Village head
-
దళిత యువకుడికి ఘోర అవమానం.. పరారీలో మాజీ సర్పంచ్!
లక్నో: ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. అందరి ముందు యువకుడిపై గ్రామ సర్పంచ్ చెప్పుతో దాడి చేసి, చంపేస్తామని బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై దాడి నేపథ్యంలో భీమ్ ఆర్మీ కార్యకర్తలు ఛాపర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. దినేష్ కుమార్(27) అనే దళిత యువకుడిపై.. తాజ్పుర్ గ్రామ సర్పంచ్ శక్తి మోహన్ గుర్జార్, రేటా నగ్లా గ్రామ మాజీ సర్పంచ్ గాజే సింగ్‌లు దాడి చేశారు. చెప్పుతో కొడుతూ చంపేస్తామని యువకుడిని బెదిరించారు. వీడియోలు తీసి ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. భారతీయ శిక్షా స్మృతి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు నగర ఎస్పీ అర్పిత్ విజయ్‌వర్గియా తెలిపారు. గ్రామ సర్పంచ్ శక్తి మోహన్‌ను అరెస్ట్ చేశామని, రెండో వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. In UP's Muzaffarnagar, a village head and his people thrashed a SC youth with slippers in public and threatened him with death while abusing caste slurs. They also recorded the incident and made it viral to humiliate the SC people. pic.twitter.com/MeiPTfo9KF — Mission Ambedkar (@MissionAmbedkar) August 20, 2022 ఇదీ చదవండి: Viral Video: గేదె ముందు యువతి కుంగ్‌ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో.. -
స్థల వివాదంలో కుటుంబ బహిష్కరణ!
సాక్షి,పెదపూడి: మండలంలోని పైన గ్రామంలో ఓ కుటుంబంపై సాంఘిక బహిష్కరణ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉలిసే సుబ్బారావు, అతని కొడుకు సాయిరామ్, కుమార్తె, భార్య నివసిస్తున్నారు. బాధితుడు సుబ్బారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో రామాలయం సమీపంలో తమ నివాస గృహం ఎదురుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ పెద్దలు సిమెంటు రోడ్డు నిర్మించారు. అ రోడ్డు నిర్మాణ విషయంలో సుబ్బారావు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.అయినా సరే స్థానిక పంచాయతీ పెద్దలు కొంత మంది రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఈ విషయంపై బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆగ్రహించిన గ్రామంలో కొంతమంది పెద్దలు బహిష్కరణ వేటు వేశారు. గ్రామ మాజీ సర్పంచి మట్టపర్తి వీరభద్రరావు, తదితరులు తమపై కావాలనే ఇలా బహిష్కరణ చేసినట్లు ఆ కుటుంబ సభ్యులు ఆరోపించారు. గ్రామంలో ఏ వస్తువు కొనాలని వెళ్లినా, తమకు సహకరించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి వెళితే ‘మీకు అమ్మకాలు జరపబోమని’ విక్రయదారులు చెబుతున్నారని ఆయన వివరించారు. ఒకవేళ పంచాయతీ పెద్దలను కాదని వస్తువులను అమ్మితే రూ.6 వేలు జరిమానా విధిస్తారని పెద్దలు విక్రయదారులకు హెచ్చరించారంటూ బాధితుడు వివరించారు. ఈ బహిష్కరణ విషయమై గతంలో పెదపూడి పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. బహిష్కరించలేదు ఉలిసే సుబ్బారావు కుటుంబాన్ని బహిష్కరించలేదు. రామాలయం వద్ద దేవుని కార్యక్రమాలు చేయడానికి ఆ ప్రాంతంలో గ్రామ పెద్దల అందరి సమక్షంలో సీసీరోడ్డు నిబంధనల ప్రకారం చేపట్టాం. ఎలాంటి ఆక్రమణాలు చేయలేదు. – మట్టపర్తి వీరభద్రం ,మాజీ సర్పంచి -
స్కూల్ లో బార్‌గర్ల్స్ తో చిందులు
