Vijayawada Corporation
-
‘అమరావతి’ ఆందోళనకారుల ర్యాలీ
సాక్షి, గుంటూరు/తాడికొండ: ముందస్తు అనుమతులు లేకుండా రాజధాని అమరావతి ఆందోళనకారులు ర్యాలీ చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. గుంటూరు జిల్లాలోని అమరావతి రాజధాని ప్రాంతంలో 144వ సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఇక్కడ నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. అయితే ఈ నిబంధనలన్నింటినీ పక్కనపెట్టి ఆందోళనకారులు సోమవారం విజయవాడలోని దుర్గమ్మ గుడి దర్శనానికంటూ ర్యాలీగా బయల్దేరారు. ఓవైపు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పాదయాత్రగా ఆందోళనకారులు విజయవాడకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజీ, మందడం, రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ అనుమతులు లేవని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు విజయవాడకు బయల్దేరతామని పట్టుబట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తమను అడ్డుకున్నారని తుళ్లూరు మండలం వెలగపూడిలోని సచివాలయం ముట్టడికి యత్నించారు. మల్కాపురం జంక్షన్ వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. పలువురు పోలీస్ సిబ్బందిని పిడిగుద్దులు గుద్దడం, గోళ్లతో రక్కడం చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగ్బంధానికి యత్నం దుర్గ గుడి దర్శనం పేరిట ఆందోళనకారులందరూ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని బ్యారేజీని దిగ్బంధించాలని ప్రణాళిక రచించుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని నిఘా వర్గాలు ఆదివారమే గుర్తించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామునే ఎక్కడికక్కడ బారికేడ్లు, పికెట్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారుల ముసుగులో టీడీపీ నేతలే ఈ కుట్రలకు తెరలేపినట్టు విమర్శలొస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ముందస్తు అనుమతులు లేకుండా ఆందోళనకారులు ర్యాలీలకు దిగడం చూస్తుంటే బుధవారం జరిగే ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించేలా కుట్రలు పన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
విశాఖ రోడ్‌షోలో చంద్రబాబు విచిత్రమైన పిలుపు
సాక్షి, అమరావతి: ‘‘ప్రజలు బరితెగించాలి’’ విశాఖలో రోడ్‌షో సందర్భంగా శనివారంనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు ఇదీ.. ముందురోజు కూడా చంద్రబాబు ఇదేతీరులో ‘‘ఏం పీకుతావ్.. గడ్డిపీకుతావా.. నీ అబ్బ జాగీరా..’’ అంటూ తిట్ల వర్షం కురిపించారు. విశాఖలో మాత్రమే కాదు గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఇలానే అదుపు తప్పి మాట్లాడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఒకవైపు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ పరాజయం తప్పదన్న వాస్తవం మరోవైపు చంద్రబాబులో తీవ్ర అసహనానికి కారణమయ్యాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పరాజయాల పరంపర ఆ పార్టీని కుదిపేస్తోందని వారు పేర్కొంటున్నారు.. చంద్రబాబు మాత్రమే కాదు శనివారం విజయవాడలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కూడా ఇలానే అదుపు తప్పి మాట్లాడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ‘‘చంద్రబాబు రోడ్ షోలో కేశినేని పాల్గొంటే మేం పాల్గొనం.. మాకు ఏ గొట్టం గాడూ అధిష్టానం కాదు’’ అంటూ వారు నిప్పులు చెరిగారు. విజయవాడలో టీడీపీ నేతల వర్గపోరుగా ఇది కనిపించినా అధినాయకత్వంపై ద్వితీయ శ్రేణి నాయకులు ఎంత చులకనభావంతో ఉన్నారో ఈ వ్యాఖ్యలు రుజువు చేశాయని పరిశీలకులంటున్నారు. పైకి ఎంపీ కేశినేని నానిపై ఆగ్రహించినట్లు కనిపించినా కేశినేనికి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారన్న దుగ్థ వారి వ్యాఖ్యలలో కనిపిస్తోందని జనం చర్చించుకుంటున్నారు. ఇక చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోమారు తనదైన శైలిలో రెచ్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక ఫొటోగ్రాఫర్‌పై బాలకృష్ణ చేయిచేసుకోవడం చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. నా అనుమతి లేకుండా వీడియో తీస్తావా అని బాలకృష్ణ ఆ ఫొటోగ్రాఫర్ చెంప ఛెళ్లుమనిపించారు. బాలయ్య కోపాన్ని చూసి అక్కడున్న టీడీపీ శ్రేణులు కూడా హడలెత్తిపోయారు. హిందూపురంలో మూడురోజులుగా రోడ్‌షో నిర్వహిస్తున్న బాలకృష్ణ తొలిరోజు అక్కడి టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్‌షోకు జనం నుంచి స్పందన లేకపోవడం వల్లే ఆయన అలా కోపగిస్తున్నారని టీడీపీ నాయకులంటున్నారు. జనం రాకపోతే మేమేం చేయగలం అని వారు చర్చించుకుంటున్నారు.. గెలిచే పరిస్థితులు ఏమాత్రం కనిపించక, ఓటమి భయంతో అధినేత నుంచి స్థానిక నాయకుల వరకూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తుండడం విశేషం.. అధినేత ఎందుకిలా... ‘ఏం పీకుతావ్.. గడ్డి పీకావా, నువ్వు పోటుగాడివా.., నీ అబ్బ జాగీరా, సీఎం ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తున్నాడు, రేపు మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు.. మీరెవరూ ఇళ్లలో నుంచి బయటకు రారా, మీరు ఇంట్లో కూర్చుంటే, మీకోసం మేం పోరాడాలా, మీకు బాధ్యత లేదా’ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలివి. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని రోజూ చెప్పే టీడీపీ అధ్యక్షుడు ఇలా పూర్తిస్థాయిలో సంయమనం కోల్పోవడం విచిత్రమేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తన స్థాయిని మరచిపోయి దుర్భాషలాడడం ఆయనకు నిత్యకృత్యంగా మారిందంటున్నారు. ఎంత అసహనం, అభద్రత లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఊహించుకోవచ్చని చాలాకాలం నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్న వారు అభిప్రాయపడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అనే పదానికి చంద్రబాబు ప్రస్తుతం తరచూ మాట్లాడుతున్న మాటలే ఉదాహరణలని, ఏమాత్రం సంయమనం లేకుండా, పూర్తిగా బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారని సొంత పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు. ఒక్కోసారి ఆయన ఏంమాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని విధంగా పరిస్థితి ఉంటోందని చెబుతున్నారు. వరుస ఓటముల ప్రభావమే.. తనకు ఎదురే లేదనుకున్న కుప్పంలో ఓడిపోవడం.. సొంత జిల్లా చిత్తూరుపై పూర్తిగా పట్టు కోల్పోవడం.. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా దారుణ పరాజయాలు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ వ్యతిరేక గాలి స్పష్టంగా కనబడుతుండడంతో చంద్రబాబు పార్టీ భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రచార సభలు, మీడియా సమావేశాల్లో అస్సలు కంట్రోల్ లేకుండా ఇష్టానుసారం తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారని చెబుతున్నారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ఓటమి ఆయనపై తీవ్రంగా ఉందని చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఏమాత్రం ఊహించని విధంగా ఎదురైన ఈ ఓటమి ఆయన్ను కుంగదీసిందని, పార్టీ శ్రేణులు, నాయకులు కూడా దీనిపై ఆందోళన చెందడంతో ఆయన ఇంకా ఆవేదన చెందుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు ప్రచారంలో ‘రాష్ట్రం కోసం మీరెవరూ రారా, మీరు ఇంట్లో కూర్చుంటే, మీకోసం మేం పోరాడాలా, మీకు బాధ్యత లేదా’ అని ప్రజలపైనే విరుచుకుపడడంతో పక్కనున్న టీడీపీ సీనియర్ నేతలు బెంబేలెత్తిపోయినట్లు సమాచారం. తనను తిరుపతి ఎయిర్‌పోర్టులో నిర్బంధిస్తే ఒక్కరు రాలేదని, రాష్ట్రం కోసం తానొక్కడినే పోరాడాలా అంటూ ఏవేవో సంబంధం లేని మాటలు మాట్లాడడంతో టీడీపీ నాయకులు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ గడిపినట్లు చెబుతున్నారు. పోలీసులపైనా శృతి మించిపోయి విమర్శలు చేస్తుండంపై పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెజవాడలో నేతల తిట్ల పోటీ మరోవైపు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడం కష్టమని అంచనాకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటమికి ముందే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వీధిన పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేశినేని నాని పై నుంచి కింది వరకు తానే అధిష్టానం అంటున్నాడని, అతన్ని చెప్పు తీసుకుని కొట్టేవాడినని పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తిట్టడం పార్టీలో అసహనం ఏ స్థాయికి చేరిందో సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని, పార్లమెంటు అంతా తిరుగుతానని వెంకన్న ప్రకటించుకోవడంతో పార్టీ నాయకులకు ఏం జరుగుతుందో అర్థం కావడంలేదంటున్నారు. కేశినేని నానికి నిజంగా సత్తా, గ్లామర్ ఉంటే రాజీనామా చేయాలని, ఇండిపెండెంటుగా గెలవాలని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సవాల్ విసరడంతో పార్టీ నాయకులపై చంద్రబాబుకు కంట్రోల్ లేదని తేటతెల్లమైందని చెబుతున్నారు. కేశినేని కుల అహంకారంతో మాట్లాడుతున్నాడని, వాళ్ల చెప్పులు ఇంకెన్నాళ్లు మోస్తామని విజయవాడలో ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీ నాయకుడిగా ఉన్న నాగుల్ మీరా వంటి నాయకులు తీవ్ర ఆవేదనతో రోడ్డెక్కడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. -
మున్సిపోల్స్‌పై ఖాకీల డేగకన్ను..
సాక్షి, విజయవాడ: ఈనెల 10న జరుగనున్న మున్సిపల్ ఎన్నికలపై విజయవాడ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. సిటీ పోలీస్ కమీషనరేట్ పరిధిలో కీలకమైన విజయవాడ కార్పొరేషన్, ఉయ్యూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీపీ బత్తిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు. సీపీ నిత్య పర్యటనలతో సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో మొత్తం 3,200 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నట్లు సీపీ తెలపారు. ఎన్నికల విధుల్లో 67 మొబైల్, 27 స్ట్రైకింగ్, 12 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగిన 1900 మందిని 110 సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. ఈనెల 8వ తేదీ నుండి పోలింగ్ కేంద్రాలను అధీనంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
సింగపూర్ రోడ్లలా మారిపోవాలి: సీఎం
సాక్షి, అమరావతి/విజయవాడ: విజయవాడ రోడ్లను సింగపూర్ రహదారుల్లా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని, తాను మళ్లీ తనిఖీకి వచ్చే సమయానికి రోడ్లపై ఎక్కడా గుంతలు కనపడకూడదని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శనివారం విజయవాడ నగరంలో తనిఖీలు నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చుట్టుపక్కల ఉన్న 45 గ్రామాలను విజయవాడ కార్పొరేషన్లో విలీనం చేయాలని, ఇందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొండల మీద, కాలువల పక్కన నివసిస్తున్న 50 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వడంతో పాటు 16 వేల మంది లబ్ధిదారులకు వాంబే కాలనీలో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపట్టిన సంస్థపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడలో లైట్ మెట్రో రైలుకు త్వరలో శ్రీకారం చుడతామని చెప్పారు. జక్కంపూడిని ఎకనమిక్ సిటీగా మార్చుతామన్నారు. బుడమేరుతో పాటు మూడు కాల్వలను అనుసంధానం చేయడం ద్వారా జల రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెస్తామన్నారు. -
ఉప ఎన్నికలకు మోగిన నగారా
గుడివాడ : జిల్లాలోని గుడి వాడ, పెడన మున్సిపాలిటీలు, విజయవాడ కార్పొరేషన్లో ఒక డివిజన్లో కార్పొరేటర్ స్థానానికి ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహిం చేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గుడివాడ 19వ వార్డు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మునిసిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 19వ వార్డు కౌన్సిలర్ గణపతి లక్ష్మ ణరావు మృతితో ఏర్పడిన ఖాళీ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ, ఏప్రిల్ 9న పోలింగ్, 11న ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. పెడన 20 వార్డుకు... పెడన: పెడన మున్సిపాలిటీలోని 20వ వార్డు ఉప ఎన్నిక ఏప్రిల్ 9న నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ గోపాలరావు తెలిపారు. ఈమేరకు గురువారం ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పట్టణంలోని 20 వార్డు కౌన్సిలర్ యర్రా శేషగిరిరావు 2015 జూన్‌లో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడిందని తెలిపారు. 11వ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి... విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్లో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. 2014 ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ అనారోగ్యతో 2015లో మృతి చెందారు. దీంతో ఆ డివిజన్లో ఖాళీ ఏర్పడింది. తాజాగా ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 9 వ తేదీ పోలింగ్ జరుగుతుందని, 11న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, గుడివాడ డివిజన్ పంచాయతీ అధికారి విక్టర్ తెలిపారు. -
అటకెక్కిన రూ.20 కోట్లు..!
విజయవాడ కార్పొరేషన్లో వృథాగా ఆస్తిపన్ను ‘డీడీ’లు పుష్కర పనుల బిజీ పేరిట బ్యాంకులో జమ చేయని సిబ్బంది తిరిగి కొత్తవి తెచ్చివ్వాలంటూ అధికారుల సూచనలు మళ్లీ కమీషన్ ఎక్కడ చెల్లిస్తామంటూ నగరవాసుల మండిపాటు అసలే అప్పుల్లో ఉన్న విజయవాడ నగర పాలక సంస్థకు అధికారుల పనితీరు కారణంగా మరిన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తనున్నాయి. నగర పాలక సంస్థ ఖజానాకు అంతో ఇంతో భరోసాగా ఉంటూ వస్తున్న ఆస్తిపన్ను సొమ్ము..అధికారుల అలసత్వంతో ఖజానాకు చేరకుండా పోయింది. సాక్షి, అమరావతి బ్యూరో: నగర వ్యాప్తంగా 59 డివిజన్ల పరిధిలో పుష్కరాలకు ముందు ప్రజల నుంచి వసూలు చేసిన ఆస్తిపన్ను డీడీలను సకాలంలో బ్యాంకులో జమ చేయలేదు. వాటి కాలపరిమితి ముగిసి అవి ఎటూ కాకుండా పోవడంతో అధికారులు ఇప్పుడు తప్పును దిద్దుకునే పనిలో పడ్డారు. తాజాగా మళ్లీ కొత్త డీడీలను తెచ్చి ఇవ్వాలంటూ ఆయా యజమానులకు సూచిస్తున్నారు. మళ్లీ డీడీలు తీస్తే కమీషన్ వృథా అవుతుంది కదా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని 59 డివిజన్లలో 1.89 లక్షల కట్టడాలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి ఆస్తిపన్ను రూపంలో సుమారు రూ. 86 కోట్లు వసూలు అవుతుంది. ఏటా జూన్, మార్చి చివరాఖరి సమయాల్లో ఎక్కువగా వీటిని ప్రజలు చెల్లిస్తుంటారు. ఈ నేపథ్యంలో గత ఏడాది జూన్‌కు ముందు ఆస్తిపన్ను చెల్లిస్తూ వేలాది మంది బ్యాంకుల్లో డీడీలు తీసి సర్కిల్ కార్యాలయాల్లోని కార్పొరేషన్ అధికారులకు అందజేశారు. ఇలా డీడీల రూపంలో కార్పొరేషన్‌కు అందజేసిన మొత్తం రూ. 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలా వచ్చిన డీడీలన్నీ ఇప్పుడు సర్కిల్ కార్యాలయాల్లో పడి ఉన్నాయి. తీరిగ్గా కళ్లు తెరిచిన అధికారులు ఇప్పుడు వాటికి కాలం చెల్లిందని తెలిసి హడావుడి చేయడం మొదలెట్టారు. పుష్కరాల బిజీ పేరిట ... ఇప్పటికే ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన రూ. కోట్ల ఆస్తిపన్ను సొమ్ము బకాయిలు కార్పొరేషన్‌కు గుదిబండగా మారాయి. వసూలవుతున్న అరకొర సొమ్మును సైతం అధికారులు ఖజానాకు జమచేయకపోవడంతో కార్పొరేషన్ నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడంలో కార్పొరేషన్ కీలక పాత్ర వహించింది. అయితే దీనిని సాకుగా చూపెట్టిన అధికారులు ఆస్తిపన్ను డీడీలను బ్యాంకులో జమ చేయడంలో అలసత్వం ప్రదర్శించారు. దీంతో ఖజానాకు జమ కావాల్సిన రూ. కోట్ల డీడీలు అటకెక్కాయి. ఇప్పుడు వాటిని జమ చేయడానికి అధికారులు సిద్ధమవ్వగా.. చాలా డీడీలకు కాలపరిమితి చెల్లిందని సిబ్బంది పేర్కొనడంతో.. చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమవడం గమనార్హం. తాజాగా మళ్లీ ఆయా యజమానుల నుంచి కొత్త డీడీలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే డీడీలు కట్టి వాటికి కమీషన్లు చెల్లించామని.. మళ్లీ కొత్తగా డీడీలు తీసి ఇవ్వడమంటే మరోసారి అదనంగా కమీషన్ చెల్లించాల్సి వస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే కాబోలు..! -
ఫెస్టివల్ పెట్టి,మాపై బాదుడేంటి?