వినోదం... సందేశం!
విజయ్‌భరత్, అశ్విని, కాంచన ముఖ్య తారలుగా ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్ పతాకంపై పొట్నూరు శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నా మనసుకేమైంది, వాడే కావాలి, వేచి ఉంటా చిత్రాల దర్శకుడు వై.ఎ.శ్రీరామ్మూర్తి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. వినోదమే ప్రధానంగా ఈ చిత్రం నిర్మిస్తున్నామని, కథానుసారం బ్యాంకాక్‌లో 30 రోజులు షూటింగ్ చేయనున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సహకారం: ప్రదీప్‌కుమార్ సింగ్.