల పదార్థాలు, గో మూత్రం, పేడ ఉత్పత్తులను పరి­శీలించారు. ఈ సందర్భంగా సర్పంచి దేవమాత వారిని సత్కరించారు. అనంతరం మంత్రి చించురాణి మాట్లాడుతూ రాష్ట్రం పశుపోషణకు పెద్ద పీట వేస్తూ గ్రామ స్థాయిలో పశుసంవర్ధక అధికారి ద్వారా రైతు ముంగిటే సేవలందిస్తున్న తీరు అద్భుతమన్నారు. నాణ్యమై­న సం­పూర్ణ మిశ్రమ దాణాను 60 శాతం సబ్సి­డీపై అందించడం మంచి విధానమని చెప్పా­రు.

సంచార పశు ఆరోగ్య సేవా రథం డిజైన్‌ చాలా బా­గుం­దని, ఇలాంటి సౌకర్యాలు తమ రాష్ట్రంలోని అంబులెన్స్‌లో లేవన్నారు. ఏపీని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. ఈ బృందంలో కేరళ ఎమ్మెల్యేలు సీకే ఆశా, జాబ్‌మైచిల్, సీహెచ్‌ కుంబంబు, కేపీ కున్హమ్మ­ద్‌ కుట్టీ, డాక్టర్‌ మాథ్యూ కుజల్‌ నాదన్, కురు­క్కో­లి మొయిద్దీన్, డీకే మురళి, మోన్స్‌ జోసఫ్, కేపీ మోహన్, యూ ప్రతిభ, కేడీ ప్రసేనన్, ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏక కౌసి­గన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఏపీ పసుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement