ప్రైవేట్ చేతికి విమ్స్
రిలయన్స్ కు అప్పగించేందుకు యత్నాలు?
కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రుల రాయబారం
పేదలకు ప్రయోజనకరం అవుతుందనుకున్న వైద్యాలయం.. ఉత్తరాంధ్ర ప్రజలకు కేజీహెచ్‌కు సరిసాటిగా వైద్యసేవలు అందిస్తుందని భావించిన ఆస్పత్రి విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(విమ్స్) ప్రైవేట్‌పరం చేయనున్నారా? ఉత్తరాంధ్ర వాసులకు ఆధునిక సేవలతో కూడిన మెరుగైన వైద్యం కలగా మిగులుతోందా..? వేల కోట్లు విలువచేసే వంద ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోందా? వీటిన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. విమ్స్‌ను ప్రైవేట్‌పరం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తోందని వినికిడి. కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ద్వారా రిలయన్‌స సంస్థకు విమ్స్‌ను అప్పగించే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. - ఆరిలోవ
గతంలో పలుసార్లు విమ్స్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేశారుు. అరుుతే ప్రజా సంఘాలు, నగర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రైవేట్‌పరం ఆలోచన విరమించుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన అల్లుడు పైడా కృష్ణప్రసాద్‌కు చెందిన విద్యా సంస్థలకు విమ్స్‌ను అప్పగించే ప్రయత్నంచేసి విఫలమయ్యారు. ఆయన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి సమయంలో గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి విమ్స్‌ను చేజిక్కించుకోవడానికి అతని బంధువు, అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాంబశివరావు ద్వారా ప్రయత్నించారు. ఇదిలా ఉండగా 2014లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన అనతి కాలంలోనే గాయత్రీ విద్యా సంస్థలు ప్రతినిధులు దీన్ని వసం చేసుకోవడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద ప్రయత్నించారు. అరుునా ఈ ప్రయత్నాలన్నింటినీ విశాఖ వాసులు ప్రజా సంఘాల మద్దతుతో విఫలం చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రుల మంతనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు విమ్స్‌ను రిలయన్‌స కంపెనీకి అప్పగించే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్‌పరం చేయాలనే ఉద్దేశంలో ఉండటం వల్లే ఇంతవరకు శాశ్వత ఉద్యోగులను ఇక్కడ నియమించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఇక్కడ ఉన్నవారందరు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సులు డిప్యుటేషన్‌పై వివిధ ఆస్పత్రుల నుంచి వచ్చివారే. మరికొందరు తాత్కాలిక సిబ్బంది ఉన్నారు.
ఇదీ దీని నేపథ్యం..
ఉత్తరాంధ్ర వాసులకు ఆధునిక సధుపాయాలతో వైద్య సేవలందించాలని విమ్స్ నిర్మాణానికి 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తలంచారు. దీని నిర్మాణం కోసం జాతీయ రహదారిని ఆనుకొని హనుమంతవాక వద్ద పశుసంవర్ధక శాఖకు చెందిన సుమారు 100 ఎకరాల స్థలాన్ని దీని కోసం కేటారుుంచారు. దీనికి రూ.250 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆరు బ్లాకుల్లో 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి తీసుకురావాలని తలచారు. అందులో మొదటి విడతగా భవన నిర్మాణానికి రూ.55 కోట్లు నిధులు కేటారుుంచారు. దీని కోసం 2007 ఆగస్టులో ఆయన ముఖ్యమంత్రి హోదాలో దీని నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం పూర్తిచేసి 2009 డిసెంబరు నాటికి దీని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. ఆయన కాలంలో ఈ పనుల కోసం రూ.35 కోట్లు విడుదల చేశారు. అప్పట్లో దీని నిర్మాణం పనులు చకచకా సాగిపోయారుు. అనంతరం 2009లో అసెంబ్లీ ఎన్నికలు రావడం, కొన్ని నెలల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం పొందడంతో దీని నిర్మాణ పనులు చతికలపడ్డారుు. అనంతరం వచ్చిన రోశయ్య మరో రూ.20 కోట్లు ఇవ్వడంతో భవన నిర్మాణ ం పనులు పూర్తయ్యారుు. రోశయ్య తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్ రెడ్డి రూ.30 కోట్లు కేటారుుంచారు. వాటితో దీని ఆవరణలో రోడ్లు, ప్రహరీ, మార్చురీ, కేంటీన్, కిచెన్, రోగుల విశ్రాంతి హాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తదితర వాటిని నిర్మించారు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మరో రూ.30 కోట్లు కేటారుుంచారు. వాటితో పరికరాలు సమకూర్చారు.
