vijaya malya
-
లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన మంటలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ దావానలంలో చిక్కుకుని ఇప్పటి వరకూ ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. 30వేల మందికిపైగా నిరాశ్రయులు కావడం ఆందోళన రేపుతోంది.పాలిసాడ్స్ అగ్నిప్రమాదం మాలిబు, శాంటా మోనికా మధ్య సముద్రతీర ప్రాంతాన్నిదహించివేస్తోంది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, మంటలు 17 వేల ఎకరాలకు పైగా వ్యాపించాయి. వీటిని అదుపు చేసే ఆశలు కనిపించడంలేదు. ఇప్పటివరకు ఇదే అత్యంత వినాశకరమైన అగ్నిప్రమాదంగా భావిస్తున్నారు. ఒకేరోజు మూడు ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగడంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.ఈ నేపథ్యంలో హాలీవుడ్ సెలబ్రిటీలు సహా చాలా మంది సంపన్నుల నివాసాలు మంటల్లో చిక్కుకున్నాయి. వీరిలో చాలామంది తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్లను వీడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా,అతని భార్య జాస్మిన్ లాస్ ఏంజిల్స్‌లో ఇరుక్కున్న్టటు వార్తలొచ్చాయి. దీనిపై స్వయంగా సిద్దార్థ స్పందించాడు. ప్రస్తుతానికి తాను, తన భార్య జాస్మిన్, పెట్స్ సురక్షితంగా ఉన్నామని తెలిపాడు. అంతే కాదు, సహాయం కావాల్సిన వారు, దయ చేసి తమను సంప్రదించాల్సిందిగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోరాడు. సహాయం అలాగే అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అటు జాస్మిన్ కూడా తన వంతుగా, విపత్తులో ప్రభావితమైన వారికి సహాయ సామగ్రి గురించి సమాచారాన్ని కూడా ఇచ్చింది. (బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!)విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ , అతని భార్య జాస్మిన్ లండన్‌లో నివసిస్తున్నప్పటికీ, ఈ జంట లాస్ ఏంజిల్స్‌లో వెకేషన్లో ఉన్నారు. ఈ సమయంలో పాలిసాడ్స్ అగ్నిప్రమాదం సంభవించిందిమరోవైపు ఈ ప్రమాదంలో ప్రియాంక చోప్రా ,నోరా ఫతేహి కూడా ప్రభావితమయ్యారు. ప్రియాంక పాలిసాడ్స్ అగ్నిప్రమాదానికి సంబంధించిన భయంకరమైన వీడియోను పోస్ట్ చేసింది.అలాగే నోరా ఫతేహి తన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. "నేను LAలో ఉన్నాను , ఫారెస్ట్ మంటలు భయంకరంగా ఉన్నాయి. అసలు ఇలాంటిది ఇంతకుముందు చూడలేదు. ఐదు నిమిషాల క్రితం తరలింపు ఆర్డర్ వచ్చింది. కాబట్టి నేను త్వరగా నా సామాను అంతా సర్దుకుని ఇక్కడి నుండి ఖాళీ చేస్తున్నాను. నేను విమానాశ్రయం దగ్గరకు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటా’’ అంటూ వెల్లడించింది.కాగా విజయ్ మాల్యా , అతని మొదటి భార్య సమీరా త్యాబ్జీ మాల్యా కుమారుడే సిద్ధార్థ. గత ఏడాది జూన్‌లో తన చిరకాల ప్రేయసి జాస్మిన్ను పెళ్లాడాడు. విలాసవంతమైన హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ఎస్టేట్‌లో చాలా కొద్దిమంది హితులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!) -
ఒక్క నిర్ణయంతో...
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జీవితాలే తలకిందులైపోతాయి. తెలివైన వాళ్లు కూడా తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుని భారీ మూల్యం చెల్లించిన ఘటనలు చరిత్రలో ఉన్నాయి. మహా భారతంలో కీలకపాత్ర పోషించిన శకుని సాక్షాత్తూ గాంధారీ దేవి సోదరుడు. కౌరవులపై పగబట్టి ఉన్న శకుని కౌరవులకు అత్యంత ఆత్మీయుడిగా నటించాడు. తమ కారణంగా తండ్రినీ, సోదరులనూ పోగొట్టుకున్న శకుని మామను దుర్యోధనాదులు గుడ్డిగా నమ్మడం చిత్రమే! కోవర్ట్ ఆపరేషన్లతో కురు వంశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా తనకున్న మాయాద్యూత విద్యతో కౌరవుల మనసులు గెలుచుకున్నాడు శకుని. మొదట్లోనే శకుని మామను కూడా అంతమొందించి, శత్రుశేషం లేకుండా చేసుకుని ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్ల కౌరవులు తమ నాశనాన్ని తామే కోరి తెచ్చుకున్నారు. కురుక్షేత్ర సంగ్రామం అనంతరం దుర్యోధనుడు ఓ మడుగులో దాగాడు. తనకున్న జల స్తంభన విద్య ద్వారా నీటి అడుగున ఉండగలిగాడు. అప్పుడు ధర్మరాజు అతణ్ణి పిలిచి ‘సుయోధనా! నువ్వు ఒక్కడివి ఉన్నావు. మేం అధర్మ యుద్ధం చేయం. మా అయిదుగురిలో నువ్వు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నావో చెప్పు. అందులో నువ్వు గెలిస్తే ఈ యుద్ధంలో పాండవులు ఓడినట్లే’ అన్నాడు. అలా బంగారం లాంటి అవకాశం అంది వస్తే దుర్యోధనుడు ఏం చేయాలి? నీతోనే నేను యుద్ధం చేస్తాను అని తెలివిగా సవాలు విసిరి ఉంటే, యుద్ధం చేయకుండానే దుర్యోధనుడు గెలిచి ఉండేవాడేమో! కనీసం నకుల, సహదేవుల్లో ఏ ఒక్కరితో యుద్ధానికి కాలు దువ్వినా గెలిచేవాడేమో అని కొందరి వాదన. కానీ అలా చేయకుండా భీముడితో యుద్ధానికి సై అన్నాడు. భీముడు యుద్ధ నిబంధనలకు విరుద్ధంగా సుయోధనుని తొడలు విరగకొట్టి, కురు రాజును అంతమొందించాడు. రామాయణంలోనూ అంతే. వాలిని సంహరించేందుకు రెండో సారి రాముణ్ణి వెంటబెట్టుకుని వెళ్లిన సుగ్రీవుడు తన అన్న వాలిని ఉద్దేశించి, దమ్ముంటే యుద్ధానికి రారా అని సవాల్ విసిరాడు. నిజానికి అంతకు ముందే సుగ్రీవుణ్ణి చావ చితక్కొట్టి పంపించాడు వాలి. ఆ దెబ్బలు తట్టుకోలేక సుగ్రీవుడు చిత్రకూట పర్వతానికి పారిపోయి తలదాచుకున్నాడు. అలా పారిపోయినవాడు మళ్లీ యుద్ధానికి కాలుదువ్వాడంటే వాడి వెనకాల ఏదో ఓ బలం ఉందనో, కుట్ర ఉందనో వాలి గుర్తించకపోవడం పెద్ద పొరపాటు. ఓ రాజ్యాధినేత అయి ఉండి, సరిపడా వేగులను కలిగి ఉండి, నిఘా విభాగాల నుండి సమాచారాన్ని రాబట్టుకోవలసిన వాలి... అవన్నీ పక్కన పెట్టి కేవలం ఆవేశంతోనూ, అహంకారంతోనూ దూసుకొచ్చేసి రాముడి బాణానికి నేలకొరిగాడు. కాస్త తెలివిగా ప్రవర్తించి ఉంటే సుగ్రీవుడి తెర వెనుక బలం గురించి తెలుసుకుని జాగ్రత్త పడే అవకాశం ఉండింది కూడా! సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోలేకనే వాలి కథ అలా ముగిసింది. ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుని జీవితాలు తలకిందులు చేసుకున్న వాళ్లు ఈ యుగం లోనూ ఉన్నారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి బ్రిటన్ పారిపోయి అక్కడ తలదాచుకున్న విజయ్ మాల్యా కథ అలాంటిదే! కింగ్‌ఫిషర్ బీరుతో కోట్ల ఆస్తులు గడించాడు. వ్యాపారంలో పాదరసం వంటి విజయ్ మాల్యా తన జీవితంలో ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో ఆ రంగంలో అడుగుపెట్టాడు. ఓ ప్రైవేటు విమానయాన కంపెనీని కొన్నాడు. అందుకోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాడు. ఆ నిర్ణయమే ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని చావుదెబ్బ తీసింది. హాయిగా చేతిలోని చల్లటి వ్యాపారం చేసుకుంటూ, కడుపు చల్లగా ఉంచుకోకుండా నష్టాల్లో ఉన్న రంగంలోకి ఎందుకొచ్చినట్లు అని మాల్యాను ఉద్దేశించి అంతా అనుకున్నారు. మాల్యా ఏదైనా అద్భుతం చేస్తాడని అనుకున్నారు. ఎలాంటి మ్యాజిక్కులూ జరగకుండానే దివాళా తీశాడు. చేసిన అప్పులు తీర్చలేక చేతులెత్తేసి, చివరకు ఓ చీకటి ముహూర్తాన బ్రిటన్ పారిపోవలసి వచ్చింది. విమాన యాన రంగం నుంచి అందరూ బయటకు వస్తోన్న సమయంలో మాల్యా ఆ రంగంలోకి రాకపోయి ఉంటే ఈ పాటికి మన దేశంలోనే బ్యాంకులకు లక్షల కోట్లు అప్పు పెంచుకుని దర్జాగా ఉండేవాడేమో! మన రాష్ట్రానికే చెందిన సత్యం రామలింగరాజు కూడా అంతే కదా! ఆయన ఐటీ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించాడు. దాంతో తృప్తి పడి ఉంటే సరిపోయేది. కానీ అలా చేయ లేదు. లేని లాభాలను కాగితాలపై చూపించి, ఆ లాభాలకు అనుగుణంగా అనవసరంగా పన్నులు కట్టి, ప్రపంచం కళ్లు కప్పాలనుకున్నాడు. చివరకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఓ అబద్ధాన్ని ఎక్కువ కాలం కాపాడలేక దొరికిపోవలసి వచ్చింది. ప్రపంచ చరిత్రలోనూ ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. కోల్డ్ వార్ ముసుగులో అమెరికా – సోవియట్ యూనియన్ల మధ్య జరిగిన పోరాటంలోనూ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు రెండు దేశాలనూ దెబ్బతీశాయి. వియత్నాం వార్‌లో చావు దెబ్బతిన్న అమెరికా... అఫ్గాన్ వార్‌లో సోవియట్ యూనియన్ను ముగ్గులోకి దింపి ప్రతీకారం తీర్చుకుంది. సోవియట్ పాలకులు తీసుకున్న తెలివితక్కువ నిర్ణయమే సోవియట్ పతనానికి దారి తీసింది. అందుకే... సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెప్పేది. దాన్ని ఆచరించగలిగిన వారు ప్రశాంతంగా ఉంటారు. లేని వాళ్లు పతనాన్ని కోరి కొనితెచ్చుకుంటారు. తస్మాత్ జాగ్రత్త! -
'విజయ్‌మాల్యాతో పోలీస్తే వారి అప్పు ఎంత?'
జనగామ: పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా బ్యాంకు ద్వారా పొందిన అప్పుల చిట్టాలో తెలంగాణ రైతుల రుణాలు ఏమాత్రమని పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రశ్నించారు. జనగామలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. మాల్యాకు ఇచ్చిన అప్పులు ఎలా రాబట్టుకోవాలో తెలియక జుట్టు పీక్కుంటున్న బ్యాంకులకు.. కొత్త రుణాలు ఇచ్చి పాతవి రాబట్టుకోవాలంటూ కేంద్రం ఉచిత సలహా ఇచ్చిందని విమర్శించారు. అదే రైతులకు ఇస్తే మాత్రం దివాళా తీస్తారని చెప్పడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో వాటా పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి 60 శాతం హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదాయం వస్తుందన్నారు. కరువు, ఉపాధి, విద్యారంగాల్లో తెలంగాణ సంక్షోభంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయూలని ఉపాద్యాయులకు సూచించారు. అదే సమయంలో జేఏసీగా ఏర్పడి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మనోహర్‌రాజు, మైస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విజయ్ మాల్యాకు రూ. 10 లక్షల జరిమానా
ఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త, లిక్కర్ కింగ్ విజయ మాల్యాకు సుప్రీంకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫెరా నిబంధనలను అతిక్రమించిన కేసులో తనపై ఉన్న కేసును కొట్టేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో పాటు రూ. 10 లక్షల జరిమానా కూడా విధించింది. జస్టిస్ జేఎస్ ఖేకర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నిధుల సమీకరణలో మాల్యా ఫారిన్ ఎక్సేంజ్ రెగ్యులేషన్ చట్టాల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంలో అప్పీలు చేశారు. దీనికి సంబంధించి 1985లో జరిగిన ఒప్పంద వివరాలపై ఆయనను ప్రశ్నించాలంటూ ఈడీ సమన్లు జారీ కోరింది. కాగా తన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోషన్ కోసం లండన్‌కు చెందిన బెంటెన్ ఫార్ములా లిమెటెడ్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో సుమారు రెండు లక్షల డాలర్లను అక్రమంగా చెల్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, అవేవీ వాస్తవం కాదని కింగ్‌ఫిషర్ కొట్టిపారేసింది. గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌లోని పెట్టుబడులను సహారా ఫోర్స్ ఇండియాలోకి తరలించినట్లు కూడా విజయ్ మాల్యాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.