అందోలులో దళిత సంఘాల ఆందోళన
మెదక్ జిల్లా మనూర్ మండలం ఇరక్‌పల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా అందోలులో సోమవారం దళిత సంఘాల వారు రాస్తారోకో చేపట్టారు. విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులను శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకో కారణంగా రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. సంగారెడ్డి, జోగిపేట వైపు వెళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జోగిపేట ఎస్ఐ విజయ్‌రావు ఆందోళన కారులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.