ప్రపంచకప్ నిలబెట్టుకుంటాం | Vijay Zol to lead India in ICC Under-19 World Cup | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్ నిలబెట్టుకుంటాం

Published Fri, Feb 7 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

ప్రపంచకప్ నిలబెట్టుకుంటాం

ప్రపంచకప్ నిలబెట్టుకుంటాం

దుబాయ్: అండర్-19 ప్రపంచకప్‌ను నిలబెట్టుకుంటామని భారత యువ జట్టు కెప్టెన్ విజయ్ జోల్ అన్నాడు. ఈ నెల 14 నుంచి మార్చి 11 దాకా యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నీలో గ్రూప్ ‘ఎ’లో... భారత యువజట్టు తమ తొలిమ్యాచ్‌ను  పాకిస్థాన్‌తో 15న ఆడనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచి పాక్‌పై పైచేయి సాధిస్తామని జోల్ అన్నాడు.
 
 అయితే తమపై ప్రత్యేక ఒత్తిడేమీ ఉండదన్నాడు. ‘పాక్‌తో మ్యాచ్  ఎప్పుడూ ప్రత్యేకం, భిన్నమైనదే.  ఇటీవలే అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో వారిని ఓడించినందుకు మానసికంగా మాదే పైచేయి’అని జోల్ అన్నాడు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాక్, స్కాట్లాండ్, పీఎన్‌జీ జట్లు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement