వీటీపీఎస్‌లోని 7 యూనిట్లలో నిలిచిన విద్యుత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 5వ రోజుకు చేరింది. దాంతో వీటీపీఎస్‌లో 7 యూనిట్లలో విద్యుత్ పూర్తిగా అగిపోయింది.1760 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సీమాంధ్ర ఉద్యోగులకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. దాంతో సీమాంధ్ర ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే అంధకారం అలుముకున్న సంగతి తెలిసిందే.