Visakha Industries net profit
-
హెచ్‌సీఏ నుంచి విశాక లబ్ధి పొందలేదు
హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే తమ సంస్థపై బురద చల్లుతున్నారని విశాక ఇండస్ట్రీస్ ప్రతినిధి వలీనాథ్ ఆరోపించారు. హెచ్‌సీఏ నుంచి విశాక లబ్ధి పొందిందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కొద్ది నెలలుగా ఉద్దేశపూర్వకంగానే కొందరు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీగల్ అడ్వైజర్ రజనీకాంత్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన రాజీవ్‌గాంధీ స్టేడియం నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు అప్పు తెచ్చి మరీ ఖర్చుపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్టేడియం నిర్మాణం కోసం ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆ బృహత్తర కార్యక్రమాన్ని విశాక భుజాన వేసుకుందని చెప్పారు. ఆ సమయంలో స్టేడియానికి విశాక ఇండస్ట్రీస్ పేరు పెడతామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. చేసుకున్న అగ్రిమెంట్లకు విలువ ఇవ్వని హెచ్‌సీఏ ఈ విషయాన్ని రాజకీయం చేసి విశాక పేరును తొలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో కోర్టు తీర్పు కూడా విశాకకు అనుకూలంగా వచ్చిందన్న విషయాన్ని గుర్తుచేశారు. -
విశాఖ ఇండస్ట్రీస్ లాభం రూ. 9 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో విశాఖ ఇండస్ట్రీస్ నికర లాభం సుమారు రూ. 9 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది రూ. 6 కోట్లు. ఇక ఆదాయం రూ. 285 కోట్ల నుంచి రూ. 276 కోట్లకు తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 1,021 కోట్ల నుంచి రూ. 1,004 కోట్లకు తగ్గినప్పటికీ నికర లాభం రూ. 21 కోట్ల నుంచి రూ. 24 కోట్లకు పెరిగింది. కంపెనీ తుది డివిడెండ్ షేరు ఒక్కింటికి రూ. 2 ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ రూ. 3 కూడా కలిపితే మొత్తం రూ. 5 అవుతుందని కంపెనీ వివరించింది.