The victim
-
మహిళలకు రక్షణ లెకుండా పోయింది
-
ఎస్ఐను అన్యాయంగా సస్పెండ్ చేశారు
రైల్వేకోడూరు రూరల్: వరకట్నం కేసులో తనకు న్యాయం చేసేందుకు ప్రయత్నించిన ఎస్ఐను అన్యాయంగా సస్పెండ్ చే శారని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని అంకన్న గారి శ్వేత అనే మహిళ తన తండ్రి లక్ష్మీకర్‌రెడ్డి, బంధువులతో కలిసి సోమవారం ఆందోళన చేపట్టింది. అన్ని పార్టీల నాయకులు ఆమెకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. దాదాపు 3 గంటల పాటు కడప–తిరుపతి జాతీయ రహదారిపై వాహనాలు ఆగిపోయాయి. బాధితుల కథనం మేరకు వివరాలలోకి వెళితే.. పట్టణానికి చెందిన అంకన్నగారి లక్ష్మీకర్ రెడ్డి తన కుమార్తెను మంగంపేటకు చెందిన పోలి మధుసూదన్‌రెడ్డి కుమారుడు జై భరత్ రెడ్డికి ఇచ్చి గత ఏడాది ఫిబ్రవరి 5న వివాహం చేశారు. అల్లుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని రూ.15 లక్షలు నగదు, 1.5 కేజీల బంగారం కట్నంగా ఇచ్చారు. నాలుగు నెలల తర్వాత తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, పిల్లలు కూడా ఉన్నారని శ్వేత తెలుసుకుంది. దీంతో వారి కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. గర్భం దాల్చిన శ్వేతను ఆమె భర్త, మామ, అత్త శకుంతల, ఆడపడుచు ప్రత్యూష వేధిస్తుండటంతో ఆమె ఈ ఏడాది మే 7న వారిపై పోలీసు కేసు పెట్టింది. ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా మన్నూరు సీఐని నియమించారని, ఆయన వద్దకు రెండు సార్లు వెళ్లగా కేసులో భర్త పేరు ఉంచి మిగిలిన వారి పేర్లు తొలగించాలని ఒత్తిడి తెచ్చారని బాధితురాలు పేర్కొంది. ఇన్ని ఒత్తిడులున్నప్పటికీ కోడూరు ఎస్ఐ నలుగురిపై కేసు నమోదు చేశారు. అందువల్లే ఆయనను అన్యాయంగా సస్పెండ్ చేశారని, ఎస్ఐని విధుల్లోకి తీసుకోవాలని ఆమెతో పాటు పలువురు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఓఎస్డీ సత్యయేసు బాబు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నం ఆందోళన విరమించిన తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు తిరుపతి వైపు వెళుతున్నారని తెలుసుకున్న కొంత మంది ఆయన కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో మస్తాన్ అనే వ్యక్తి తలకు గాయమైంది. పోలీసులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి న్యాయం చేస్తాం– ఓఎస్డీ బాధితురాలికి న్యాయం చేస్తామని ఓఎస్డీ సత్యయేసు బాబు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషనులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కేసు విషయంలో బాధితురాలికి తాము అండగా ఉండి న్యాయం చేస్తామన్నారు. తమ వద్ద కొన్ని ఆధారాలు ఉండటం వల్లే ఎస్ఐను సస్పెండ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సీహెచ్ చంద్రశేఖర్, పీసీసీ అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర, సీహెచ్ రమేష్, నాగేంద్ర, హేమరాజ్, రమణ, నవీన్, సుమన్, శివయ్య, మోహన్, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
ప్రసవానికి వెళ్తే గెంటేశారు
ఇందూరు : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల తీరును నిరసిస్తూ పచ్చి బాలింత కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. వివరాల్లోకి వెలితే... నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్‌కు చెందిన నిషాత్ పర్విన్ (సబియా) కు నెలల నిండడంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటలకు నొప్పులు రాగా తల్లిదండ్రులు, బంధువులు కలిసి జిల్లా ప్రభుత్వాస్పత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు. ఆస్పత్రిS మెట్లు ఎక్కుతుండగానే అక్కడి సిబ్బంది, నర్సులు డెలివరీ చేయబోము, వెళ్లిపోండని అక్కడి నుంచి పంపించి వేశారు. గర్భిణి తల్లి బిస్మిల్లా షేక్ సిబ్బందిని ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. దీంతో నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని వేరే గతిలేక ఇంటికి తీసుకెళ్లారు. గర్భిణి ఇంట్లోనే ఆడ బిడ్డను ప్రసవించింది. తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉన్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం పసి బిడ్డ, బాలింతతో సహా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలోఅధికారులు ఎవరూ లేనందున కలెక్టర్ సీసీ సూచన మేరకు డీఆర్వో కార్యాలయంలో ఫిర్యాదు చేసి వెళ్లారు. ప్రవసం చేయకుండా తిప్పి పంపించిన వారిపై చర్యలు తీసుకోవాలని, నా లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
బాధితుడికి చెక్కు అందించిన మంత్రి
బాన్సువాడ టౌన్ : మండలంలోని సంగోజిపేట్ గ్రామానికి చెందిన మాగి పోశవ్వ గతేడాది పాముకాటుతో మృతి చెందింది. దీంతో ఆపద్బంధు కింద మృతురాలి భర్త నారాయణకు రూ. 50 వేల చెక్కు మంజూరైంది. దీన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపి, బోర్లం సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ సాయిలు, టీఆర్ఎస్ నాయకులు సాయిరాం, మారుతి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
లంచం కోసం పీడించి..
ప్రొద్దుటూరు టౌన్ : అతని పేరు మస్తాన్‌వల్లి.. ఎంతో మంది కలెక్టర్ల వద్ద సీసీగా పని చేశాడు. ప్రజలను ముక్కుపిండి డబ్బు వసూలు చేయడంలో దిట్ట. అతని వద్ద ఉన్న ఫైల్ కదలాలంటే నోట్లు జోబులో పడాల్సిందే. విసిగి పోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారినీ ముప్పతిప్పలు పెట్టాడు. ఎట్టకేలకు రూ.5వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు మండల పరిధిలోని తాళ్లమాపురం గ్రామానికి చెందిన సయ్యద్ జహరుద్దీన్ ఆ గ్రామంలో ఉన్న నూనానీ మాస్క్ మసీదుకు అధ్యక్షుడిగా ఉన్నారు. 8.20 ఎకారాల వక్ఫ్‌బోర్డు స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు పట్టాదారు పాసుపుస్తకాలు తయారు చేసుకున్నారు. ఈ విషయంపై జహరుద్దీన్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. సివిల్ కోర్టు జహరుద్దీన్‌కు ఆర్డర్ మేరకు డీఆర్ఓ ఆ ఫైల్‌ను ఆర్డీఓకు పంపారు. అక్కడి నుంచి ఫైల్ ప్రొద్దుటూరు తహశీల్దారు కార్యాలయానికి వచ్చింది. దీంతో తహశీల్దారు వారికి మొదటి నోటీసులు జారీ చేశారు. అయినా వారు స్పందించలేదు. దీంతో రెండవ నోటీ సు ఇచ్చి స్పందించకపోతే తదుపరి చర్యలు తీసుకోవాలని సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మస్తాన్‌వల్లిని తహశీల్దారు ఆదేశించారు. అయితే మస్తాన్‌వల్లి రెండవ నోటీసు ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశారు. అయితే తన వద్ద డబ్బు లేదని ఎన్ని సార్లు