vigilence officers
-
ఇఎస్ఐ ఆసుపత్రుల్లో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి, కర్నూలు : రాయలసీమ జోన్ జాయింట్ డైరెక్టర్ పరిధిలోని ఇఎస్ఐ ఆసుపత్రుల్లో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని వచ్చిన నివేదిక మేరకు విజిలెన్స్ అధికారులు తగిన చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాలలోని డిస్పెన్సరీల్లో మందులకు సంబంధించిన రికార్డులను శనివారం తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం సాయంత్రానికి పూర్తి నివేదికను ఇవ్వననున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
నిబంధనలకు పాతర.. అవినీతి జాతర
సాక్షి, రేపల్లె (గుంటూరు) : నీకింత.. నాకంత.. అంటూ అభివృద్ధి పనుల మాటున ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పంచుకున్నారు. అడిగేది, అడ్డుకునేది ఎవరు అంటూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అధికారులు, కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు పూర్తిచేసి నిధులు మిగుల్చుకున్నారు. ఆ తరువాత వాటాలేసుకుని ఆ నిధులను స్వాహా చేశారు. నిర్మించిన నెలల వ్యవధిలోనే రోడ్లు, డ్రెయిన్లు ధ్వంసం కావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అవినీతి గుట్టును రట్టుచేశారు. పట్టణంలో గత ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సుమారు రూ.22 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. నెలలు గడవకముందే రోడ్లు గుంతల మయంగా మారడం, డ్రెయిన్లు కుప్పకూలడంతో పట్టణ ప్రజలు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు విచారణలో అవినీతి గుట్టు రట్టుయింది. పనుల నాణ్యతను తనిఖీచేసి నిర్ధారించాల్సిన థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అక్రమార్కులకు అండగా నిలిచారని నిగ్గుతేల్చారు.పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థను ఉన్నతాధికారులు బ్లాక్ లిస్ట్‌లో, పెట్టి సంబంధిత మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులపై చర్యలకు సిఫారసు చేసినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యే అనగాని ఆధ్వర్యంలోనే.. రేపల్లె పట్టణంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లేకపోవడం వెనుక స్థానిక ఎమ్మెల్యే అనగాని ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అండతో పనులను చేపట్టిన కాంట్రాక్టు సంస్థ పనులను నాసిరకంగా పూర్తిచేసింది. నిర్మించి నెలలు కూడా గడవకముందే రోడ్లు గోతులమయంగా మారడం, డ్రెయిన్లు కుప్పకూలడం ఈ పనుల్లో అవి నీతిని పట్టిచూపుతున్నాయి. ఎమ్మెల్యే, కాంట్రాక్టర్, అధికారులు నిధులను పంచుకుని పనులు నాసిరకంగా చేయడం వల్లే రోడ్లు ధ్వంసం అయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అనగాని పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యమని పట్టణ ప్రజలు విర్శి స్తున్నారు. కల్వర్టుల్లో నిధుల స్వాహా నిజాంపట్నం మండలం అడవులదీవి – కొత్తపాలెం రహదారి 5 కిలో మీటర్లు, మంత్రిపాలెం – అడవులదీవి రహదారి 3 కిలోమీటర్ల మేర విస్తరించారు. ఈ పనులను రూ.10 కోట్లతో నిర్వహించారు. అడవులదీవి – కొత్తపాలెం రోడ్డు నిర్మాణంలో తూములలో 8 కల్వర్టులు, ఒక చోట శ్లాబ్ కల్వర్టు నిర్మించాల్సి ఉంది. అయితే శ్లాబ్ కల్వర్టు స్థానంలో తూములతో సరిపెట్టారు. మిగిలిన కల్వర్టుల నిర్మాణంలో నాణ్యతను గాలికి వదిలేశారు. రోడ్డు మధ్యలో కొత్త తూములు వేసి కల్వర్టులు నిర్మించాలన్నది నిబంధన. అయితే పాత తూములనే వినియోగించి కల్వర్టుల నిర్మాణం పూర్తిచేసి, నిధులు మిగుల్చుకుని పంచుకున్నారు. ఈ రోడ్ల విస్తరణ పనుల్లో స్థానిక ప్రజల వినతులను సైతం పట్టించుకోలేదు. అధికార వర్గాల్లో గుబులు 2014 ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కాంట్రాక్టర్ల నుంచి భారీ స్థాయిలో కమీషన్లు దండుకుని అభివృద్ధి పనుల్లో తీవ్ర అవినీతికి తావిచ్చారు. అదేమని కాంట్రాక్టర్లను ప్రశ్నించే పరిస్థితి అధికారులకు లేకుండా వారిపై ఒత్తిడితెచ్చారు. ఐదేళ్లు పూర్తికావడంతో ఉన్నతాధికారులు విచారణ నిర్వహిస్తూ తమపై చర్యలకు సిఫారసులు చేస్తుంటే తనకు సంబంధం లేదన్నట్లుగా ఎమ్మెల్యే అనగాని వ్యవహరిస్తున్నాడని పలువురు అధికారులు వాపోతున్నారు. నిర్మాణంలోనే కూలిన శ్లాబ్ గూడవల్లి ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణ సమయంలో కుప్పకూలిన శ్లాబ్ చెరుకుపల్లి–నగరం, నగరం–రేపల్లె అభివృద్ధి పనుల్లోనూ అవినీతి పొంగిపొర్లింది. ఈ రోడ్లు కూడా నిర్మించిన నెలల వ్యవధిలోనే గోతులమయంగా మారాయి. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు బినామీగా వ్యవహరిస్తున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కాంట్రాక్టర్ అవతారమెత్తి ఈ రోడ్ల నిర్మాణ పనులు దక్కించుకుని నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. గూడవల్లి ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను దక్కించుకున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్లాబ్ వేసిన గంటల వ్యవధిలో కూలిపోంది. దీనిని బట్టే నాణ్యతా ప్రమాణాలు ఏ స్థాయిలో పాటించారో అర్థంచేసుకోవచ్చు. -
తూర్పు గోదావరి... మీ ఓటు చెక్ చేసుకోండిలా..
సాక్షి, తూర్పు గోదావరి : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీపేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కలెక్టరేట్లోని కంట్రోల్ రూం ల్యాండ్‌లైన్ నెం : 0884–2371950, 0884–2371951 కాల్ సెంటర్ ఇన్చార్జి : డీటీ సరస్వతి, టోల్ ఫ్రీ నెం. 1800 425 3077 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఓటు నమోదుకు అవకాశం ఉంది.అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
ప్రకాశించని ‘సప్తవర్ణం’..
సాక్షి, అమరావతి: సప్తవర్ణ దుప్పట్ల పథకం రోగులకు రంగుల కలగానే మిగిలిపోయింది. కొద్ది నెలల కిందట ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే దీనికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఏడు రంగుల కలిగిన దుప్పట్లు ఏడు రోజులు రోగుల పడకలపై వేయాలి. కానీ నిర్వాహకులు మాత్రం మాసిన దుప్పట్లే వేసి మమ అనిపిస్తున్నారు. ఏడు రోజుల దుప్పట్ల సంగతి దేవుడెరుగు వారానికి రెండు రకాల దుప్పట్లు కూడా వేయడం లేదు. దీంతో ఈ పథకంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అనంతరం విజిలెన్స్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వాస్పత్రులకు విచారణకు వెళ్లగా అసలు నిజాలు బయటికొచ్చాయి. మాసిపోయినవి.. ఉతకని దుప్పట్లే వేస్తున్నారు సప్తవర్ణాలు ఆ దుప్పట్లపై కనిపించనే లేదని, ఆ రంగులు ఒక్క ఉతుకుకే వెలిసిపోయాయని, రంగులు కనిపించకపోవడంతో వాళ్ల ఇష్టమొచ్చిన దుప్పట్లు వేసి వెళుతున్నారని, బిల్లులు మాత్రం సప్తవర్ణ దుప్పట్లు వేస్తున్నట్టుగా చూపిస్తున్నారని నిర్ధారించారు. కొన్ని చోట్ల సగం పడకకు కూడా సరిపోని దుప్పట్లు, మాసిపోయిన దుప్పట్లు, ఉతకని దుప్పట్లు వేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా బోధనాస్పత్రుల్లో అత్యంత దారుణంగా సప్తవర్ణ దుప్పట్లున్నాయని.. దీనిపై రెండ్రోజుల కిందటే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఓ వైపు సప్తవర్ణ దుప్పట్లు అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పగా చెబుతుండగా.. ప్రారంభించిన కొద్ది రోజులకే పథకం నీరుగారడంపై అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలు అమలైతే ఒట్టు - ఏడు రోజులకు ఏడు రంగులు కలిగిన దుప్పట్లు వేయాలి. - రోజూ ఉతికిన దుప్పట్లే వేయాలి. - 60 సార్లు ఉతుకులుపడ్డాక ఆ దుప్పట్లను మార్చాలి. - ఈ నిబంధనలు విధిగా పాటిస్తేనే నిర్వాహకులకు డబ్బులివ్వాలి. కానీ ఇవేవీ పాటించకుండానే కొత్త దుప్పట్లు మార్చినట్టు చూపించి బిల్లులు పెడుతున్నారు. ఏడు వర్ణాలు కలిగిన దుప్పట్లు ఒక్క రోజులోనే రంగు వెలిసిపోయాయి. రంగులు లేకపోవడంతో దుప్పట్లు తారుమారవుతున్నాయి. ఇప్పటికే దుప్పట్ల వ్యవహారంపై సర్కారుకు పలు ఫిర్యాదులొచ్చాయి. దుప్పట్ల నిర్వహణ లోపాలపై విజిలెన్స్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
రైస్ మిల్లు యజమానులపై విజిలెన్స్ కొరడా
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అనధికారికంగా నిల్వచేసిన రూ.2 కోట్ల విలువైన బియ్యం, ధాన్యాన్ని అధికారులు సీజ్ చేశారు.