గ్రామపెద్ద కుటుంబం దారుణ హత్య
గ్రామపెద్ద కుటుంబం దారుణ హత్య
Published Thu, Nov 10 2016 12:03 PM | Last Updated on Mon, Sep 17 2018 5:56 PM
సంభల్: రాజకీయ కక్షతో ఓ గ్రామపెద్ద కుటుంబం మొత్తాన్ని దారుణంగా హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. చవాడ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో గ్రామపెద్ద శకుంతల(50) తో పాటు.. భర్త విశ్వాంబర్(55), కుమారులు సునిల్(30), సుశీల్(35)లు హత్యకు గురయ్యారు. వీరంతా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తుపాకులతో దాడి చేసిన 13 మంది దుండగులు.. అందరినీ హతమార్చారని ఎస్పీ భూషణ్ తెలిపారు.
రాజకీయ కక్షతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మహేశ్, సురేష్, గోవిందాతో సహా 13 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్లు వెల్లడించారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. దుండగులు పరారీలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement