'ఎన్‌కౌంటర్లపై విచారణ చేయండి' | suravaram Demand on encounters | Sakshi
Sakshi News home page

'ఎన్‌కౌంటర్లపై విచారణ చేయండి'

Published Wed, Apr 8 2015 7:54 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

suravaram Demand on encounters

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో పోలీసులు 20 మంది కూలీలను కాల్చి చంపడం, తెలంగాణలో విచారణను ఎదుర్కొంటున్న అయిదుగురు ఖైదీల ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇరవైమంది కూలీలను కాల్చిచంపడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతవరకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి కీలకమైన స్మగ్లర్‌ను అరెస్ట్ చేయకపోగా కూలీలను మాత్రం కాల్చి చంపారన్నారు.

ఈ స్మగ్లర్లకు సహాయపడడంలో అధికార పార్టీ నాయకులకు సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. ఉగ్రవాదుల చేతుల్లో పోలీసులు హతమైనందున ప్రతీకార హత్యలుగానే ఐఎస్‌ఐ ఉగ్రవాదులను చంపినట్లు కనిపిస్తోందన్నారు. ఉగ్రవాద ఆరోపణలతో విచారణను ఎదుర్కొంటున్న ఈ ఖైదీల మరణానికి దారితీసిన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట ఘటనలో తప్పించుకున్నట్లుగా చెబుతున్న ఉగ్రవాదిని అరెస్ట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో ప్రాణాలు త్యాగం చేసిన ఎస్‌ఐ సిద్ధయ్య, ఇతర పోలీసుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement