Vettori
-
గేల్‌ను తప్పించడం సబబే: వెటోరీ
బెంగళూరు: విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్‌ను జట్టు నుంచి తప్పిం చడం సమంజసమేనని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ముగిశాక ఒక బౌలర్ కొరత ఉందని, జట్టు అవసరాల రిత్యా షేన్ వాట్సన్ ఆల్‌రౌండర్‌గా సరిపోతాడని భావించామని పేర్కొన్నాడు. దీంతో గేల్ స్థానంలో వాట్సన్‌ను కొనసాగిస్తున్నామని తెలిపాడు. అయితే ఆదివారం రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో పుణే చేతిలో బెంగళూరు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మరోవైపు చివరి ఓవర్లలో ధారళంగా బౌలర్లు పరుగులు సమర్పించుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. మరోవైపు తమ సొంతమైదానం చిన్నస్వామి స్టేడియం బౌలర్లకు సహకరించగలదని వెటోరీ అశాభావం వ్యక్తం చేశాడు. -
వారెవా.. వెటోరి
36 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని ‘డాన్’ వెటోరి ఫీల్డింగ్‌లో ఒక అద్భుతాన్ని చూపించాడు. బౌల్డ్ వేసిన పదో ఓవర్ తొలి బంతిని శామ్యూల్స్ అప్పర్కట్ ఆడాడు. థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి వెళ్లిన బంతి దాదాపు బౌండరీ దాటి సిక్స్‌గా మారినట్లే కనిపించింది. కానీ ఇంతలో అక్కడే ఉన్న వెటోరి అనూహ్యంగా చాలా ఎత్తులో గాల్లోకి ఎగిరాడు. ఎలాంటి ఒత్తిడి, గందరగోళం లేకుండా తనని తాను అదుపులో ఉంచుకుంటూ పర్ఫెక్ట్గా చేతిని గాల్లో ఉంచాడు. అంతే...సరిగ్గా బంతి అతని చేతుల్లో పడింది. ఈ ఒంటి చేతి సూపర్ క్యాచ్‌తో శామ్యూల్స్ అవుట్ కావడంతో ఆ దశలో విండీస్ జోరుకు బ్రేక్ పడింది. -
మళ్లీ టెస్టుల్లోకి వెటోరీ
వెల్లింగ్టన్: ఇక క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడని అనుకుంటున్న సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్ వెటోరీ అనూహ్యంగా టెస్టు జట్టులోకి వచ్చాడు. రెండేళ్లుగా టెస్టులకు దూరంగా ఉంటూ కేవలం వన్డేలు, టి20లు ఆడుతున్న వెటోరీని... పాకిస్థాన్‌తో బుధవారం జరగనున్న మూడో టెస్టు కోసం న్యూజిలాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ముగ్గురు స్పిన్నర్లు జట్టులో ఉండాలని భావించిన సెలక్టర్లు... యూఏఈలోనే న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో ఉన్న వెటోరీని పిలిపించింది. ఈ మ్యాచ్ ఆడితే న్యూజిలాండ్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన పెద్ద వయస్కుడిగా 35 ఏళ్ల వెటోరీ రికార్డు సృష్టిస్తాడు.