village story
-
పల్లెకు పోదాం..
‘పల్లెకు పోదాం సినిమా చేద్దాం. ఛలో చలో’ అని పాడుకుంటున్నారు కొందరు హీరోలు. ఈ హీరోలతో వెండితెరపై పల్లె కథలను చూపించేందుకు రెడీ అవుతున్నారు దర్శకులు. ఈ పల్లెటూరి కథల్లోకి వెళదాం. 1990లో ఓ గ్రామం నాగార్జున కెరీర్లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చాలానే ఉన్నాయి. మరోసారి నాగార్జున ఓ విలేజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ నున్నారట. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఈ విలేజ్ స్టోరీని డెవలప్ చేశారు. అంతేకాదు... ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం కానున్నారని సమాచారం. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తారని తెలిసింది. 1990 నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ఆరంభం కానుంది. కేరాఫ్ స్టువర్టుపురం 1970లలో స్టువర్టుపురంలోని నాగేశ్వరరావు గురించి తెలియనివాళ్లు ఉండి ఉండరు. ఆయన జీవితంతో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం రూపొందింది. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్, నూపుర్ సనన్ నాయికలు. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఏ విధంగా గడిచింది? ఆయన్ను కొందరు దొంగ అని, మరి కొందరు పేదలకు హెల్ప్ చేసే ఆపద్భాందవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. పల్లెటూరి ఆటగాడు హీరో రామ్‌చరణ్ కెరీర్లో ‘రంగస్థలం’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ సూపర్బ్. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేసేందుకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ ఫిల్మ్ అని, ఇందులో అన్నతమ్ములుగా రామ్‌చరణ్ డ్యూయల్ రోల్ చేయనున్నారని భోగట్టా. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ఇదని సమాచారం. వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. భైరవకోన మిస్టరీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో చెలామణిలో ఉన్న గరుడ పురాణానికి, ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయట. ఆ గరుడ పురాణంలో మిస్ అయిన ఆ నాలుగు పేజీల కథే భైరవకోన అని హీరో సందీప్ కిషన్ అంటున్నారు. మరి.. ఆడియన్స్‌కు ఈ మిస్టరీ తెలియాలంటే థియేటర్స్‌కు రానున్న ‘ఊరిపేరు భైరవకోన’ సినిమా చూడాలి. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. రంగబలి రాజకీయం రంగబలి అనే విలేజ్‌లో జరిగే çఘటనలు, రాజకీయ కోణాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘రంగబలి’. నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. కుప్పంలో హరోంహర చిత్తూరు జిల్లా కుప్పంలో ‘హరోంహర’ అంటున్నారు సుధీర్‌బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. 1989 చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కథగా ‘హరోం హర’ సాగుతుంది. సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 22న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఆదికేశవ ఆగమనం రాయలసీమలోని ఓ గ్రామంలో ఉన్న దేవాలయంపై మైనింగ్ మాఫియా చూపు పడింది. ఈ మాఫియాకు అడ్డుగా నిలబడతాడు రుద్రకాళేశ్వర్ రెడ్డి. ఈ గ్రామాన్ని రుద్రకాళేశ్వర్ రెడ్డి ఏ విధంగా రక్షించాడు అనేది తెలుసుకోవాలంటే జూలైలో వచ్చే ‘ఆదికేశవ’ సినిమా చూడాలి. రుద్రకాళేశ్వర్ రెడ్డి పాత్రలో హీరోగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో ఎస్. నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్మగ్లింగ్ నేపథ్యంలో... కథ ప్రకారం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో జరుగుతున్న స్మగ్లింగ్‌ను అడ్డుకోవాలనుకుంటున్నారట విశ్వక్ సేన్. 1994 నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కాస్త గ్రే షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్లో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటన ఆధారంగా.... ‘గంగతలపై ఉన్నంత వరకే శివుడు చల్లగా ఉంటాడు. కంట్లోంచి గానీ జారిందా శివమెత్తుతాడు’ అనే పవర్ఫుల్ డైలాగ్ సాయిరామ్ శంకర్ నోట వచ్చింది ఓ సినిమా కోసం. విలేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రకాష్ జూరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రమణి జూరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తుండటం విశేషం. ఇలా విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలతో ప్రేక్షకులను అలరించేందుకు మరికొందరు హీరోలు రెడీ అవుతున్నారు. -
ఎన్నిలు ఎరుగని ఊరు!
అక్కడ పదవులన్నీ ఏకగ్రీవమే ఆదర్శ గ్రామంలో సమస్యల తిష్ట మౌలిక వసతులు కరువు ఐదు దశాబ్దాలుగా ఆ గ్రామ ప్రజలు ఎన్నికలు అంటే ఏమిటో... అవి ఎలా ఉంటాయో చూడలేదు! వారి వేలిపై ఎన్నికల సిరా చుక్క పడలేదు. ఈ విషయం విన్న తర్వాత ఆ గ్రామ రాజకీయాలపై ఆసక్తి లేదనుకుంటే మీరు పొరబడినట్లే!! వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఆ గ్రామంలో ఉన్నారు. అంతేకాదండోయ్.. ఆ గ్రామానికి ఓ సర్పంచ్, వార్డు సభ్యులు, ఎమ్పీటీసీ సభ్యుడు... ఇలా ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరంతా ఏకగ్రీవంగా గ్రామస్తుల ఆమోదంతో ఎంపికైన వారే. ఎన్నికల దుబారా ఖర్చును అరికట్టి ఆదర్శంగా నిలిచిన ఆ గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోతోంది. ధర్మవరం మండలంలోని వెంకట తిమ్మాపురం పంచాయతీ ఏర్పడి సుమారు 50 సంవత్సరాలు అవుతోంది. ఈ 50 ఏళ్లలో పంచాయతీ సర్పంచ్ పదవి కోసం ఏనాడూ ఎన్నికలు జరగలేదు. పార్టీలక అతీతంగా గ్రామస్తులంతా ఏకమై ఓ వ్యక్తిని సర్పంచ్‌గా ఎంపిక చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడేళ్ల క్రితం బాల అరుణమ్మను ఎంపిక చేశారు. పోటీ ఉత్పన్నమైతే రాజీ మార్గం గ్రామ సర్పంచ్ పదవి కోసం పోటీ ఉత్పన్నమైతే గ్రామస్తులు చర్చించుకుని ఓ అంగీకార ఒప్పందానికి వస్తారు. ఇలాంటి పరిస్థితి మూడేళ్ల క్రితం ఎదురైంది. అప్పట్లో సర్పంచ్ పదవి కోసం బాల అరుణమ్మ, నాగేంద్రమ్మ పోటీ పడ్డారు. దీంతో గ్రామస్తులు తొలి రెండున్నర సంవత్సరాలు బాల అరుణమ్మకు, మరో రెండున్నర సంవత్సరాలు నాగేంద్రమ్మ ఆ పదవిలో కొనసాగాలని తీర్మానించారు. ఈ అంగీకారంతో సర్పంచ్‌గా బాల అరుణమ్మ, ఉప సర్పంచ్‌గా నాగేంద్రమ్మ నియమితులయ్యారు. గ్రామ ప్రశాంతతకు టీడీపీ చెక్ రాజకీయ వర్గ కక్షలు ఎలా ఉంటాయో కూడా తెలియని వెంకట తిమ్మాపురంలో టీడీపీ చిచ్చు రగల్చింది. ఇందులో భాగంగానే పదవుల ఒప్పందాన్ని కాదంటూ బాల అరుణమ్మను టీడీపీలో చేర్చుకుని.. ఆమె పదవీ కాలం పూర్తి అయినా రాజీనామా చేయించకుండా అలాగే కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయంలో గ్రామపెద్దలు జోక్యం చేసుకున్నా.. టీడీపీ పెద్దలు కాదని ధిక్కరించారు. ఇటీవల ఆరు నెలల క్రితం బాల అరుణమ్మ ఆకస్మిక మృతి చెందారు. దీంతో ఆ పదవికి ఎన్నికలు చేపట్టేలా అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకెళ్లారు. గ్రామస్తుల మూకుమ్మడి ఎంపిక ప్రక్రియను కాదంటూ ఈ సారీ ప్రత్యక్ష ఎన్నికలకు పోతుండడంతో అధికారులు నూతన ఓటరు జాబితాను రూపొందించి, ఉన్నతాధికారులకు నివేదించారు. మౌలిక వసతులు కరువు పాలకుల ఉదాసీన వైఖరి.. అధికారుల అలసత్వం కారణంగా వెంకటతిమ్మాపురం గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఈ పంచాయతీలో వెంకటతిమ్మాపురం, మాలగుండ్లపల్లి గ్రామాలున్నాయి. పంచాయతీ సభ్యులుగా ఏకగ్రీవ ఎంపిక అయితే ఆ పంచాయతీకి నిధులు పుష్కలంగా వచ్చిపడతాయని, సమస్యలు తీరుతాయనుకున్న గ్రామస్తుల కల.. కలగానే మిగిలిపోయింది. నేటికీ ఈ పంచాయతీ పరిధిలోని ప్రజలు తాగునీటి కోసం నానా అగచాట్లు పడుతున్నారు. వీధి దీపాలు వెలగవు. గ్రామ వీధులు ముళ్ల పొదలతో విస్తరించి ఉన్నాయి. మురుగు కాల్వలు శుభ్రం చేయరు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాగిలాపడింది
నాడు 400 బోరు బావులు.. నేడు 40! నాడు 3,200 ఎకరాల్లో పంటల సాగు.. నేడు 200 ఎకరాలు!! ఇతంటి విపత్కర పరిస్థితిని రైతులు ఈ నాలుగు దశాబ్దాల్లో ఏనాడూ ఎదుర్కోలేదు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు వట్టిపోయాయి. పుడమి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. వ్యవసాయం తప్ప మరో పని చేతకాని బతుకులు ఛిద్రమవుతున్నాయి. గ్రామగ్రామానా ఇదే పరిస్థితి... స్పందించాల్సిన పాలకులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో పంట సాగు నానాటికీ పడిపోతోంది. రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల గ్రామంలో మూడేళ్ల క్రితం 400 వ్యవసాయ బోరుబావులు ఉండేవి. అప్పట్లో దాదాపు 3,200 ఎకరాల్లో మామిడి, సపోట, కళింగర, కర్భూజ, టమాట, దానిమ్మ, ఉల్లి, మొక్కజొన్న, వివిధ కూరగాయలతో పాటు సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. వ్యవసాయ పనుల ద్వారా 1,200 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులు పనులు కల్పించేవారు. నేడు ఈ పరిస్థితులు తారుమారు అయ్యాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఇవే పరిస్థితులు గతంలో 400 బోరు బావులున్న ఆవులదట్ల గ్రామంలో నేడు 40 బోర్లలో మాత్రమే నీరు ఆగిఆగి వస్తున్నాయి. మిగిలినవి పూర్తిగా వట్టిపోయాయి. మండల వ్యాప్తంగా 28 గ్రామాల్లో 4,007 బోరు బావులు ఉండేవి. నియోజకర్గంలోని గుమ్మఘట్ట మండలంలో3,212, డీ హీరేహళ్ మండలంలో 3,563, బొమ్మనహాళ్ మండలంలో 4,907, కణేకల్లు మండలంలో 5,689 బోరు బావుల్లో గతంలో సమృద్ధిగా నీరు వస్తుండేది. ప్రస్తుతం నియోజకవర్గం వ్యాప్తంగా 2,849 బోరు బావుల్లో మాత్రమే అరకొరగా నీరు వస్తున్నట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వేసవి ఆరంభం కాకనే పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు ఉంటాయోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. 700 అడుగులు తవ్వినా లభ్యం కాని నీరు ఆవులదట్ట గ్రామంలో గతంలో ఉన్న 400 బోరుబావుల్లో 200 అడుగుల నుంచి 350 అడుగుల లోపే భూగర్భజలాలు సమృద్ధిగా లభ్యమయ్యేవి. అప్పటల్లో బోరుబావి తవ్వేందుకు రూ.16 వేల నుంచి రూ. 22వేల వరకు ఖర్చు అయ్యేది. నేడు నాలుగు వందల నుంచి 700 అడుగుల వరకూ తవ్వినా నీటి చుక్క జాడ కనిపించడం లేదు. దీంతో ప్రజలకు తాగునీరు దొరకడం కష్టంగా మారింది. ఇదే సమయంలో మూగజీవాల పరిస్థితి మరింత దిగజారింది. తాగునీరు లేకపోవడంతో ఈ నాలుగు నెలల్లో 82 పశువులను రైతులు విక్రయించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. రెండు బోర్లలోనే నీరు గతంలో మాకు నాలుగు బోరుబావులు ఉండేవి. 12 ఎకరాలలో మామిడి, దానిమ్మ ఇతర పంటలు సాగుచేశాం. బోరుబావుల్లో నీరు పూర్తిగా ఇంకిపోవడంతో దిక్కు తోచడం లేదు. పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. పంటల సాగు కోసం లక్షలాది రూపాయలను పెట్టుబడుల రూపంలో పెట్టాం. ప్రస్తుతం రెండు బోర్లలో అరకొరగా నీరు వస్తోంది. - ధర్మానాయక్ , రైతు, ఆవులదట్ల గ్రామం