Vijayakanth friend
-
కరోనా: తమిళ నటుడు భూదానం
కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి సినిమా స్టార్స్ తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. తాజాగా తమిళ సీనియర్ నటుడు విజయ్‌కాంత్ భూదానం చేశారు. ఇటీవల చెన్నైలో కరోనా సోకిన ఓ న్యూరోసర్జన్‌ను స్మశానంలోకి అనుమతించలేదు ఆ పరిసర వాసులు. అక్కడితో ఆగకుండా ఆ ఆంబులెన్స్ మీద దాడి చేశారు కూడా. ఈ విషయం తెలిసి చలించిపోయిన విజయ్‌కాంత్.. చెన్నెలో ఉన్న తన స్థలంలో కొంత భాగాన్ని దానం చేశారు. కరోనా వ్యాధితో చనిపోయినవారిని ఖననం చేయడానికి ఆ చోటుని వాడుకోమని కోరారు ఆయన. ‘‘మృతదేహాల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందదు. ఈ విషయంలో జనంలో అవగాహన తీసుకురావాలి’’ ఈ సందర్భంగా విజయ్‌కాంత్ పేర్కొన్నారు. -
విజయకాంత్ మిత్రుడు ఇబ్రహీం మృతి
చెన్నై: తమిళ సినీ నిర్మాత ఏఎస్ ఇబ్రహీం రౌథర్(64) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం ఎస్ఆర్ఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్ల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆయన తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయారు. రౌథర్ ఫిలిమ్స్ పతాకంపై ఆయన పలు సినిమాలు నిర్మించారు. రాజకీయ నాయకుడిగా మారిన హీరో విజయకాంత్ కు చిరకాల మిత్రుడైన ఇబ్రహీం అవివాహితుడు. విజయకాంత్ సినిమా జీవితానికి ఇబ్రహీం ఇరుసులా ఉపయోగపడ్డారు. భరతన్, కారుప్పనిలా వంటి హిట్ సినిమాలు తీశారు. ఆయన తీసిన చివరి సినిమా 'పుత్తితగ ఆనందమ్ పుత్తితగ ఆరంబం' కొన్ని నెలల క్రితం విడుదలైంది. ఇబ్రహీం మరణం పట్ల తమిళ చిత్రపరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.