Vikaruddin gang
-
నల్గొండ పోలీసులను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మరోసారి హై అలర్ట్ ప్రకటించారు. వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులే లక్ష్యంగా దాడులు జరగొచ్చనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులను ఉగ్రవాదులు టార్గెట్ చేయటంతో పాటు, జిల్లాలోని పోలీస్ స్టేషన్లపై దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభిస్తున్నారు. మరోవైపు జిల్లా పోలీసులకు సెలవులు రద్దు చేశారు. -
వికార్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై సిట్
ప్రత్యేక బృందంతో దర్యాప్తునకు కేసీఆర్ నిర్ణయం వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ విషయంలో కీలక మలుపు. ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉత్తర్వులను సోమవారం జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఎన్కౌంటర్ ఘటనపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని సీఎం నిర్ణయించారు. సాక్షి, హైదరాబాద్: వరంగల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌం టర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీ చేయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. వికారుద్దీన్ సహా 5 గురు విచారణ ఖైదీల మరణానికి కారణమైన ఈ ఘటనపై కొందరు నేతలు, సంస్థలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని సీఎం నిర్ణయించారు. ఉగ్రవాదులను ఈ నెల 7న వరంగల్ జైలు నుంచి హైదరాబాద్‌లోని కోర్టుకు తరలిస్తుండగా నల్లగొండ జిల్లా ఆలేర్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. మూత్ర విసర్జన పేరుతో వాహనాన్ని నిలిపేలా చేసిన వికారుద్దీన్ గ్యాంగ్ పథకం ప్రకారం ఎస్కార్టు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులకు యత్నించగా..ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో వికార్ ముఠా హతమైందని పోలీసులు చెప్తున్నారు. అయితే, దీనిపై పౌరహక్కుల సంఘాలతోపాటు ఎంఐఎం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం పెద్దలు ఇటీవల సీఎంను కలిసి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటుకు సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. డీఐజీ, ఐజీ అధికారి స్థాయిలో ఈ దర్యాప్తు జరిగే అవకాశముంది. -
వికార్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తుకు ఆదేశం
వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఏప్రిల్ 7న వరంగల్- నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో సిమి ఉగ్రవాది వికారుద్దీన్ సహా మరో ఐదుగురు చనిపోయారు. అయితే అది బూటకపు ఎన్కౌంటర్ అని, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వికార్, అతడి అనుచరుల్ని కాల్చిచంపారని పలు సంస్థలు, వ్యక్తులు అనేక అనుమానాలు వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలోనే ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. -
ముగిసింది
♦ ఇజార్‌ఖాన్ మృతదేహం బంధువులకు అప్పగింత ♦ హైదరాబాద్ నుంచి విమానంలో లక్నోకు తరలింపు ♦ 46 గంటలపాటు పోలీసుల నిఘాలో ఎంజీఎం ఆస్పత్రి ♦ ఊపిరి పీల్చుకున్న పోలీసు యంత్రాంగం ♦ ఇది బూటకపు ఎన్కౌంటర్ : న్యాయవాది సయ్యద్ అలీఖాన్ ఎంజీఎం : వరంగల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో మంగళవారం ఉదయం జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ ప్రక్రియ ముగిసింది. బుధవారం నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లగా.. గురువారం రాత్రి 9.52 గంటలకు ఇజార్‌ఖాన్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని తీసుకుంటూ అంగీకారపత్రంపై ఇజార్‌ఖాన్ సోదరుడు తన్వీర్ అహ్మద్ ఖాన్, బంధువులు సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీపంలో గల అమీనాబాద్ నుంచి వచ్చిన వెంటనే అడ్వొకేట్ల సమక్షంలో మృతదేహాన్ని అప్పగించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 46 గంటలపాటు ఎంజీఎం ఆస్పత్రి పోలీసుల ఆధీనంలోనే ఉంది. పోలీసులు డేగకళ్లతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. పక్కా ప్రణాళికతో పోలీసులు ముందుకు సాగారు. కాగా, ఇజార్‌ఖాన్ న్యాయవాది సయ్యద్ అలీఖాన్ మాట్లాడుతూ.. ఇవి పోలీసుల హత్యలని, న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేకమైన కాఫిన్ బాక్స్‌లో మృతదేహం తరలింపు ఇజార్ ఖాన్ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన కాఫిన్ బాక్స్‌లో లక్నోకు తరలించారు. గురువారం రాత్రి అంబులెన్స్ ద్వారా బయలుదేరిన ఇజార్ ఖాన్ మృతదేహం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించి లక్నోకు వెళ్లనున్నారు. అయితే కాఫిన్ బాక్స్‌లో మృతదేహాన్ని తరలించడం వల్ల ఎయిర్‌పోర్టులో పోలీసులు స్కాన్ చేసిన సందర్భంలో బాక్స్ తెరవాల్సిన అవసరం ఉండదని పేర్కొంటున్నారు. విమానం ముందు జరిగే స్కానింగ్ పరీక్షలకు కాఫిన్ బాక్స్ అణువుగా ఉంటుంది. -
11-11-2011న ఘటన
జనగామ : వికారుద్దీన్ గ్యాంగ్ 11-11-2011న జనగామ మండలం పెంబర్తి శివారులో బిర్యానీ కావాలంటూ గొడవ చేయగా స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. 2012లో ఈ ఐదుగురు సభ్యులను కోర్టులో హాజరు పరిచారు. గత నెల 20న జనగామ కోర్టుకు వికారుద్దీన్‌ను హాజరుపరిచి తీసుకెళ్లారు. ఈనెల 2న మళ్లీ జనగామ కోర్టులో హాజరు పరచాల్సి ఉండగా.. హైదరాబాద్ 7వ మెట్రోపాలిటన్ కోర్టులో గత పదిరోజులగా హాజరవుతున్నందున ఇక్కడకు రానట్లు తెలుస్తోంది, ఇదే క్రమంలో వారు ఎన్కౌంటర్లో మృతి చెందారు. -
గొడవపడిన సమీపంలోనే..
పెనుగులాటలో ఆర్ఎస్ఐ చేతికి గాయాలు సంఘటనా స్థలిని సందర్శించి ఐజీ, డీఐజీ జనగామ : జిల్లా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్ సహా పలు పేలుళ్ల నిందితుడు వికారుద్దీన్ ముఠా హతమైంది. వికారుద్దీన్‌తో పాటు మరో నలుగురు మృతి చెందారు. జిల్లా సరిహద్దు పెంబర్తి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో నల్గొండ జిల్లా పరిధిలో మంగళవారం ఉదయం 10. 20 గంటలకు ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. 11-11- 2011న బిర్యానీ కావాలని గలాటాకు దిగిన ప్రాంతం సమీపంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా జిల్లా ఉలిక్కిపడింది. నల్లొండ జిల్లా సూర్యాపేట, జానకీపురం ఘటనలను మరువక ముందే ఈ ఉగ్రవాద ఎన్కౌంటర్ కలకలం రేపింది. ఎన్కౌంటర్ జరిగిందిలా.. వరంగల్ కే ంద్ర కారాగారం నుంచి ఉదయం 8.30 గంటలకు వికారుద్దీన్‌తో సహా సయ్యద్ అమ్జద్అలీ అలియాస్ సులేమాన్(28), మహ్మద్ జకీర్(32), ఇజహర్ఖాన్(35), మహ్మద్ హనీఫ్(40)లనుహైదరాబాద్ 7వ మెట్రో పాలిటన్ కోర్టుకు తరలిస్తున్నారు. పది రోజులుగా వివిధ కేసుల్లో విచారణ నిమిత్తం వారిని కోర్టుకు తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మంగళవారం ఉదయం ప్రత్యేక బస్సులో ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ మరో 16 మంది కానిస్టేబుళ్లు ఎస్కార్ట్‌గా హైదరాబాద్ బయల్దేరారు. పోలీసులను రెచ్చగొట్టడంలో దిట్టగా పేరొందిన వికారుద్దీన్ తన వికృత చేష్టలను ఖాజీపేట దాటగానే మొదలు పెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసుల కుటుంబసభ్యులను, పోలీసులను కించపరిచేలా మాట్లాడినట్లు సమాచారం. బస్సు ఉదయం 10.20 నిమిషాలకు వరంగల్ జిల్లా సరిహద్దు దాటింది. మూత్ర విసర్జనకు బస్సు ఆపారు. ఇదే సమయంలో వికారుద్దీన్ పోలీసులపై దూషణలకు దిగగా, పోలీసు లు వారించే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. వికారుద్దీన్ గన్ను లాక్కునే ప్రయత్నం చేయగా ఆత్మరక్షణ కోసం తమ పోలీసులు కాల్పులు జరుపగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్ చంద్ విలేకరులకు తెలిపారు. ఆద్యంతం హైడ్రామా ఎన్కౌంటర్ ఘటన ఆద్యంతం హైడ్రామాలా సాగింది. కవరేజ్ కోసం వెళ్లిన మీడియాపై పోలీసులు తీవ్ర ఆంక్షలు పెట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి, ఎస్సీ అంబర్ కిశోర్‌ఝా, నల్గొండ ఎస్పీ విక్రం సింగ్ దుగ్గల్‌లు ఎన్కౌంటర్ తీరును పరిశీలించారు. మృత దేహాలను మధ్యాహ్నం 12.45 గంటలకు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అండర్ ట్రయల్‌లో ఉన్న ఉగ్రవాదులు కావడంతో జడ్జి పర్యవేక్షణలోనే పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి మూడు గంటల ప్రాంతంలో ఆస్పత్రికి వచ్చారు. పలుమార్లు సమాలోచనలు ఉగ్రవాదుల వ్యవహారం కావడంతో అధికారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నారు. జడ్జి తిరుపతితో కలిసి పోలీసులు ఆస్పత్రిలో సమావేశమై సంఘటనా వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇక్కడే పోస్టుమార్టం నిర్వాహిస్తారని అధికారులు భావించగా చివరకు నిర్ణయం మారింది. మృతదేహాలను తరలించకుండా 5.30 గంటలకు శవపంచనామా ప్రారంభించారు. వరంగల్ నుంచి వచ్చిన వైద్య బృందం, ఫోరెన్సిక్ బృందం సభ్యులు జడ్జి తిరుపతి సమక్షంలో ఒక్కో మృత దేహాన్ని కిందకు దింపి రాత్రి 8 గంటల వరకు పంచనామా చేశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య వరంగల్ ఎంజీఎంకు మృత దేహాలను తరలించారు.బుధవారం ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌తో జిల్లా ఉలిక్కిపడింది. ఎన్కౌంటర్ మృతులను చూసేందుకు జనం ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు.