Vijay Zol
-
కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్
India Under 19 Captain Vijay Zol: భారత అండర్-19 క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విజయ్ జోల్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. జోల్‌తో పాటు అతని సోదరడు విక్రమ్ జోల్, మరో 18 మంది తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడి, దోపిడి చేసినట్లు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఒకరు మహారాష్ట్రలోని ఔరంగబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విజయ్ జోల్, విక్రమ్ జోల్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరోవైపు సదరు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌పై కూడా ఓ వ్యక్తి (ఈ కేసులో నిందితుల్లో ఒకరు) ఫిర్యాదు చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరిట సదరు మేనేజర్ తమను లక్షల మేర మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అతనిపై సైతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Yuvi pa!thanks for ua motivating words!will surely keep them in mind and keep working hard!thanks again!@YUVSTRONG12 pic.twitter.com/ikM0NimC25 — Vijay Zol (@vhzol) December 24, 2014 కాగా, 2014లో భారత అండర్-19 టీమ్ కెప్టెన్‌గా ఎంపికైన 28 ఏళ్ల విజయ్ జోల్.. మహారాష్ట్ర, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (యూత్ కాంట్రాక్ట్) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో జరిగిన అండర్-19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో జోల్ 467 బంతుల్లో 53 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 451 పరుగులు చేశాడు. Wid Abraham De Villiers!☺️@ABdeVilliers17 @mstarc56 u spoiled it Mitchyy.!😄 pic.twitter.com/K03PMO6qZ3 — Vijay Zol (@vhzol) May 23, 2014 ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇదే అత్యధిక స్కోర్‌గా ఉంది. జోల్.. 2010 విజయ్ మర్చంట్ టోర్నీలోనూ డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ సహచరుడైన జోల్.. అంతర్జాతీయ స్థాయిలో సరైన అవకాశాలు రాక దేశవాలీ టోర్నీలకే పరిమితమయ్యాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 11 మ్యాచ్‌లు ఆడిన జోల్.. 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీల సాయంతో 47.50 సగటున 965 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్ 200 నాటౌట్‌గా ఉంది. -
జోల్‌పై మ్యాచ్ నిషేధం
దుబాయ్ : అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌లోనే వెనుదిరిగిన భారత్‌కు మరో దెబ్బ తగిలింది. కెప్టెన్ విజయ్ జోల్‌పై ఐసీసీ ఒక వన్డే మ్యాచ్ నిషేధం విధించింది. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ డకెన్ అవుట్ కాగానే... జోల్ అతడిని దూషించాడు. దీంతో అంపైర్ల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన రిఫరీ... జోల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. అతనిపై విధించిన మ్యాచ్ నిషేధం తక్షణమే అమల్లోకి రానుంది. దీంతో... శ్రీలంకతో నేడు జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో జోల్ పెవిలియన్‌కే పరిమితం కానున్నాడు. క్వార్టర్ఫైనల్లో క్రమశిక్షణ నియమావళిని అతిక్రమించిన ఆఫ్ స్పిన్నర్ గనిని హెచ్చరించారు. -
నిలబెట్టుకుంటారా!
అండర్-19 ప్రపంచకప్ నేటి నుంచి భారత్ తొలిమ్యాచ్ పాకిస్థాన్‌తో రేపు అబుదాబి: మూడుసార్లు విజేతగా, డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగనున్న అండర్-19 ప్రపంచకప్‌కు శుక్రవారం తెరలేవనుంది. 16 రోజులపాలు 48 మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నీలో భారత యువజట్టు తమ తొలిమ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శనివారం తలపడనుంది. కాగా, టోర్నీకి సన్నాహకంగా జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో భారత కుర్రాళ్లు వరుసగా శ్రీలంక, దక్షిణాఫ్రికాల చేతిలో ఓటమిపాలవడం కొంత ఆందోళన కలిగించే అంశమే. అయితే అది పెద్ద విషయమే కాదని కెప్టెన్ విజయ్ జోల్ అంటున్నాడు. -
ప్రపంచకప్ నిలబెట్టుకుంటాం
దుబాయ్: అండర్-19 ప్రపంచకప్‌ను నిలబెట్టుకుంటామని భారత యువ జట్టు కెప్టెన్ విజయ్ జోల్ అన్నాడు. ఈ నెల 14 నుంచి మార్చి 11 దాకా యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నీలో గ్రూప్ ‘ఎ’లో... భారత యువజట్టు తమ తొలిమ్యాచ్‌ను పాకిస్థాన్‌తో 15న ఆడనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచి పాక్‌పై పైచేయి సాధిస్తామని జోల్ అన్నాడు. అయితే తమపై ప్రత్యేక ఒత్తిడేమీ ఉండదన్నాడు. ‘పాక్‌తో మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకం, భిన్నమైనదే. ఇటీవలే అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో వారిని ఓడించినందుకు మానసికంగా మాదే పైచేయి’అని జోల్ అన్నాడు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాక్, స్కాట్లాండ్, పీఎన్జీ జట్లు ఉన్నాయి.