కరోనా: తమిళ నటుడు భూదానం | Corona: Tamil Actor Vijayakanth Land Was Donated | Sakshi
Sakshi News home page

కరోనా: తమిళ నటుడు భూదానం

Published Fri, Apr 24 2020 12:03 AM | Last Updated on Fri, Apr 24 2020 12:03 AM

Corona: Tamil Actor Vijayakanth Land Was Donated - Sakshi

విజయ్‌కాంత్‌ 

కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి సినిమా స్టార్స్‌ తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. తాజాగా తమిళ సీనియర్‌ నటుడు విజయ్‌కాంత్‌ భూదానం చేశారు. ఇటీవల చెన్నైలో కరోనా సోకిన ఓ న్యూరోసర్జన్‌ను స్మశానంలోకి అనుమతించలేదు ఆ పరిసర వాసులు. అక్కడితో ఆగకుండా ఆ ఆంబులెన్స్‌ మీద దాడి చేశారు కూడా.  

ఈ విషయం తెలిసి చలించిపోయిన విజయ్‌కాంత్‌.. చెన్నెలో ఉన్న తన స్థలంలో కొంత భాగాన్ని దానం చేశారు.  కరోనా వ్యాధితో చనిపోయినవారిని ఖననం చేయడానికి ఆ చోటుని వాడుకోమని కోరారు ఆయన. ‘‘మృతదేహాల నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదు. ఈ విషయంలో జనంలో అవగాహన తీసుకురావాలి’’ ఈ సందర్భంగా విజయ్‌కాంత్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement