అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌లోనే వెనుదిరిగిన భారత్‌కు మరో దెబ్బ తగిలింది. కెప్టెన్ విజయ్ జోల్‌పై ఐసీసీ ఒక వన్డే మ్యాచ్ నిషేధం విధించింది.
దుబాయ్ : అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌లోనే వెనుదిరిగిన భారత్‌కు మరో దెబ్బ తగిలింది. కెప్టెన్ విజయ్ జోల్‌పై ఐసీసీ ఒక వన్డే మ్యాచ్ నిషేధం విధించింది. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ డకెన్ అవుట్ కాగానే... జోల్ అతడిని దూషించాడు. దీంతో అంపైర్ల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన రిఫరీ... జోల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. అతనిపై విధించిన మ్యాచ్ నిషేధం తక్షణమే అమల్లోకి రానుంది.
దీంతో... శ్రీలంకతో నేడు జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో జోల్ పెవిలియన్‌కే పరిమితం కానున్నాడు. క్వార్టర్‌ఫైనల్లో క్రమశిక్షణ నియమావళిని అతిక్రమించిన ఆఫ్ స్పిన్నర్ గనిని హెచ్చరించారు.