కుదించిన సౌకర్యాలు..
మొదట్లో దీనిలో 1130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీలు ఏర్పాటు చేయాలని తలచారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని సౌకర్యాలను కుదించి ప్రారంభించాలనుకొన్నారు. 1130 పడకలను 500కు, 21 సూపర్ స్పెషాలిటీస్‌ను 15కు కుదించేశారు. అదీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అధికారం చేపట్టిన కొన్నాళ్లకు వాటిని 250 పడకలకు, 6 సూపర్‌స్పెషాలీటీలకు కుదించి సేవలందిస్తామన్నారు. దీన్నికూడా బుట్టదాఖలు చేసేశారు. ప్రస్తుతం 50 పడకలతో 10 విభాగాలతో ఓపీ, ఇన్‌పేషెంట్ వార్డులు మాత్రమే నిర్వహిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి తీసుకురాలేదు.
పేదలకు ఉచిత సేవలందవు
విమ్స్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగిస్తే పేదలకు ఇక్కడ ఉచిత వైద్య సేవలు అందవు. ఈ ఏడాది ఏఫ్రిల్ 11న ఇది ప్రారంభమైనా ఉచిత సేవలు మాత్రం అందడంలేదు. ఓపీ టిక్కెట్ రూ.10లు, ఎక్స్‌రే రూ.200, ఇన్‌పేషెంట్‌కు రోజుకు రూ.250లు వసూలు చేస్తున్నారు. అరుునప్పటికీ వదలకుండా పూర్తిగా ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. ప్రైవేట్‌పరం అరుుతే ఇక్కడ వసూలు చేసే ఫీజులకు ధనికులు తప్ప పేదలు ఎవరూ వైద్యం పొందలేని పరిస్థితి నెలకొంటుంది.
90 ఎకరాల భూమి కూడా
విమ్స్ ఆస్పత్రితో పాటు దీని పరిధిలో ఉన్న సుమారు 90 ఎకరాల భూమిని కూడా రిలయన్‌సకు లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వ పెద్దలు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. విమ్స్ నిర్మాణానికి సుమారు 100 ఎకరాలు స్థలం కేటారుుంచారు. దానిలో సుమారు 10 ఎకరాల్లో విమ్స్ ఆస్పత్రి భవనాలు, క్యాంటీన్, రోడ్లు, లాండరీ తదితర భవనాలు నిర్మించారు. మిగిలిన 90 ఎకరాలను ప్రత్యేకించి కొన్ని ఏళ్లపాటు లీజుకు ఇచ్చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అదే జరిగితే ఇక్కడ ప్రస్తుతం భూముల ధరలను బట్టి రూ.2,400 కోట్లు విలువ చేసే భూమిని రిలయన్‌స కంపెనీకి అప్పగించినట్లే. ఇదిగాకా ఇంతవరకు విమ్స్ భవన నిర్మాణానికి, అందులో యంత్రాలు, సామగ్రీ అమర్చడానికి ఖర్చుచేసిన రూ.115 కోట్లు ప్రజాధనం కూడా రిలయన్‌స ఖాతాలోకే వెళుతుంది.
భూములు అప్పగించేందుకే..
విమ్స్‌ను రిలయన్‌సకు అప్పగించడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్టు తెలుస్తోంది. విమ్స్‌తో పాటు దాని చుట్టు పక్కల ఉన్న భూములను రిలయన్‌సకు కట్టబెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. ఇందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు భోగట్టా. ఇందుకు ఏకంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగినట్టు సమాచారం.