కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ గ్రామపెద్ద | Village head held for rape | Sakshi
Sakshi News home page

కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ గ్రామపెద్ద

Published Sun, Jun 1 2014 12:30 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ గ్రామపెద్ద - Sakshi

కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ గ్రామపెద్ద

అందరికి ఆదర్శంగా నిలవాల్సిన గ్రామ పెద్దే నీతి తప్పి ప్రవర్తించాడు. గ్రామానికి చెందిన టీనేజీ యువతిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లో సంచలనం కలగించింది. యూపీలోని చిత్బార్గన్ గ్రామానికి చెందిన టీనేజి బాలికను ఆ గ్రామ పెద్ద అశోక్ సహ్ని శుక్రవారం కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను బీహార్లోని బక్సార్ పట్టణంలోని  హోటల్లో ఆ యువతిపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను జిల్లాలోని ఫెహ్న ప్రాంతంలో వదిలిపెట్టి అక్కడినుంచి పరారైయ్యాడు.

 

ఆ యువతి ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడు అశోక్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేశారు. అందులోభాగంగా ఈ రోజు ఉదయం నిందితుడు అశోక్ను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ కేసీ గోస్వామి ఆదివారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో బదాయూ జిల్లాలోని కాట్రా గ్రామంలో ఇటీవల వరుసకు అక్కాచెల్లిళ్లని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement