visakha institute of medical sciences
-
‘కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత లేదు’
-
‘విమ్స్ ఎప్పటికీ ప్రభుత్వ అధీనంలోనే’
సాక్షి, విశాఖపట్నం : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) ఆస్పత్రిని నిర్లక్ష్యం చేశారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విమ్స్ ఆస్పత్రిలో పేషెంట్లకు అందుకున్న చికిత్స, వసతులపై సమీక్షించామన్నారు. మొదట్లో విమ్స్ పట్ల అనేక విమర్శలు వచ్చినప్పటికీ నేడు పాఠశాలలను ఎలా అభివృద్ధి చేశామో అదే నాడు-నేడు తరహాలో విమ్స్‌లో అభివృద్ధి కన్పిస్తుందన్నారు. ఆప్పత్రిలో 12 ఐసీయూ వార్డులు, 10 ఐసోలేషన వార్డులు ఉన్నాయని తెలిపారు. (ఏపీలో రెండోసారి కరోనా రాలేదు..) విమ్స్‌లో వైద్య సిబ్బంది కోరత ఉందని, సుమారు 320 పారమెడికల్ సిబ్బందితో పాటు, వైద్యుల భర్తీ త్వరలోనే చేపడతామన్నారు. కరోనా రోగులతో ఒక్కొక్కరిగా మాట్లాడామని, ఎవరికి ఆక్సిజన్ కొరత లేదన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆహారం అందిస్తున్నారని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. అయితే చంద్రబాబు విమ్స్‌ను ప్రైవేట్ పరం చేయాలని అనుకున్నారని, కానీ ఎప్పటికీ విమ్స్ ప్రభుత్వ అధీనంలోనే ఉంటుందన్నారు. విమ్స్‌లో రోగులను పరమర్శించేందుకు గంటపాటు పీపీఈ కిట్ ధరిస్తే తనకే ఆక్సిజన్ అందక ఊపిరాడలేదని, అలాంటిది 6 గంటలపాటు పీపీఈ కిట్లు ధరిస్తూ పనిచేస్తున్న వైద్యుల సేవ మరువలేనిదని కొనియాడారు. విమ్స్ డైరెక్టర్ వరప్రసాద్‌కు, సిబ్బందికి విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. (వైఎస్సార్ జిల్లాకు బయలుదేరిన సీఎం జగన్) -
ప్రైవేట్ చేతికి విమ్స్
రిలయన్స్ కు అప్పగించేందుకు యత్నాలు? కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రుల రాయబారం పేదలకు ప్రయోజనకరం అవుతుందనుకున్న వైద్యాలయం.. ఉత్తరాంధ్ర ప్రజలకు కేజీహెచ్‌కు సరిసాటిగా వైద్యసేవలు అందిస్తుందని భావించిన ఆస్పత్రి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(విమ్స్) ప్రైవేట్‌పరం చేయనున్నారా? ఉత్తరాంధ్ర వాసులకు ఆధునిక సేవలతో కూడిన మెరుగైన వైద్యం కలగా మిగులుతోందా..? వేల కోట్లు విలువచేసే వంద ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోందా? వీటిన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. విమ్స్‌ను ప్రైవేట్‌పరం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తోందని వినికిడి. కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ద్వారా రిలయన్స సంస్థకు విమ్స్‌ను అప్పగించే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. - ఆరిలోవ గతంలో పలుసార్లు విమ్స్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేశారుు. అరుుతే ప్రజా సంఘాలు, నగర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రైవేట్‌పరం ఆలోచన విరమించుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన అల్లుడు పైడా కృష్ణప్రసాద్‌కు చెందిన విద్యా సంస్థలకు విమ్స్‌ను అప్పగించే ప్రయత్నంచేసి విఫలమయ్యారు. ఆయన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి సమయంలో గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి విమ్స్‌ను చేజిక్కించుకోవడానికి అతని బంధువు, అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాంబశివరావు ద్వారా ప్రయత్నించారు. ఇదిలా ఉండగా 2014లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన అనతి కాలంలోనే గాయత్రీ విద్యా సంస్థలు ప్రతినిధులు దీన్ని వసం చేసుకోవడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద ప్రయత్నించారు. అరుునా ఈ ప్రయత్నాలన్నింటినీ విశాఖ వాసులు ప్రజా సంఘాల మద్దతుతో విఫలం చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రుల మంతనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు విమ్స్‌ను రిలయన్స కంపెనీకి అప్పగించే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్‌పరం చేయాలనే ఉద్దేశంలో ఉండటం వల్లే ఇంతవరకు శాశ్వత ఉద్యోగులను ఇక్కడ నియమించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఇక్కడ ఉన్నవారందరు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సులు డిప్యుటేషన్‌పై వివిధ ఆస్పత్రుల నుంచి వచ్చివారే. మరికొందరు తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. ఇదీ దీని నేపథ్యం.. ఉత్తరాంధ్ర వాసులకు ఆధునిక సధుపాయాలతో వైద్య సేవలందించాలని విమ్స్ నిర్మాణానికి 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తలంచారు. దీని నిర్మాణం కోసం జాతీయ రహదారిని ఆనుకొని హనుమంతవాక వద్ద పశుసంవర్ధక శాఖకు చెందిన సుమారు 100 ఎకరాల స్థలాన్ని దీని కోసం కేటారుుంచారు. దీనికి రూ.250 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆరు బ్లాకుల్లో 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి తీసుకురావాలని తలచారు. అందులో మొదటి విడతగా భవన నిర్మాణానికి రూ.55 కోట్లు నిధులు కేటారుుంచారు. దీని కోసం 2007 ఆగస్టులో ఆయన ముఖ్యమంత్రి హోదాలో దీని నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం పూర్తిచేసి 2009 డిసెంబరు నాటికి దీని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. ఆయన కాలంలో ఈ పనుల కోసం రూ.35 కోట్లు విడుదల చేశారు. అప్పట్లో దీని నిర్మాణం పనులు చకచకా సాగిపోయారుు. అనంతరం 2009లో అసెంబ్లీ ఎన్నికలు రావడం, కొన్ని నెలల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం పొందడంతో దీని నిర్మాణ పనులు చతికలపడ్డారుు. అనంతరం వచ్చిన రోశయ్య మరో రూ.20 కోట్లు ఇవ్వడంతో భవన నిర్మాణ ం పనులు పూర్తయ్యారుు. రోశయ్య తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్ రెడ్డి రూ.30 కోట్లు కేటారుుంచారు. వాటితో దీని ఆవరణలో రోడ్లు, ప్రహరీ, మార్చురీ, కేంటీన్, కిచెన్, రోగుల విశ్రాంతి హాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తదితర వాటిని నిర్మించారు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మరో రూ.30 కోట్లు కేటారుుంచారు. వాటితో పరికరాలు సమకూర్చారు. కుదించిన సౌకర్యాలు.. మొదట్లో దీనిలో 1130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీలు ఏర్పాటు చేయాలని తలచారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని సౌకర్యాలను కుదించి ప్రారంభించాలనుకొన్నారు. 1130 పడకలను 500కు, 21 సూపర్ స్పెషాలిటీస్‌ను 15కు కుదించేశారు. అదీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అధికారం చేపట్టిన కొన్నాళ్లకు వాటిని 250 పడకలకు, 6 సూపర్స్పెషాలీటీలకు కుదించి సేవలందిస్తామన్నారు. దీన్నికూడా బుట్టదాఖలు చేసేశారు. ప్రస్తుతం 50 పడకలతో 10 విభాగాలతో ఓపీ, ఇన్‌పేషెంట్ వార్డులు మాత్రమే నిర్వహిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి తీసుకురాలేదు. పేదలకు ఉచిత సేవలందవు విమ్స్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగిస్తే పేదలకు ఇక్కడ ఉచిత వైద్య సేవలు అందవు. ఈ ఏడాది ఏఫ్రిల్ 11న ఇది ప్రారంభమైనా ఉచిత సేవలు మాత్రం అందడంలేదు. ఓపీ టిక్కెట్ రూ.10లు, ఎక్స్‌రే రూ.200, ఇన్‌పేషెంట్‌కు రోజుకు రూ.250లు వసూలు చేస్తున్నారు. అరుునప్పటికీ వదలకుండా పూర్తిగా ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. ప్రైవేట్‌పరం అరుుతే ఇక్కడ వసూలు చేసే ఫీజులకు ధనికులు తప్ప పేదలు ఎవరూ వైద్యం పొందలేని పరిస్థితి నెలకొంటుంది. 90 ఎకరాల భూమి కూడా విమ్స్ ఆస్పత్రితో పాటు దీని పరిధిలో ఉన్న సుమారు 90 ఎకరాల భూమిని కూడా రిలయన్‌సకు లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వ పెద్దలు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. విమ్స్ నిర్మాణానికి సుమారు 100 ఎకరాలు స్థలం కేటారుుంచారు. దానిలో సుమారు 10 ఎకరాల్లో విమ్స్ ఆస్పత్రి భవనాలు, క్యాంటీన్, రోడ్లు, లాండరీ తదితర భవనాలు నిర్మించారు. మిగిలిన 90 ఎకరాలను ప్రత్యేకించి కొన్ని ఏళ్లపాటు లీజుకు ఇచ్చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అదే జరిగితే ఇక్కడ ప్రస్తుతం భూముల ధరలను బట్టి రూ.2,400 కోట్లు విలువ చేసే భూమిని రిలయన్స కంపెనీకి అప్పగించినట్లే. ఇదిగాకా ఇంతవరకు విమ్స్ భవన నిర్మాణానికి, అందులో యంత్రాలు, సామగ్రీ అమర్చడానికి ఖర్చుచేసిన రూ.115 కోట్లు ప్రజాధనం కూడా రిలయన్స ఖాతాలోకే వెళుతుంది. భూములు అప్పగించేందుకే.. విమ్స్‌ను రిలయన్‌సకు అప్పగించడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్టు తెలుస్తోంది. విమ్స్‌తో పాటు దాని చుట్టు పక్కల ఉన్న భూములను రిలయన్‌సకు కట్టబెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. ఇందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు భోగట్టా. ఇందుకు ఏకంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగినట్టు సమాచారం. -
విమ్స్‌లో వైద్య సేవలకు మంగళం!
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగింత? సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం విమ్స్ ఇక అకడమిక్ సేవలకే పరిమితం పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మృగ్యమే సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల పేద రోగులకు అత్యున్నత వైద్య సేవలు అందించడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది రాయి వేసిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(విమ్స్)కు టీడీపీ ప్రభుత్వం సమాధి కడుతోంది. విమ్స్‌ను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనను సూత్రప్రాయంగా ఆమోదించారు. ఇది అమల్లోకి వస్తే పేద రోగులకు విమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందకుండా పోతాయి. విమ్స్ స్ఫూర్తి ఇదీ... హైదరాబాద్‌లోని నిమ్స్ తరహాలో విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఒడిశా, చత్తీస్‌గఢ్‌కు చెందిన రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో వైఎస్ రాజశేఖరరెడ్డి విమ్స్‌కు రూపకల్పన చేశారు. రూ.250 కోట్లతో 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలతో ఈ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. విశాఖలోని ఆరిలోవలో 250 ఎకరాలు కేటాయించి, 2007లో శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులకు తొలి విడతగా రూ. 35.18 కోట్లు కేటాయించారు. వైఎస్ అనంతరం విమ్స్‌పై అశ్రద్ధ వైఎస్ హఠాన్మరణం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు విమ్స్ నిర్మాణంపై చిత్తశుద్ధి చూపించలేదు. రోశయ్య ప్రభుత్వం రూ.20 కోట్లే కేటాయించింది. కిరణ్మార్రెడ్డి ప్రభుత్వం విమ్స్‌ను 500 పడకలు, 17 సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలుగా కుదించింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 200 పడకలు, కేవలం 8 సూపర్ స్పెషాలిటీ విభాగాల స్థాయికి కుదించేసింది. విమ్స్‌ను ప్రైవేట్‌పరం చేయాలని తొలుత నిర్ణయించింది. విశాఖలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న అధికార పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధికి అప్పగించాలని బావించింది. ప్రజావ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ఇక వైద్య విద్యా బోధనకే పరిమితం విమ్స్‌ను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగిస్తే విమ్స్‌ను కేవలం వైద్య విద్యా బోధనకే పరిమితం చేస్తారు. పేద రోగులకు వైద్య సేవలు అందించరు. సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో దీనిపై చర్చించారు. సాంకేతిక అభ్యంతరాలను అధిగమించి ఈ ప్రతిపాదనను ఎలా అమలు చేయాలన్న దానిపై త్వరలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. లోగుట్టు ఏదైనా ఉందా! విమ్స్‌ను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి అప్పగించడం వెనుక లోగుట్టు వేరే ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయాల నిధులను ఆస్పత్రుల అభివృద్ధికి వెచ్చించకూడదని భారత వైద్య మండలి(ఎంసీఐ) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగించినా విమ్స్‌కు ప్రభుత్వమే నిధులు కేటాయించాలి. దానికంటే వైద్య సేవలకే ఉపయోగిస్తే పేదలకు ప్రయోజనం కలుగుతుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా యోచించడం లేదు. అంటే వైద్య విశ్వవిద్యాలయం ముసుగులో విమ్స్‌ను ప్రైవేట్‌పరం చేసే ఉద్దేశం ఉందా? అని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తుది నిర్ణయం తీసుకోలేదు విమ్స్‌ను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రభుత్వంతో చర్చించామని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజ్ చెప్పారు. విమ్స్‌ను ఆస్పత్రిగా నిర్వహించాలా? లేక వైద్య విద్యా బోధనకు కేటాయించాలా? అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. -
విమ్స్‌పై విశాఖ మంత్రి కన్ను!
సాక్షి, హైదరాబాద్: కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్)ను నిర్వహించలేం.. ప్రైవేట్‌కు ఇస్తే బ్రహ్మాండంగా నడపవచ్చంటూ ముఖ్యమంత్రికి వివరించి దీన్ని ఏకంగా లాక్కోవాలని చూశారు. ఇలా చేసింది ఎవరో కాదు స్వయానా విశాఖ జిల్లాకు చెందిన ఓ మంత్రి. వైద్య కళాశాలలకు డీమ్డ్ హోదాలు ఇస్తున్న నేపథ్యంలో విమ్స్నూ తీసేసుకుందామని ఆయన ప్రయత్నించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమ్స్‌ను ఇప్పటికిప్పుడు 9 స్పెషాలిటీలతో, 5 సూపర్ స్పెషాలిటీలతో నడిపించాలంటే రూ.200 కోట్లు పైగా అవసరమవుతుందని, దీన్ని ప్రైవేట్‌కు అప్పగిస్తే మెరుగైన సేవలు అందుతాయనేది సదరు మంత్రి సూచన. దీంతో చకచకా పావులు కదిపారు. గీతం వైద్య కళాశాలకు డీమ్డ్ హోదా ఇచ్చినట్టే విమ్స్‌ను మంత్రి బంధువు ఒకరు తీసుకుని, దానికి కూడా డీమ్డ్ హోదా తీసుకోవాలని తీవ్రంగా యత్నించినట్టు తెలిసింది. సీఎంతో దీనిపై పలు దఫాల్లో చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. లోపాయికారిగా జరుగుతున్న ఈ ప్రతిపాదన వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతాధికారుల చెవిన పడింది. అప్పటి వరకూ అది ‘నిమ్స్’ లాగే అటానమస్ హోదాలో ఉండేది. ఇలా అటానమస్ హోదాలో ఉంటే ప్రభుత్వం సులభంగా ప్రైవే ట్‌కు కట్టబెడుతుందేమోనని భావించిన అధికారులు... డిసెంబర్ మొదటి వారంలో విమ్స్‌ను వైద్య విద్యాశాఖలో కలిపేస్తూ జీవో జారీచేశారు. దీంతో రాజకీయ నేతల గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. అయినా మంత్రి పట్టు వదలలేదు. ఇప్పటికీ విమ్స్‌ను ప్రభుత్వం నడపడం సాధ్యం కాదని, దీన్ని ప్రైవేట్‌కు ఇవ్వడమే మేలని సీఎంపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విమ్స్ పనులు తీవ్ర జాప్యంతో నడుస్తుండటాన్ని బట్టి అనుమానాలు కలుగుతున్నాయి. -
విమ్స్ ‘వెన్ను విరిచేశారు’ !
సాక్షి, హైదరాబాద్: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్)ను ప్రభుత్వం నీరుగార్చేసింది. వైద్య విద్యా శాఖ (డీఎంఈ) ఆస్పత్రుల ‘మంద’లో కలిపేసింది. అటానమస్ ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించి డీఎంఈ పరిధిలోకి తెస్తూ గురువారం జీవో జారీ చేసింది. ఇకపై పనులు వేగవంతం చేస్తామని పేర్కొంది. హైదరాబాద్‌లోని నిమ్స్ స్థాయిలో స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా అభివృద్ధి చేయడం ద్వారా సామాన్యులకు కూడా మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో 2007లో అప్పటి ప్రభుత్వం విమ్స్ నిర్మాణానికి పూనుకుంది. విశాఖపట్నం జిల్లా చిన్నగదిలి గ్రామంలో 102.24 ఎకరాల స్థలాన్ని దీనికోసం కేటాయించారు. 8 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, దీనికి అనుబంధంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియా వంటి మరో 7 అనుబంధ విభాగాలు, 4 ఇంటెన్సివ్ కేర్ విభాగాలు ఏర్పాటు చేయాలనేది నిర్ణయం. తొలి దశలో రూ.103 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఆ మేరకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తొలి విడతగా రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిధులు సక్రమంగా మంజూరు చేయలేదు. అటానమస్ సంస్థ అయిన విమ్స్‌కు నిధులివ్వడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించాయి. దీంతో ఇప్పటికీ సివిల్, ఎలక్ట్రికల్ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం సంస్థ ఏర్పాటు లక్ష్యాన్ని నీరుగారుస్తూ దానిని కాస్తా డీఎంఈ పరిధిలో చేర్చేసింది. స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే ఎయిమ్స్, నిమ్స్ తరహాలో తీర్చిదిద్దేందుకు, అత్యాధునిక సౌకర్యాల కల్పనకు అవకాశం లభించేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.