వారాణాసి: పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే పాఠశాలలో పాడు పని చేశాడు ఓ గ్రామ పెద్ద. సాక్షాత్తు తరగతి గదిలోనే తప్పతాగి బార్ గర్స్ తో చిందులేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. జమల్పూర్ లోని టెట్రాహియా కాలా కర్ద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సోమవారం రాఖీపండగ సందర్భంగా సెలవు ప్రకటించారు. ఆ మరుసటిరోజు స్కూల్‌కి వచ్చిన టీచర్లు షాక్‌కి గురయ్యారు. ప్రాంగణం అంతా ఖాళీ మందు సీసాలు పడి ఉండటంతో స్థానికులను ఆరాతీయగా, అదంతా గ్రామాధికారి చేసిన నిర్వాకమని తేలింది. ఘటనపై అసిస్టెంట్ టీచర్ అశోక్‌కుమార్ విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తివారీకి ఫిర్యాదు చేయగా, ఆయన విచారణకు ఆదేశించారు. తన పుట్టినరోజు సందర్భంగా స్కూల్ లోనే పార్టీ ఇచ్చాడని, పైగా బార్ గర్ల్స్ తో చిందులు కూడా వేసినట్లు తేలింది. దీంతో రామ్కేష్ పై చర్యలు తీసుకోవాలని జిల్లామెజిస్ట్రేట్తోపాటు చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ను తివారీ కోరారు. తాను పార్టీ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే అందులో తాను పాల్గొనలేదని రామ్కేష్ చెబుతున్నారు. -
గ్రామపెద్ద కుటుంబం దారుణ హత్య
సంభల్: రాజకీయ కక్షతో ఓ గ్రామపెద్ద కుటుంబం మొత్తాన్ని దారుణంగా హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. చవాడ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో గ్రామపెద్ద శకుంతల(50) తో పాటు.. భర్త విశ్వాంబర్(55), కుమారులు సునిల్(30), సుశీల్(35)లు హత్యకు గురయ్యారు. వీరంతా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తుపాకులతో దాడి చేసిన 13 మంది దుండగులు.. అందరినీ హతమార్చారని ఎస్పీ భూషణ్ తెలిపారు. రాజకీయ కక్షతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మహేశ్, సురేష్, గోవిందాతో సహా 13 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు వెల్లడించారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. దుండగులు పరారీలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. -
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ గ్రామపెద్ద
ఫతేపూర్(ఉత్తరప్రదేశ్): మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు రోజు రోజుకూ శృతిమించుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అత్యాచారాల అడ్డాగా మారిపోయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. తాజాగా ఓ మైనర్ బాలికపై గ్రామపెద్ద అత్యాచారం చేసిన ఘటన చాంద్ పూర్ పరిధిలో మంగళవారం కలకలం సృష్టించింది. పశువుల్ని తీసుకుని పొలానికి వెళ్లిన పదకొండేళ్ల బాలికపై గ్రామపెద్ద అయిన అరవింద్ సింగ్, అతని సోదరుడుతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఆ ఇద్దరి నిందితుల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలింపు చేపట్టారు. -
కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ గ్రామపెద్ద
అందరికి ఆదర్శంగా నిలవాల్సిన గ్రామ పెద్దే నీతి తప్పి ప్రవర్తించాడు. గ్రామానికి చెందిన టీనేజీ యువతిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం కలగించింది. యూపీలోని చిత్బార్గన్ గ్రామానికి చెందిన టీనేజి బాలికను ఆ గ్రామ పెద్ద అశోక్ సహ్ని శుక్రవారం కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను బీహార్‌లోని బక్సార్ పట్టణంలోని హోటల్లో ఆ యువతిపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను జిల్లాలోని ఫెహ్న ప్రాంతంలో వదిలిపెట్టి అక్కడినుంచి పరారైయ్యాడు. ఆ యువతి ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడు అశోక్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేశారు. అందులోభాగంగా ఈ రోజు ఉదయం నిందితుడు అశోక్‌ను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ కేసీ గోస్వామి ఆదివారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో బదాయూ జిల్లాలోని కాట్రా గ్రామంలో ఇటీవల వరుసకు అక్కాచెల్లిళ్లని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.