చెప్పినా మస్తాన్‌వల్లి వినలేదు. నోటీసులు ఇచ్చే విషయంపై ఈ నెల 12వ తేదీన జహరుద్దీన్ మస్తాన్‌వల్లిని గట్టిగా ప్రశ్నించాడు. అయినా మస్తాన్‌వల్లి కనీసం రూ.5000 అయినా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మస్తాన్వల్లికి డబ్బు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మొదట తహశీల్దారు కార్యాలయానికి రమ్మని మాస్తాన్వల్లి జహరుద్దీన్‌కు చెప్పారు. అక్కడకి తిరుపతి రేంజ్ ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డితోపాటు కడప ఏసీబీ సీఐ పార్థసారథిరెడ్డి, తిరుపతి ఏసీబీ సీఐలు సుధాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి సిబ్బందితో మాటు వేశారు. అయితే మస్తానల్లి అక్కడి నుంచి ఓ టీ బంకు వద్దకు రావాలని జహరుద్దీన్‌కు ఫోన్ చేశాడు. అక్కడకు వెళ్లేలోపే తిరిగి పోన్ చేసి కోర్టు ఆవరణంలోకి రావాలని చెప్పారు. చివరకు మార్కెట్‌యార్డుకు వెళ్లి జహరుద్దీన్తో రూ.5000 నగదు, మద్యం బాటిళ్లు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండ్‌డ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మస్తాన్‌వల్లి అరెస్టు- కర్నూలుఏసీబీ కోర్టులో హాజరు... మస్తాన్‌వల్లిని అరెస్టు చేసినట్లు ఏసీబీ తిరుపతి రేంజ్ డీఎస్పీ, కడప, తిరుపతి సీఐలు తెలిపారు. అతన్ని కర్నూలులోని ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు వివరించారు. ప్రజలను ఏ అధికారి లంచం అడిగినా... ప్రజలను ఏ అధికారి అయినా లంచం అడిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు. తిరుపతి రేంజ్ (కడప, చిత్తూరు జిల్లాలు) డీఎస్పీ సెల్ నెంబర్ 9440446190, కడప సీఐ 9440446191 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
కుంగదీసిన కలహాలు
తిమ్మాజీపేట: ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికితోడు తాగొచ్చిన భర్త నిత్యం గొడవ పడుతున్నాడు. మనస్తాపానికి గురైన ఓ ఇల్లాలు తనతో పాటు తన ముగ్గురు పిల్లలపై కిరోసిన్‌పోసి నిప్పంటించి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన సోమవారం మండలంలోని మరికల్లో చోటుచేసుకుంది. బాధితురాలు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల భీమమ్మను కొడంగల్ చెందిన బాల్‌రాజుకు ఇచ్చి వివాహం చేశారు. కొద్దికాలం తర్వాత భీమమ్మ(28) తన భర్తతోపాటు మరికల్ గ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త వికలాంగుడు కావడంతో అన్నింటికీ తానై కుటుంబాన్ని పోషిస్తోంది. భర్త అడపాదడపా మేస్త్రీ పనికి వెళ్లి కుటుంబానికి ఆసరా ఉంటున్నాడు. వీరికి నందిని, విజయలక్ష్మి, శ్రీలక్ష్మి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారి పోషణ భారంగా మారింది. దీనికితోడు భర్త బాల్‌రాజు తరుచూ మద్యం తాగొస్తూ ఇంట్లో గొడవకు దిగుతున్నాడు. ఈ క్రమంలో మరోవారు ఆదివారం రాత్రి భర్త తాగొచ్చాడు. ఇలా తాగితే బతుకుదెరువు ఎట్టా? అని అతనితో వాదనకు దిగింది. పూట గడవక రోజూ ఇబ్బందులు పడుతున్నాం.. ఇలా అయితే ఎలాగని భర్తతో గొడవకు దిగింది. మనస్తాపానికి గురైన భీమమ్మ భర్త ముందే కిరోసిన్ డబ్బా తీసుకుని తన ఒంటిపై పోసుకుంది. అక్కడే ఉన్న కూతుళ్లపై కూడా పోసి నిప్పంటించింది. పెద్ద కూతురు నందిని మంటలతోనే గడియ తీయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో భీమమ్మతో పాటు కూతుళ్లు నందిని, జయలక్ష్మి, శ్రీలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. భర్త బాలరాజుకు మంటలు అంటుకోవడంతో కొద్దిపాటి గాయాలయ్యాయి. చికిత్సకోసం వీరిని జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైనవైద్యం కోసం మహబూబ్‌నగర్‌లోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో భీమమ్మ చిన్నకూతురు శ్రీలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులకు మెరుగైన వైద్యం పాలమూరు: జిల్లా ఆస్పత్రిలో బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్ వివరిస్తూ.. భీమమ్మకు 45 శాతం శరీరం కాలిందని, ఆమె పెద్దకూతురు నందిని, చిన్న కూతురు శ్రీలక్ష్మి శరీరం 40శాతం కాలిందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. వారంరోజుల తర్వాత వీరి ఆరోగ్యపరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. -
చెన్నూరు వాసి ఆత్మహత్యాయత్నం
కడప అర్బన్/చెన్నూరు : చెన్నూరుకు చెందిన మచ్చా వెంకటసుబ్బయ్య (50) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అరుుతే ఎస్ఐ హనుమంతు కొట్టడం వల్లనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితుడు, అతని కుటుంబ సభ్యుల కథనం మేరకు ...చెన్నూరు కొత్త రోడ్డులో మచ్చా వెంకట సుబ్బయ్య కూల్‌డ్రింక్ షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. కొత్తరోడ్డులోని షాపుల ముందు ఎలాంటి అడ్డంకులు పెట్టకూడదని ఎస్ఐ హనుమంతు చెప్పేవారు. అందరితోపాటు సమానంగా తమ షాపు నిర్వహిస్తున్నప్పటికీ గత మూడు నెలల నుంచి పదేపదే తమ షాపు వద్దకు వచ్చి అడ్డంకులు ఉన్నాయని వేధించేవారు. అలాగే తమ మోటారు సైకిల్ షాపు లోపల ఉన్నప్పటికీ రూ. 200 జరిమాన విధించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూరులోకి తమ కుమారుడు జనార్దన్ మోటారు సైకిల్లో వెళ్లి వస్తుండగా, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నాడని రూ. 1000 జరిమాన విధించారని తెలిపారు. ఈ సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిన నేపధ్యంలో మంగళవారం రాత్రి 6.30-7.00 గంటల సమయంలో వెంకట సుబ్బయ్య తన షాపులో కుర్చీలో కూర్చొని ఉండగా, ఎస్ఐ హనుమంతు తన జీపులో వేగంగా వచ్చి షర్టు పట్టుకొని కొట్టాడని ఆరోపించారు. చుట్టుపక్కల వారు గమనించడం, అనవసరంగా కొట్టాడని ఆవేదనతో ఇంట్లో ఉన్న వాస్మోల్ను సేవించాడు. వెంటనే భార్యాపిల్లలు గమనించి పక్కకు తోసేశారు. దీంతో అస్వస్థతకు గురైన వెంకట సుబ్బయ్యను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తీసుకొచ్చారు. ఎస్ఐ వివరణ అ సంఘటనపై చెన్నూరు ఎస్ఐ హనుమంతును వివరణ కోరగా, చెన్నూరు కొత్తరోడ్డు వన్‌వే కావడం, కూల్‌డ్రింక్ షాపులు నిర్వాహకులైన ఎం. వెంకట సుబ్బయ్య, ఆ పక్కనే మరో సుబ్బయ్యలను పదేపదే ముందుకు రావద్దని తెలియజెప్పినా వినిపించుకోలేదన్నారు. అలాగే టెంకాయలు ముందు వైపు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం సాయంత్రం తమ సిబ్బందితో షాపు ముందు వెంకట సుబ్బయ్య కుర్చీలో కూర్చొని వాహనదారులకు ఇబ్బందులు కలగజేయడంతో అతన్ని తమ సిబ్బంది లాగే ప్రయత్నం చేశారన్నారు. అంతేగానీ తానుగానీ, తమ సిబ్బందిగానీ కొట్టలేదన్నారు. -
దోచేసి..దొరికేసి..
