పాడేరు: కొయ్యూరు మండలం పుట్టకోట అటవీ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 21న పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మతి చెందిన ఘటనపై ఈనెల 29న మెజిస్టీరియల్ విచారణ నిర్వహిస్తున్నట్టు పాడేరు సబ్ కలెక్టర్ ఎల్.శివ శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి విషయాలు తెలిసిన వ్యక్తులు పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని కోరారు.
29న వనం .. మనం
మిషన్ హరితాంధ్ర ప్రదేశ్‌లో భాగంగా ఈ నెల 29న మన్యంలో పెద్ద ఎత్తున ‘వనం.. మనం’ కార్యక్రమంలో మొక్కలు నాటాలని ఐటీడీఏ ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి ఎల్.శివ శంకర్ సూచించారు. బుధవారం మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏజెన్సీలో నాటడానికి 3 లక్షల మొక్కలను అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందుకు జీవో ప్రకారం మండలస్థాయిలో ఎంపీపీ, పంచాయతీస్థాయిలో సర్పంచ్‌ల నేతత్వంలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో కుమార్, డీఎఫ్‌వో రాజు, గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎం.కమల, వెలుగు ఏపీడీ రత్నాకర్ పాల్గొన్నారు.
పుట్టకోట ఎన్‌కౌంటర్‌పై 29న విచారణ
Published Thu, Jul 28 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
Advertisement