verifications
-
ఒరిజినల్ డాక్యుమెంట్లు తనిఖీ చేశాకే మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: మ్యుటేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. భూములకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తనిఖీ చేశాకే మ్యుటేషన్లు చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. జిరాక్స్, ట్రూ కాపీలు, ఇతర అనధికారిక పత్రాల ఆధారంగా మ్యుటేషన్లు చేయవద్దని స్పష్టం చేసింది. వీటివల్ల వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. ఒరిజినల్ డాక్యుమెంట్లను తహసీల్దార్లు ధృవీకరించాలని చెప్పింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. తహశీల్దార్లు ప్రతి మ్యుటేషన్‌కు తప్పనిసరిగా సేల్ డీడ్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు, వాటి ఒరిజినల్ లింకు డాక్యుమెంట్లు, ఒరిజినల్ ఈసీతోపాటు దానికి సంబంధించిన ఇతర అధికారిక పత్రాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తహసీల్దార్ ఆన్లైన్లో ధృవీకరించాలని (సర్టిఫై చేయాలి) ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ నుంచి ఆన్లైన్లో చూసే డాక్యుమెంట్లు తప్ప ఇతర ఏ సందర్భంలోనైనా ఈ విధానం పాటించాల్సిందేనని చెప్పారు. ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్లని ధృవీకరించకుండా చేసిన ఎలాంటి మ్యుటేషన్ లేదా ఆర్డర్ ఆమోదయోగ్యం కాదని తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల తహశీల్దార్లు ఫొటో కాపీల ఆధారంగా మ్యుటేషన్లు చేయడం, అసలైన యజమానులు ఫిర్యాదుతో అవి సరైన పత్రాలు కావని నిర్థారణ అయిన నేపథ్యంలో హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. దీంతో సీసీఎల్ఏ ఈ ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖలోని చివరి వ్యక్తి నుంచి అన్ని స్థాయిల్లో ఈ నిబంధనలు పాటించాలని, దీనికి విరుద్ధంగా ఎవరైనా ఫొటో కాపీలు చూసి మ్యుటేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాక్ట్ 15 ఆఫ్ 2022 ప్రకారం క్రిమినల్ లా కింద ఎవరైనా ఆర్ఓఆర్ చట్టానికి విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తే వారిని జిల్లా కలెక్టర్లు విచారించే అధికారం ఉందని తెలిపారు. -
ఆఫీసుల వెరిఫికేషన్ నిబంధనలకు మార్పులు ..
న్యూఢిల్లీ: కంపెనీల చట్టం ప్రకారం సంస్థల రిజిస్టర్డ్ చిరునామాలను అధికారులు భౌతికంగా ధృవీకరించుకునే నిబంధనలను కేంద్రం సవరించింది. వీటి ప్రకారం ఈ అంశంలో ఇకపై అధికారులు తమ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే ప్రసక్తి ఉండదు. సాధారణంగా ఏదైనా సంస్థ సరైన రీతిలో వ్యాపారం నిర్వహించడం లేదని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి అనుమానం కలిగినప్పుడు సదరు కంపెనీ రిజిస్టర్డ్ చిరునామాకు వెళ్లి భౌతికంగా వెరిఫికేషన్ చేయవచ్చు. తాజా మార్పుల ప్రకారం ఇటువంటి సందర్భాల్లో కంపెనీ నమోదైన ప్రాంతంలో ఉండే ఇద్దరు స్వతంత్ర సాక్షులు ఉండాలి. అవసరమైతే స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకోవచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. అలాగే కార్యాలయం ఫొటోనూ తీసుకోవాలి. ప్రాంతం, ఫొటోలు సహా వివిధ వివరాలతో కూడిన నివేదికను సవివరంగా రూపొందించాలి. -
డీఎడ్ రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన
హాజరైన 181 మంది అభ్యర్థులు రాజమహేంద్రవరం రూరల్ : డిప్లమో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎల్ఈడి)లో ప్రవేశాల కోసం రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలనకు రెండోరోజు బుధవారం 181 మంది హాజరైనట్టు బొమ్మూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఫీజు ఆన్లైన్లో చెల్లించిన తరువాత పైనల్ అడ్మిషన్ లెటర్ ఇచ్చామని తెలిపారు. అలాగే మొదట విడత కౌన్సెలింగ్‌కు హాజరై కళాశాల మార్పు చేసుకున్న 245 మంది హాజరై కొత్తగా కేటాయించిన కళాశాల అడ్మిషన్ లెటరును తీసుకున్నారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. గురువారం సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని ఆయన తెలిపారు. -
ముగిసిన ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
తెలంగాణలో 56,042 మంది, ఏపీలో 65,667 మంది హాజరు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ నెల 7వ తేదీ నుంచి ఏపీలో, 14 నుంచి తెలంగాణలో చేపట్టిన వెరిఫికేషన్‌కు 1,21,709 మంది విద్యార్థులు హాజరై సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకున్నట్లు ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వెరిఫికేషన్‌కు ఫస్ట్ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు 1,14,508 మందిని పిలువగా, శనివారం సాయంత్రం 7 గంటల వరకు 65,667 మంది వెరిఫికేషన్ చేయించకున్నట్లు వివరించారు. తెలంగాణలో 88,947 మందిని పిలిస్తే 56,042 మంది హాజరయ్యారని వివరించారు. వెబ్ ఆప్షన్లు ప్రారంభమైన ఈ నెల 17వ తేదీ నుంచి శనివారం రాత్రి 7 గంటల వరకు 87,859 మంది అప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. శుక్ర, శనివారాల్లో 1,00,001వ ర్యాంకు నుంచి 1,50,000 ర్యాంకు పరిధిలోని 28,518 మంది విద్యార్థులకు అప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించగా 26,827 మంది విద్యార్థులు తమ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. ఈ ర్యాంకు పరిధిలోని వారు వెబ్ ఆప్షన్లను ఆదివారం ఉదయం 9 గంటల వరకు ఇచ్చుకోవచ్చని వివరించారు. ఈ నెల 25తో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగియనుంది. 26, 27 తేదీల్లో ఆప్షన్లను మార్చుకునే అవకాశం కల్పించనున్నారు.