Venugopal Dhoot
-
వీడియోకాన్ ఫౌండర్ అకౌంట్ల అటాచ్మెంట్.. సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: రూ. 5.16 లక్షల జరిమానా బకాయిలను రాబట్టుకునే దిశగా వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌కు చెందిన బ్యాంక్, డీమాట్, మ్యుచువల్ ఫండ్ ఖాతాలు, లాకర్లను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలను అనుమతించరాదంటూ బ్యాంకులు, డిపాజిటరీలు (సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్), మ్యుచువల్ ఫండ్ సంస్థలకు సూచించింది. అయితే, క్రెడిట్ లావాదేవీలకు అనుమతించవచ్చని పేర్కొంది. క్వాలిటీ టెక్నో అడ్వైజర్స్, క్రెడెన్షియల్ ఫైనాన్స్, సుప్రీం ఎనర్జీ వంటి సంస్థలతో తనకున్న పెట్టుబడులు, సంబంధం గురించి వెల్లడించకుండా, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ ఏడాది మార్చిలో ధూత్‌కు సెబీ రూ. 5 లక్షల జరిమానా విధించింది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఇదీ చదవండి ➤ ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్‌కు సీఈవోగా అంజలీ సూద్ దీంతో అసలుతో పాటు రూ. 15,000 వడ్డీ, రికవరీ వ్యయాల కింద మరో రూ. 1,000 కలిపి మొత్తం రూ. 5.16 లక్షలు బాకీ చెల్లించాలని అటాచ్మెంట్ నోటీసులో సెబీ ఆదేశించింది. వీడియోకాన్ గ్రూప్ సంస్థలకు రుణ సదుపాయాలు కల్పించినందుకు ప్రతిగా అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా పనిచేసిన చందా కొచర్, ఆమె భర్తకు ధూత్ ప్రయోజనం చేకూర్చారని (క్విడ్ ప్రో కో) ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ స్కాంలో కీలక పరిణామం: ఆ ముగ్గురికీ భారీ షాక్!
సాక్షి,ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ స్కాం కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందాకొచ్చర్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కుంభకోణంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. చందా కొచ్చర్ తోపాటు, ఆమె భర్త, దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌లపై చార్జిషీట్ దాఖలైంది. ముంబై సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో సీబీఐ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. రూ.3,250 కోట్ల రుణం మోసం కేసులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీబీఐ అధికారులు శనివారం తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ 2009 , 2011 మధ్య వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన ఆరు కంపెనీలకు రూ. 1,875 కోట్ల రూపాయల టర్మ్ రుణాన్ని మంజూరులో అవకతవకలు జరిగాయని సీబీఐ ప్రధాన ఆరోపణ. క్విడ్ ప్రో కింద వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలు మంజూరైనట్టు, ఇందులో ధూత్ అంతిమ లబ్ధిదారుడని సీబీఐ ఆరోపిస్తోంది. ఇందుకుగాను దీపక్ కొచర్‌కు చెందిన నూపవర్ రెన్యూవబుల్స్ లిమిటెడ్‌కు రూ. 64 కోట్లు, దక్షిణ ముంబైలోని ఫ్లాట్‌కు 2016లో రూ. 11 లక్షలు (విలువ రూ. 5.25 కోట్లు) లంచంగా ముట్టాయని సీబీఐ పేర్కొంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో చందాకొచ్చర్‌ను ఐసీఐసీఐ బ్యాంకు తొలగించింది. ఈ కేసులో సీబీఐ 2019లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2019లో, చందా కొచ్చర్ బ్యాంక్ ఎండీగా ఉన్నప్పుడు కంపెనీలకు ఐసీఐసీఐ మంజూరు చేసిన రూ.1,800 కోట్లకు పైగా రుణానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. 2022 డిసెంబర్లో కొచ్చర్ దంపతులను, వేణుగోపాల్ ధూత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. అయితే, అరెస్టులు చట్టానికి లోబడి లేవని పేర్కొంటూ జనవరి 9న బాంబే హైకోర్టు కొచ్చర్లకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ధూత్‌కు బెయిల్ కూడా లభించిన సంగతి తెలిసిందే. -
కొడుకు పెళ్లికి ముందే.. కొచ్చర్ దంపతులకు భారీ ఊరట, జైలు నుంచి విడుదల
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త చందా కొచ్చర్ అరెస్ట్ అక్రమమంటూ బాంబే హైకోర్ట్ తీర్పు వెలువరించింది. దీంతో మంగళవారం చందా, దీపక్ కొచ్చర్లు జైలు నుంచి విడుదలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియో కాన్ గ్రూప్‌కు రూ.3వేల కోట్ల రుణం మంజూరు చేశారంటూ గతేడాది డిసెంబర్ 23న సీబీఐ అధికారులు కొచ్చర్ దంపతుల్ని అరెస్ట్ చేశారు. జనవరి 25న కొచ్చర్ల కుమారుడు వివాహం జరగాల్సి ఉండగా.... అంతకంటే ముందే వారిద్దరి అరెస్ట్ సరైంది కాదంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో భారీ ఊరట లభించినట్లైంది. కోర్టు తీర్పులో ఏముందంటే? కేసు నమోదు చేసిన నాలుగేళ్ల తర్వాత ఆ జంటను అరెస్టు చేయడానికి గల కారణాన్ని అరెస్ట్ మెమోలలో పేర్కొనలేదని కోర్టు నిన్న తెలిపింది. "అరెస్ట్ మెమోలలో పేర్కొన్న పిటిషనర్లను అరెస్టు చేయడానికి కారణం తప్పనిసరి నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమే" అని పేర్కొంది. నిందితులు చేసిన తప్పు ఒప్పుకోకపోతే.. వాళ్లు విచారణకు సహకరించలేమని చెప్పలేమని తెలిపింది. అవినీతి నిరోధక చట్టం కింద తమ అరెస్టు చట్టవిరుద్ధమని, దర్యాప్తు ప్రారంభించేందుకు చట్టంలోని సెక్షన్ 17ఎ కింద అనుమతి తప్పనిసరి అని, ఈ దర్యాప్తును ప్రారంభించడానికి ఏజెన్సీకి అలాంటి అనుమతి లేదని కొచ్చర్ దంపతులు గతంలో కోర్టు ముందు వాదించారు. కాగా, ఇప్పటి ఐసీఐసీఐ రుణం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి👉 పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ -
Chanda Kochhar: రూ.5.25 కోట్ల ప్లాట్ ఖరీదు రూ.11 లక్షలే!
ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ కుంభకోణంలో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లోన్ కేసులో ప్రధాన నిందితులైన చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్తో పాటు వేణుగోపాల్ ధూత్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు నిందితుల మధ్య జరిగిన లావాదేవీలను పరిశీలించగా అందులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొచ్చర్ దంపతులకు లంచాలు ఎలా ఇచ్చారంటే? ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా చందా కొచ్చర్ ఆర్బీఐ బ్యాంక్‌లకు విధించిన బ్యాంకింగ్ రెగ్యూలేషన్ యాక్ట్, క్రెడిట్ పాలసీ (రుణ) నిబంధనలకు విరుద్ధంగా వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌కు రూ.3250 కోట్లలోన్ మంజూరు చేశారు. అందుకు గాను ధూత్.. కొచ్చర్ కుటుంబానికి లంచాలు ఇచ్చినట్లు అధికారుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. వడ్డీతో పాటు షేర్ కూడా రుణం మంజూరు తర్వాత భార్య భర్తలైన చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్‌కు వేణుగోపాల్ ధూత్ల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. రుణం విషయంలో అనుకూలంగా వ్యవహరించారనే కారణంగా ధూత్ తన వీడియోకాన్ గ్రూప్‌లో ఆ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా చందాకొచ్చర్‌కు షేర్ ఇవ్వడంతో పాటు సంస్థ నుంచి వచ్చిన లాభాల్లో అధిక మొత్తంలో వడ్డీ ఇచ్చారు. పైగా తన ఖరీదైనా ప్లాటులో నివాసం ఉండేలా కొచ్చర్ దంపతులు ఇచ్చారు. అప్పు తీర్చేందుకు అప్పుగా రూ.300 కోట్ల రుణం సీఈవో పదవితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ శాంక్షనింగ్ కమిటీ చైర్ పర్సన్‌గా ఉన్న చందా కొచ్చర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ పదవిలో(శాంక్షనింగ్ కమిటీ చైర్ పర్సన్ గా) ఉన్న ఆమె బ్యాంక్ యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (వీఐఎల్)కు రూ.300కోట్ల రుణం మంజూరు చేసింది. ఆ రుణాన్ని వీడియోకాన్ గతంలో అదే బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు.. కొత్తగా వందల కోట్లను రుణాన్ని ఇచ్చింది. ఆ తర్వాత శాక్షనింగ్ కమిటీ పదవి నుంచి తప్పుకుంది. రూ.64కోట్లు ముడుపులు అందుకు ప్రతిఫలంగా వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్..చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూ పవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (nrpl) సంస్థ నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.64 కోట్లు ముడుపులుగా ఇచ్చినట్లు సీబీఐ తన ఇన్వెస్టిగేషన్లో గుర్తించింది. ఆ రూ.64 కోట్లతో దీపక్ కొచ్చర్ 33.15 మెగా వాట్ల కెపాసిటీతో విండ్ ఫార్మ్ ప్రాజెక్ట్ కావాల్సిన భారీ ఎత్తున చిన్న చిన్న విండ్ టర్బైన్లను కొనుగోలు చేశారు. రూ.5.25 కోట్ల ప్లాట్ ఖరీదు రూ.11 లక్షలే చందా కొచ్చర్, ఆమె కుటుంబం వేణుగోపాల్ ధూత్ నుంచి అన్నీ రకాల లబ్ధి పొందినట్లు దర్యాప్తు అధికారులు విచారణలో స్పష్టమైంది. పైన పేర్కొన్నుట్లుగా రూ.64 కోట్లతో పాటు ముంబైలోని సీసీఐ ఛాంబర్స్‌లో ఉన్న రూ.5.25 కోట్ల ఖరీదైన ఫ్లాటును 1996 నుంచి 2016 వరకు ఫ్రీగా వినియోగించుకున్నారు. ఆ తర్వాత అదే ప్రాపర్టీని రూ.11లక్షలకు కొనుగోలు చేసిన వీడియోకాన్ గ్రూప్ తెలిపింది. ఈ లావాదేవీలు 2016 లో జరిగాయి. కానీ ఈ ప్లాట్ కొనుగోలు మాత్రం సంవత్సరాల ముందు నుంచి ఒప్పందం జరిగినట్లు సమాచారం.