మూడుసార్లు విజేతగా, డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగనున్న అండర్-19 ప్రపంచకప్‌కు శుక్రవారం తెరలేవనుంది.
అండర్-19 ప్రపంచకప్ నేటి నుంచి
భారత్ తొలిమ్యాచ్ పాకిస్థాన్‌తో రేపు
అబుదాబి: మూడుసార్లు విజేతగా, డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగనున్న అండర్-19 ప్రపంచకప్‌కు శుక్రవారం తెరలేవనుంది. 16 రోజులపాలు 48 మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నీలో భారత యువజట్టు తమ తొలిమ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శనివారం తలపడనుంది.
కాగా, టోర్నీకి సన్నాహకంగా జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో భారత కుర్రాళ్లు వరుసగా శ్రీలంక, దక్షిణాఫ్రికాల చేతిలో ఓటమిపాలవడం కొంత ఆందోళన కలిగించే అంశమే. అయితే అది పెద్ద విషయమే కాదని కెప్టెన్ విజయ్ జోల్ అంటున్నాడు.