V.Hanamantha Rao
-
బీసీలు రాజ్యాధికారానికి పనికిరారా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: గొర్రెలు, బర్రెలు చూసుకుని బతకడానికి తప్ప బీసీలు రాజ్యాధికారానికి పనికిరారా అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మాట్లాడుతూ గొర్రెల పంపిణీ పెద్ద మోసమన్నారు. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి వారిని అధికారం నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు.బీసీలకు ఇంకా గాడిదల పంపిణీ మాత్రమే మిగిలి ఉందని ఎద్దేవా చేశారు. దళితులకు భూములివ్వకుండా మొండిచెయ్యి చూపిం చడానికే కేసీఆర్ భూసర్వే అంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. బతుకమ్మ చీరల పేరిట నాసిరకపు చీరలను పంచి మహిళలను అవమానించారన్నారు. -
భూ స్కాంపై సీబీఐ విచారణ కోరరేం: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: భూముల అక్రమ రిజిస్ట్రే షన్ల వ్యవహారంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కుంభకోణం ఎప్పుడు జరిగితే ఏంటని, ఇప్పుడు అధికా రంలో ఉన్న సీఎం కేసీఆర్ విచారణ కోరవచ్చు కదా అన్నారు. రాష్ట్రంలో జరుగు తున్న ఆందోళనకర పరిణామాలపై గవర్నర్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని, రైతులకు సంకెళ్లు వేసినా, సచివాలయంలో, సచివాలయ పరిసరాల్లో మనుషులు చచ్చినా గవర్నర్కు పట్టడం లేదని అన్నారు.