వికార్ గ్యాంగ్ ఎన్కౌంటర్పై దర్యాప్తుకు ఆదేశం | telangana government orderd to enquire vikaruddin and gang's encounter | Sakshi
Sakshi News home page

వికార్ గ్యాంగ్ ఎన్కౌంటర్పై దర్యాప్తుకు ఆదేశం

Published Sun, Apr 12 2015 6:40 PM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

వికార్ గ్యాంగ్ ఎన్కౌంటర్పై దర్యాప్తుకు ఆదేశం

వికార్ గ్యాంగ్ ఎన్కౌంటర్పై దర్యాప్తుకు ఆదేశం

వికారుద్దీన్ గ్యాంగ్  ఎన్కౌంటర్పై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

ఏప్రిల్ 7న వరంగల్- నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో సిమి ఉగ్రవాది వికారుద్దీన్ సహా మరో ఐదుగురు చనిపోయారు. అయితే అది బూటకపు ఎన్కౌంటర్ అని, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వికార్, అతడి అనుచరుల్ని కాల్చిచంపారని పలు సంస్థలు, వ్యక్తులు అనేక అనుమానాలు వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలోనే ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement