హైదరాబాద్: దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో చంపేసిన ఘటనపై కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ఈ ఎన్‌కౌంటర్‌ను తప్పుబడుతున్నారు. తాజాగా ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ ఈ సంఘటనపై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేను వ్యక్తిగత ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌పై మెజిస్ట్రియల్ విచారణ జరగనుంది. ఇదంతా పోలీసుల పర్యవేక్షణలో ఉండగానే జరిగింది. ఎంపీలంతా కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అజ్మల్ కసబ్ లాంటి వ్యక్తుల కేసులు వాయిదాపడుతూ ఉన్నాయి. ఈ కేసులో ఎందుకు అలా జరగలేదని ఆయన ప్రశ్నించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌పై వివరణ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment