vijayaramanarao
-
'మీ ఎమ్మెల్యే బంగారం కాదు..' : మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి: ‘మీ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బంగారమా? ఇక్కడి ప్రజలందరికీ రేకుల దొంగ, మట్టి, ఇసుక దొంగగానే తెలుసు. తుప్పు పట్టిన ఇనుపముక్కను బంగారం అని ఎట్ల చెప్తవ్.. అని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనపై ఎన్నికల్లో గెలిస్తే బీఆర్ఎస్లోకి వస్తానంటూ అక్కడక్కడ చెప్పుకుంటున్నారనే వ్యాఖ్యలకు ఆధారాలు చూపుతవా? అని ప్రశ్నించారు. షాడో సీఎం కేటీఆర్, అసలు సీఎం కేసీఆర్ ఎవరొచ్చినా అడ్డుకుంటరనే భయంతో పోలీసులను పంపి ప్రతిపక్షాలను నిలువరించడం అలవాటుగా మారిందని ఆరోపించారు. 24 గంటల కరంటు సరఫరా చేస్తున్నారనే విషయాన్ని నిరూపిస్తే తాను ఈసారి ఎన్నికల్లోనే పోటీచేయనని సవాల్ విసిరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులు చేయాల్సిన చిన్నపనులను కూడా చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతోనే మీ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. అందుకే కేటీఆర్ సభకే పెద్దపల్లి, జూలపల్లి జెడ్పీటీసీలు రాలేదన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ రాజయ్య, నాయకులు సురేశ్‌గౌడ్, అన్నయ్య, మల్లయ్య, దామోదర్, సుభాష్‌రావు, సతీశ్, మహేందర్, విజయ్, రాజు, రాజేశ్వర్‌రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. -
పోలీసుస్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే లొంగుబాటు
‘పచ్చ’నోట్లు పట్టుబడిన కేసులో విజయరమణారావుకు బెయిల్ హైదరాబాద్, ‘పచ్చ’నోట్ల కట్టలు పట్టుబడిన కేసులో నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే విజయరమణారావు మంగళవారం బొల్లారం పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. 12 రోజుల నుంచి పరారీలో ఉన్న ఆయన తె ల్లవారుజాము 5.30 గంటలకు పీఎస్‌లో ప్రత్యక్షమయ్యారు. లొంగిపోయిన గంటలోపే విజయరమణారావు బెయిల్ పొందారు. ఆ తర్వాత ఎవరి కంటపడకుండా పెద్దపల్లికి వె ళ్లిపోయారు. ఇదే కేసులో మరో నిందితుడు నాగరాజు మంగళవారం సికింద్రాబాద్ కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 10న బొల్లారం సమీపంలో ఎన్నికల అధికారులు కరీంనగర్ బస్సులో తనిఖీ చేస్తుండగా కోరుట్లకు చెందిన రాజమౌళి రూ. 89.87 లక్షల నగదు, టీడీపీ స్టిక్కర్లు ఉన్న బ్యాగుతో పట్టుపబడిన సంగతి తెలిసిందే. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఎమ్మెల్యే విజయరమణారావు పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ నగదును విజయరమణారావు ఆదేశంతో బేగంపేట్ వద్ద నాగరాజు నుంచి తీసుకుని కరీంనగర్ టీడీపీ కార్యాలయానికి తీసుకువెళుతున్నట్లు రాజమౌళి పోలీసులకు వివరించారు.ఈ కేసులో పోలీసులు నిందితులపై సెక్షన్లు 171(ఈ), 171(బి), 41, 102లను నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ఎమ్మెల్యే స్టేషన్లో లొంగిపోగా, నాగరాజు కోర్టులో లొంగిపోయారు.అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే: విజయరమణారావు ఎప్పుడు లొంగిపోయేదీ తెలుసుకున్న బొల్లారం పోలీసులు ముందస్తుగానే బెయిల్ పత్రాలు సిద్ధం చేశారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అతను తెల్లవారుజామున 5.30 గంటలకు స్టేషన్‌కు చేరుకునే సరికి ఇన్స్పెక్టర్తో సహా స్టాఫ్ రెడీగా ఉన్నారు. అతను స్టేషన్‌కు చేరుకున్న గంట లోపే ష్యూరిటీలను సమర్పించి 7 గంటల కల్లా పెద్దపల్లికి బయలుదేరిన విధానం పోలీసుల తీరును ప్రశ్నిస్తోంది. -
‘పచ్చ’ నోట్ల కేసులో టీడీపీ ఎమ్మెల్యే పరారీ
హైదరాబాద్, ఆర్టీసీ బస్సులో రూ. 90 లక్షలు ‘పచ్చ’నోట్లు పట్టుబడిన కేసులో నిందితుడైన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు (టీడీపీ) పరారీలో ఉన్నారు. ఆయనతో పాటు ఈ సొమ్ము వ్యవహారంలో ప్రమేయం ఉన్న నాగరాజు అనే వ్యక్తి కోసం గాలిస్తున్నామని బొల్లారం పోలీసులు తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పోలీసుల తనిఖీతో విజయరమణరావు పీఏ రాజమౌళి వద్ద రూ. 90 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే. రాజమౌళికి నగదును అందించిన నాగరాజుతో పాటు విజయరమణరావును పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. రాజమౌళిని అరెస్టు చేశారు. నాగరాజుకు ఈ డబ్బు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చాడు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాజమౌళి వాంగ్మూలం: ‘‘పెద్దపల్లి ఎమ్మెల్యే రమణరావు తనకు బేగంపేట్‌లో ఉన్న నాగరాజు ఫోన్ నంబరు (9989396721) ఇచ్చి నగదు తీసుకురావాలని చెప్పాడు. దీంతో నేను గురువారం ఉదయం 9 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ జూబ్లీస్టేషన్కు 11.30 గంటలకు చేరుకున్నాను. ఆ తర్వాత నాగరాజుకు ఫోన్ చేశా. అతను నన్ను బేగంపేట లైఫ్ స్టైల్ బిల్డింగ్ వద్దకు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన నాకు నాగరాజు నగదుతో ఉన్న నీలం రంగు పోలో బ్యాగ్ ఇచ్చాడు. దానిని తీసుకుని జూబ్లీ బస్‌స్టేషన్‌కు వచ్చి 3.30 గంటలకు కరీంనగర్ బస్సు ఎక్కాను. ఈ నగదును ఎన్నికల నిధుల కింద కరీంనగర్ జిల్లా టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్తున్నాను...’’ అని రాజమౌళి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.