►అమలాపురంలో సినీఫక్కీలో చోరీ ►రూ. 25 లక్షలు దోచుకుని రోడ్డుపై విసిరేసి వైనం ►వెంబడించి పట్టుకున్న బాధితుడు, పోలీసులు ►భట్నవిల్లిలో రూ.20 లక్షలు స్వాధీనం ►చోరీ సొత్తులో రూ.ఐదు లక్షలు మాయం అమలాపురం రూరల్/కాట్రేనికోన : లక్షలాది రూపాయలతో కారులో వెళుతున్న వ్యక్తిని... ఓ దొంగల ముఠా వెంబడించి రూ.25 లక్షలు కాజేసింది. అయితే ఆ సొమ్ము పోగొట్టుకున్న వ్యక్తి సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, దానికి పోలీసుల సహకారం తోడవడంతో చోరీ సొత్తులో రూ.20 లక్షలు దక్కాయి. అచ్చం సినీఫక్కీ మాదిరి జరిగిన ఈ సంఘటన అమలాపురంలో జరిగింది. చోరీకి పాల్పడిన ముఠాలో మొత్తం నలుగురు సభ్యులు ఉండగా... వారిలో ముగ్గురు పట్టుబడ్డారు. ఒకరు పరారయ్యాడు. అయితే మరో ఐదు లక్షలు ఏమయ్యాయో దర్యాప్తులో తేలాల్సి ఉంది. అమలాపురానికి చెందిన ఆక్వా వ్యాపారి యనమదల వేణు బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.25 లక్షల నగదును డ్రా చేశాడు. నగదు బ్యాగ్‌ను తన కారులో ఉంచి తానే డ్రైవ్ చేసుకుంటూ స్థానిక ఎర్రవంతెన వద్ద గల తన దుకాణం వద్దకు బయల్దేరాడు. ఈ విషయాన్ని గమనించిన దొంగల ముఠా తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న తెలుపు రంగు కారు(టీడబ్ల్యూ 02వై 8739)లో వెంబడించింది. ఎర్రవంతెన వద్ద దుకాణం ముందు వేణు కారు నిలిపి దుకాణంలోకి వెళ్లగానే.. ముఠాలోని ఓ వ్యక్తి వేణు కారులోని రూ. 25 లక్షల నగదు ఉన్న సంచిని పట్టుకుని మెరుపు వేగంతో వారి కారు ఎక్కి ముమ్మిడివరం వైపు పరారయ్యారు. ఈ విషయాన్ని గమనించిన వేణు తక్షణమే పోలీసులకు, స్థానికులకు సమాచారం అందించాడు. అంతటితో ఆగకుండా తన మోటార్ సైకిల్‌పై దొంగల ముఠా కారును వెంబడించాడు. మరో ఇద్దరిని తోడుగా తీసుకెళ్లాడు. సుమారు గంటసేపు వేణు దొంగల ముఠా కారును ఛేజ్ చేశాడు. తమను ఎవరో వెంబడిస్తున్నారని గమనించిన దొంగలు తొలుత తమ కారును 216 జాతీయ రహదారి మీదుగా జిల్లా కేంద్రం కాకినాడకు వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే తమ కారుపై ఛేజింగ్ జరుగుతుండడంతో దొంగలు తమ కారును ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు వద్ద మలుపు తిప్పి కాట్రేనికోన వైపు మళ్లించాడు. కారును బాధితుడు వేణు మోటార్ సైకిల్‌పై ఛేజ్ చేస్తూనే కారు ఆచూకీని ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తూనే ఉన్నాడు. అప్పటికే అమలాపురం రూరల్ సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి ముమ్మిడివరం సర్కిల్‌తోపాటు కాకినాడ వరకు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో ముమ్మిడివరం సర్కిల్ పోలీసులు ముఠా కారును కనుగొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎప్పుడైతే కారు కాట్రేనికోన వైపు వెళ్లిందో ఆ మండల పోలీసులను అప్రమత్తం చేశారు. కాట్రేనికోన ఎస్సై వెంకట త్రినాథ్ మండలంలోని దారులన్నీ పోలీసు సిబ్బంది, స్థానికుల యువకులతో అప్రమత్తం చేశారు. ముఠా కారు అతివేగంగా కాట్రేనికోన, పల్లంకుర్రు దాటుకుని సముద్ర తీర గ్రామమైన బలుసుతిప్ప గ్రామంలోకి వెళ్లింది. తీర గ్రామం కావడంతో అక్కడి వరకు మాత్రమే రోడ్డు ఉంది. దీనితో ముఠా తక్షణమే కారు వెనక్కి తిప్పి మళ్లీ అదే దారిలో వెనక్కి