జగన్‌కు బెయిలు జనం జేజేలు
వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బెయిలు మంజూరు కావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయూరు. చెన్నై నగరంలోని పలు కూడళ్లలో సంబరాలు జరుపుకున్నారు. బాణపంచా పేల్చి మిఠాయిలు పంచి పెట్టారు. జై జగన్..జై జగన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. జగన్ ధీశాలి అని విజయచందర్ కొనియూడారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి తమిళనాడులోనూ అశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన కుమారుడు, వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని అక్రమం గా అరెస్ట్ చేసిన సమయంలో ఇక్కడి జనం తీవ్ర ఆవేదనకు గురయ్యూరు. జగన్ బయటకు వచ్చే రోజు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు సోమవారం సాయంత్రం బెయిల్ మంజూరు అయింది. ఈ సమాచారం టీవీల ద్వారా తెలుసుకున్న తమిళనాడులోని వైఎస్ అభిమానులు ఆనందంలో ముగినిపోయూరు. సంబరాలు జరుపుకున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు విభాగం నేతలు శరత్, జాకీర్‌హుస్సేన్, శరవణన్ భారీ సంఖ్యలో అభిమానులతో చెన్నై నగరంలోని విజయరాఘవ రోడ్డుకు చేరుకున్నారు. భారీ ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. జై జగన్ అనే నినాదంతో ఆ ప్రాంతం మార్మోగింది. అభిమానుల హడావుడితో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. జగన్‌కు బెయిల్ మంజూరైన సమయంలో చెన్నైలోనే ఉన్న నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ నేత గడ్డం వెంకట కృష్ణారెడ్డి అభిమానులను కూడగట్టి స్థానికంగానే సంబరాలు నిర్వహించారు. నగర ప్రజలకు మిఠారుులు పంచి పెట్టారు. ఈ సంబరాల్లో పాల్గొన్న సినీనటులు, పార్టీ సీనియర్ నేత విజయచందర్ మాట్లాడారు.
కుట్రలు నిలవవు
రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు ఎక్కువ కాలం నిలవలేవని జగన్‌కు బెరుుల్ మంజూరుతో నిరూపణ అరుుందని విజయచందర్ అన్నారు. సోనియాగాంధీకి ఎదురునిల్చి తెలుగుజాతి గౌరవాన్ని నిలిపిన ధీశాలి జగన్ అన్నారు. ఆయన జైలు నుంచి విడుదల కావడం అభిమానులకు పెద్ద పండుగలా మారిందని చెప్పారు. గడ్డం వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారన్నారు. కాంగ్రెస్ నేతలు టీడీపీతో కుమ్మకై జగన్‌పై అక్రమకేసులు బనాయించి జైలు పాలుచేశారని ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనాన్ని, జగన్‌పై ప్రజలు చూపుతున్న అభిమానాన్ని తట్టుకోలేక పన్నిన కుట్రలు పటాపంచలై పోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు. నగరంలో జరిగిన సంబరాల్లో ఆస్కా ట్రస్టీ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. అలాగే తమిళనాడులోని తిరువళ్లూరు, పళ్లిపట్టు, వేలూరు తదితర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న రాజమండ్రికి చెందిన శివప్రసాద్ అనే జగన్ వీరాభిమాని తన సహోద్యోగులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.
తెలుగుజాతికే పండుగ : దివ్యవాణి, సినీ నటి
వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బెయిల్ లభించడం తెలుగుజాతికే పండుగలా మారింది. కుట్రపూరిత కేసులతో ఏడాదిన్నరగా జగన్ జైల్లో మగ్గిపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేకపోయారు. ప్రజల ప్రార్థనను దేవుడు మన్నించాడు, ఏసు ప్రభువు కరుణించాడు. జగనన్న జైలు నుంచి బయటకు వచ్చాడు.
న్యాయమే గెలిచింది : సత్యాదేవి, తమిళనాడు తెలుగు సమాఖ్య మహిళా విభాగం అధ్యక్షురాలు.
జగన్ చేస్తున్న ధర్మపోరాటంలో న్యాయదేవత కరుణించింది. బెయిల్ మంజూరు చేసింది. తండ్రి మరణించిన నాటి నుంచి ప్రజల్లోనే తిరుగుతూ వైఎస్ఆర్ లేని లోటును తీర్చే ప్రయత్నంలో కుళ్లు రాజకీయాల కారణంగా జగన్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. రాబోయే కాలంలో ప్రజాశీస్సులే జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తాయి.
ఆనందకరం
జగన్‌కు బెయిల్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. తమిళనాట ఉన్న తమలాంటి వారిని వైఎస్ మరణం తీవ్రంగా బాధించింది. తర్వాత జరిగిన పరిణామాలు మరింత ఆవేదన కలిగించాయి. ఇది వరకు ఓ మారు జగన్ కోసం శీర్షిక ద్వారా మా ఆవేదన వెలిబుచ్చాను. ఏ రోజుకైనా జగన్ బయటకు వస్తారని ఆశించాం. ఆ కల నెరవేరడం ఆనందంగా ఉంది.
- భారతీ కుమార్ (అనకాపుత్తూరు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్)