Vertical
-
వర్టికల్ టవర్ గార్డెన్‌ను ఇలా మీరే తయారు చేసుకోవచ్చు!
వర్టికల్ టవర్ గార్డెన్ ఇంటిపంటల సాగుదారులకు చాలా ఉపయోగకరం. మేడ మీద లేదా బాల్కనీలో, ఇంటి పెరట్లో అతి తక్కువ స్థలంలో (కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బారెల్లో 60 రకాల ఆకుకూరలు, కూరగాయలు, కషాయాల కోసం ఔషధ మొక్కలను పెంచుకోవచ్చు. బారెల్ మధ్యలో ఉండే పీవీసీ పైపులో వంటింటి వ్యర్థాలు వేస్తూ.. వర్మీ కం΄ోస్టును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టవర్ గార్డెన్లను సేంద్రియ ఇంటిపంటలపై ఆసక్తి, ఓపిక ఉన్న వారు తమంతట తాము తయారు చేసు కోవచ్చు. అదెలాగో హైదరాబాద్‌కు చెందిన వర్టికల్ టవర్ గార్డెన్ నిపుణులు రవి చంద్ర కుమార్ వివరిస్తున్నారు. మార్కెట్లో దొరికే 300 లీటర్ల లేదా 250 లీటర్ల హెచ్.డి.పి.ఇ. బారెల్ తీసుకోవాలి. బారెల్ పొడవు 36 అంగుళాలు. బారెల్‌కు చుట్టూతా 5 అంగుళాలకు ఒక చోట కత్తిరిస్తే (దీన్నే పాకెట్ అని పిలుస్తున్నాం).. 7 వరుసల్లో పాక్లెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్డంగా ఒక్కొక్క పాకెట్ వెడల్పు 5 అంగుళాలు ఉండేలా కొలత స్కేల్‌తో మార్క్ చేసుకోవాలి. రెండు పాకెట్ల మధ్య 4 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక వరుసలో 8 పాకెట్ వస్తాయి. 7 వరుసల్లో మొత్తం 56 పాకెట్లు వస్తాయి. బారెల్ పై భాగాన 4 మొక్కలు పెట్టవచ్చు. అన్నీ కలిపి 60 మొక్కలు పెట్టుకోవచ్చు. అంటే ఒక బారెల్ 60 కుండీలతో సమానం అన్నమాట! పాకెట్ ఎక్కడ పెట్టుకోవాలో మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసిన చోట బారెల్ను డ్రిల్ మెషిన్‌తో కత్తిరించి చిల్లు పెట్టాలి, జిగ్సా రంపం పట్టడం కోసం. జిగ్సా తో వరుసలల్లో మార్క్ చేసిన చోట్ల 5 అంగుళాల వెడల్పున కట్ చేయాలి. పాకెట్ మౌల్డింగ్ చేసే విధానం.. హీట్ గన్‌తో కట్ చేసిన ప్రదేశంలో హీట్ చేయాలి. తగిన హీట్ అయిన తరువాత ఆ ప్రదేశంలో చిత్రంలో చూపిన విధంగా సిమెంటు దిమ్మె అమర్చాలి. అలా అన్నిపాకెట్ ను తయారు చేయాలి. బారెల్ అడుగు భాగంలో మధ్యన 4 అంగుళాల రంధ్రం చేయాలి. పక్కన అర అంగుళం రంధ్రం చేయాలి. అధిక నీరు బయటకు వెళ్లడానికి అక్కడ గ్రోమేట్ పెటి టేకాహ్ అమర్చాలి. మధ్యలో 4 అంగుళాల పీవీసీ గొట్టం అమర్చాలి. గొట్టం చుట్టూ చిల్లులు పెట్టాలి. ఇదీ చదవండి: గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలుగొట్టం అమర్చే విధానం.. ఆ గొట్టాన్ని క్రింది భాగాన 6 అంగుళాలు బయటకు ఉండేలా అమర్చి.. అక్కడ ఎంసీల్‌తో అతకాలి. పై భాగాన జీయే వైరుతో కట్టాలి. 4 అంగుళాల గొట్టానికి పైన, కింద మూతలు అమర్చాలి. ఈ బారెల్ను నిలబెట్టడానికి ఇనుప స్టాండ్‌ను తయారు చేసుకోవాలి. స్టాండ్ 18 అంగుళాల పొడవు, 18 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల ఎత్తు ఉండాలి.వర్టికల్ గార్డెన్లో కంపోస్టు తయారు చేసే విధానం : వర్మీ కం΄ోస్టు 30%, రంపపు పొట్టు 30%, పశువుల ఎరువు 30%, వేప గింజల చెక్క 10%.. ఇవన్నీ కలిపి బారెల్లో సరిపడినంత నింపుకోవాలి. బారెల్ మధ్యలో అమర్చిన గొట్టంలో వంటింటి వ్యర్థాలు వేయాలి. అందులో చక్కటి వర్మీకంపోస్టు తయారవుతుంది. స్టాండ్ మీద వర్టికల్ గార్డెన్‌ను అమర్చుకున్న తర్వాత.. అందులో కం΄ోస్టు మిశ్రమాన్ని నింపుకోవాలి. బారెల్ చుట్టూ ఉన్న అరలలో విత్తనాలు నాటుకోవాలి. ఒక్కో వర్టికల్ గార్డెన్ టవర్‌ను తయారు చేసుకోవడానికి (బారెల్, స్టాండ్, టవర్, కం΄ోస్టు, విత్తనాలు.. అన్నీ కలిపి) రూ. 5 వేలు ఖర్చవుతుంది. వర్టికల్ టవర్‌కు రోజుకు కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. ఇందులో అన్ని రకాల ఆకుకూరలు, ఔషధ మొక్కలు చక్కగా పండించవచ్చని రవిచంద్ర కుమార్ తెలిపారు. -
పగలూ రాత్రీ బాదేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: పోలీసు పనితీరుకు ప్రామాణికమంటూ డీజీపీ కార్యాలయం అమలులోకి తీసుకువచ్చిన వర్టికల్స్ విధానం అటు పోలీసులు, ఇటు నగర వాసులకు నరకం చూపిస్తోంది. ఇందులో నిర్దేశించిన మేరకు డ్రంకెన్ డ్రైవ్ కేసుల కోసం ట్రాఫిక్ విభాగం అధికారులు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా రోడ్డున పడుతున్నారు. అదేమంటే రోడ్డు ప్రమాదాల నిరోధం కోసమే ఇవన్నీ చేస్తున్నామని చెబుతున్నారు. సీన్ కట్ చేస్తే. డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కావడం తప్ప ఆశించిన స్థాయిలో రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గట్లేదు. పనితీరు మదింపు... శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ వింగ్ సహా ప్రత్యేక విభాగాలను పని తీరును మథించడానికి డీజీపీ కార్యాలయం వర్టికల్స్ విధానాన్ని రూపొందించింది. బీటు కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు ఎవరెవరు, ఏ రకమైన విధులు నిర్వర్తించాలనేది నిర్దేశించింది. వీటిని వీళ్లు ఎంత సమర్థంగా వ్యవహరిస్తున్నారన్నది గుర్తించడానికంటూ వర్టికల్స్ విధానం అమలులోకి తీసుకువచ్చారు. ప్రతి నెలా ఆయా అధికారులు తమ పని తీరును ఈ వర్టికల్స్‌లో నిర్దేశించిన విధంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే డీజీపీ కార్యాలయం ర్యాంకింగ్స్ ఇస్తూ ఉత్తమ అధికారులను గుర్తిస్తోంది. డీడీ తనిఖీలను చేర్చి.. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ వంటి ప్రత్యేక విభాగాలకు సైతం కొన్ని అంశాలను నిర్దేశించారు. ట్రాఫిక్ పోలీసుల విషయానికి వచ్చేసరికే అసలు సమస్య వచ్చిపడుతోంది. వీళ్లు నిర్వర్తించే ప్రతి పనీ నేరుగా నగర వాసులు ఇంకా పక్కాగా చెప్పాలంటే వాహన చోదకులతో ముడిపడి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసుల పనితీరును గుర్తించే వర్టికల్స్‌లో పెండింగ్ ఈ–చలాన్ల వసూలుతో పాటు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలను డీజీపీ కార్యాలయం చేర్చింది. ఒక్కో పోలీసుస్టేషన్ ఒక నెలలో ఏ తరహావి, ఎన్ని కేసులు నమోదు చేస్తోందనేది గణిస్తోంది. ఆ ప్రాంతాలు, సమయాల్లో చేస్తే ఒకే... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు గడిచిన కొన్నాళ్లుగా ప్రతి రోడ్డు ప్రమాదాన్నీ అధ్యయనం చేస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో, ఏయే సమయాల్లో, ఏ కారణం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశంపై నివేదికలు రూపొందించారు. వీటి ఆధారంగా డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో, ఆ సమయాల్లో ఈ తనిఖీలు నిర్వహించేలా చేస్తే సరిపోతుంది. అలా కాకుండా అనునిత్యం రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వీటిని నిర్వహిస్తుండటంతో అటు పోలీసులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి పరిస్థితులను మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి.. ట్రాఫిక్ విభాగం అధికారులు వర్టికల్స్‌ను అందుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పగలు–రాత్రి తేడా లేకుండా రోడ్లపై డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలన్నీ ప్రధాన రహదారులపై జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. మరోపక్క అసలే అరకొర సిబ్బందితో ఉన్న ట్రాఫిక్ ఠాణాలకు ఈ తనిఖీలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. రాత్రి వేళల్లో డ్రంక్ డ్రైవింగ్ చేసిన వాళ్లూ ఉదయం డ్యూటీకి రావాల్సి రావడం.. ఒక్కోసారి మళ్లీ పగటిపూట కూడా ఈ తనిఖీలు చేయాల్సి వస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. పని భారం తప్పించాలంటూ ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు. (చదవండి: వాహనదారులకు అలర్ట్ ఈ రూట్స్‌లో వెళ్లకండి.. ట్రాఫిక్ మళ్లింపులు కలవు) -
256 మంది పోలీసులకు ‘వర్టికల్’ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో వర్టికల్ విధానాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న 256 మంది కానిస్టేబుల్, హోంగార్డులు, ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లకు ఉత్తమ అవార్డులను డీజీపీ మహేందర్‌రెడ్డి అందించారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పోలీస్ స్టేషన్లో హోంగార్డు, కానిస్టేబుల్, ఇతర అధికారులు ఎవరు ఏ రోజు ఏ విధులు నిర్వర్తిస్తున్నారో తెలిసేది కాదని, తమ విధి ఏంటన్నది వారికి కూడా క్లారిటీ లేకుండా ఉండేదన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యాధునిక టెక్నాలజీ వినియోగం అందుబాటులోకి రావడంతో ప్రతి అధికారి జవాబుదారీతనంతో పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరికీ కచ్చితమైన డ్యూటీ ఉంటోందని వెల్లడించారు. కార్యక్రమంలోసీఐడీ డీజీపీ గోవింద్‌సింగ్, అదనపు డీజీపీలు రాజీవ్ రతన్, జితేందర్, నాగిరెడ్డి, సంజయ్‌కుమార్ జైన్, స్వాతిలక్రా తదితరులు పాల్గొన్నారు. -
ఈ శిఖరం నుంచి దూకినా.. ఏమీ కాదు!
నిట్టనిలువునా కిలోమీటరుకు కొంచెం తక్కువగా ఉన్న ఈ కొండ శిఖరం మీది నుంచి దూకినా.. పారాచుట్‌తో ల్యాండ్ అయినట్లు హాయిగా ఉంటుందట. మనకు దెబ్బలేమీ తగలవట. ఎందుకంటే.. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా స్వల్పంగానే ఉంటుంది. బాగుందే.. ఎక్కడుందంటారా? ‘67పీ/చుర్యుమోవ్ గెరాసిమెంకో’ అనే తోకచుక్కపై! ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) పదేళ్ల క్రితం ప్రయోగించిన రోసెట్టా వ్యోమనౌక వందల కోట్ల కి.మీ. ప్రయాణించి ఈ ఏడాది ఆగస్టులోనే ఈ తోకచుక్కను చేరింది. అప్పటి నుంచి ఈ తోకచుక్క చుట్టూ తిరుగుతూనే భూమికి ఫొటోలు పంపుతోంది. అలా ఈ నెల 10న 20 కి.మీ. దూరం నుంచి రోసెట్టా తీసిన నాలుగు ఫొటోలను కలిపి ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ అట్కిన్సన్ అనే ఔత్సాహిక ఖగోళ పరిశోధకుడు ఈ ఫొటోను రూపొందించారు. అన్నట్టూ.. 4 కి.మీ. సైజు కొండలా ఉన్న ఈ తోకచుక్క ప్రస్తుతం గంటకు లక్ష కి.మీ. వేగంతో ప్రయాణిస్తోందట. దీనిపైకి ఫీలే అనే ల్యాండర్‌ను నవంబరు 12న జారవిడిచి రోసెట్టా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.