వస్తుండగా పల్లంకుర్రు ఏటిగట్టు వద్ద అప్పటికే మాటువేసిన పోలీసులు, స్థానికులు కారును అడ్డుకున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న ముఠాలో ఒకడు డోరు తీసుకుని పరారయ్యాడు. కారులో మిగిలిన ముగ్గురు దొంగలు పోలీసులకు చిక్కారు. భట్నవిల్లిలో... రూ.20లక్షలు విసిరేసి... : దొంగల ముఠా కారు ఛేజింగ్ ఒక ఎత్తయితే.. ఇంతలో అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఓ పరిణామం ఈ చోరీలో అనూహ్యంగా మలుపుతిప్పింది. భట్నవిల్లిలో డీసీసీబీ డెరైక్టర్ యిళ్ల గోపాలకృష్ణ తన ఇంటి ముందు రోడ్డులో ఓ సంచిని గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, పట్టణ ఎస్సై రామారావులు వచ్చి ఆ సంచిని స్వాధీనం చేసుకుని తెరిచి చూస్తే సంచిలో రూ.20 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. వేణు ఛేజ్ సమయంలోదొంగల ముఠా కారులోంచి డబ్బు సంచి విసిరేసింది. ఇది గమనించిన వేణు విషయాన్ని తన వెంట మరో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులకు చెప్పాడు. ఇంతలో సీఐ శ్రీనివాసరెడ్డి రూ.20 లక్షల నగదు ఉన్న సంచిని స్వాధీనం చేసుకున్నారు. వేణు మనుషులు వచ్చి అది తమదేనని చెప్పినా పోలీసులు నమ్మలేదు. నగదు స్వాధీనం చేసుకుని అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తరువాత పూర్తిస్థాయిలో విచారించి, ఆ సొమ్ము వేణుదేనని నిర్ధారించారు. మిస్టరీగా రూ. ఐదు లక్షలు అయితే వేణు రూ.25 లక్షలు డ్రా చేస్తే రూ.20 లక్షలు మాత్రమే దొరకడంతో మిగిలిన రూ. ఐదు లక్షలు ఏమయ్యాయనే ప్రశ్న చర్చనీయాంశమైంది. అయితే పోలీసులు కొన్ని కోణాల్లో అనుమానిస్తున్నారు. దొంగల ముఠా రూ.20 లక్షల సంచి విసిరేసినట్టే, మరికొంత దూరంలో రూ.ఐదు లక్షలను విసిరేశారా? కాట్రేనికోన మండలం పల్లంకుర్రు ఏటిగట్టు వద్ద దొంగల ముఠా పట్టుబడినప్పుడు కారులోంచి పరారైన వ్యక్తి వాటిని పట్టుకుపోయాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది తమిళనాడు ముఠా పనేనా...?: తమిళనాడు రిజిస్ట్రేషన్ స్విఫ్ట్‌కారులో దొంగల ముఠా రావడంతో ఈ చోరీ ఆ ప్రాంతానికి చెందిన ముఠాపనేనా అనే దిశగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. ఈ ముఠాలో ఒక యువకుడు గతంలో తమిళనాడులోని ఓ షిప్పింగ్ హార్బర్లో పనిచేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే మరో ఇద్దరు యువకుల మాటలు నెల్లూరు జిల్లా యాసతో ఉండడంతో ఆ జిల్లాకు చెందిన వారా అనే దిశగా కూడా విచారిస్తున్నారు. ఇక్కడికే ఎందుకొచ్చారు? ఆక్వా కల్చర్‌కు పెట్టని కోట అయిన కోనసీమలో అమలాపురం ఎర్రవంతెన కేంద్రంగా ఆక్వా వ్యాపారం రూ.కోట్లలో విస్తరించింది. ప్రతి రోజూ ఇక్కడ రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. నెల్లూరు జిల్లాలో కూడా ఆక్వా రంగం విస్తరించి ఉంది. అక్కడి వ్యాపారులతో ఇక్కడి వారికి వ్యాపార సంబంధాలు ఉంటాయి. పెపైచ్చు ఆక్వా సొమ్ములకు బిల్లులు, రసీదులు ఉండవు. అంతా చిన్నపాటి స్లిప్పులతోనే సాగిపోతుంది. ఈ క్రమంలో బాధితుడు వేణుకు, దొంగల ముఠాగా భావిస్తున్న వ్యక్తులకు వ్యాపార సంబంధమైన వివాదాలు ఏమైనా ఉన్నాయా? ఈ క్రమంలోనే సినీ ఫక్కీలో ఇదంతా జరిగిందా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.