vishnuvathi
-
టీడీపీలో ఒంటరిగా మిగిలిపోయిన పీతల!
ఏలూరు : ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ...టీడీపీ పార్టీలో ఒంటరి అయ్యారు. నోట్ల కట్ల వ్యవహారంపై పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు పెదవి విప్పటం లేదు. ఈ విషయంలో పీతల సుజాతకు మద్దతుగా నిలిచేందుకు ఎమ్మెల్యేలు వెనకంజు వేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. తణుకు మండలం వేల్పూరులో జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పీతల సుజాత ఎపిసోడ్‌పై చంద్రబాబు స్పందన ఎలా ఉంటుందో అనే దానిపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా నోట్ల కట్టల వ్యవహారంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. మంత్రి పీతల సుజాత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మంత్రి తండ్రి బాబ్జీ సొమ్ము తీసుకుంటుండగా సెల్ఫోన్లో చిత్రీకరించారనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయం గుర్తించే నోట్ల కట్టలను బయటకు విసిరేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హడావుడి తర్వతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీడియో ఎపిసోడ్లో సొంత పార్టీ నేతలపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై చంద్రబాబుకు పార్టీనేతలే సీడీ పంపించారనే ప్రచారం జరుగుతోంది. దాంతో మంత్రి నోట్ల కట్టల వ్యవహారం జిల్లాలో టీడీపీకి తలనొప్పిగా మారటంతో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీలో గంభీరమైన వాతావరణం నెలకొంది. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన పూర్వ ఉద్యోగి అర్దాల విష్ణువతి దత్తు కుమార్తె కార్నె శ్రీలక్ష్మి తన కుమార్తెకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేపట్టారు. గతంలో ఆచంట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సుజాతతో ఆమెకు స్నేహ సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆ స్నేహంతోనే తమ దత్తు కుమార్తెకు డీఎస్సీలో ఉద్యోగం ఇప్పించాలని రూ.10 లక్షలకు మంత్రితో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. అయితే మంత్రి మంగళవారం రాత్రి ఇంటికి చేరుకునేందుకు ఆలస్యం కావడంతో తండ్రి బాబ్జీకి ఈ డబ్బు వ్యవహారం అప్పగించినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కూడా అయిన బాబ్జీ తన కూతురి తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెడుతుంటారు. ఒప్పందం మేరకు డబ్బు అందజేసేందుకు విష్ణువతి మంగళవారం సాయంత్రం వీరవాసరంలోని మంత్రి నివాసానికి వచ్చారు. ఆమె డబ్బు అందజేస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చాటుగా వీడియో తీసినట్టు మంత్రి తండ్రి గుర్తించారు. అంతే... వెంటనే ఆయన సీన్ మార్చేశారు. నోట్ల కట్టల సంచీని బయట పెట్టించి... మతిస్థిమితం లేని మహిళ డబ్బు సంచితో తన ఇంటి ఆవరణలోకి వస్తే ఏం చేస్తున్నారంటూ బందోబస్తు పోలీసులను, టీడీపీ కార్యకర్తలను దబాయించారు. -
అడ్డంగా దొరికిన ఏపీ మంత్రి పీతల
* ఏపీ మంత్రి సుజాత ఇంట్లో నోట్ల కట్టల కలకలం * కుమార్తె ఉద్యోగం కోసం రూ.10 లక్షలిచ్చేందుకు వచ్చిన మహిళ * మంత్రి తండ్రి సొమ్ము తీసుకుంటుండగా సెల్లో చిత్రీకరణ * ఆ విషయం గుర్తించి... కట్టలు బయటకు విసిరివేత సాక్షి ప్రతినిధి, ఏలూరు: బాబు వస్తే జాబు వస్తుందన్నారు. బాబు వచ్చి ఏడాదైనా నిరుద్యోగులకు జాబులు మాత్రం రాలేదు.వచ్చే ఒకటి రెండు సర్కారీ పోస్టులను తెలుగుదేశం నేతలు తెగనమ్ముకుంటున్నారు. డీఎస్సీ ఉద్యోగం కోసం ఓ మహిళ రూ.10 లక్షల నగదు తీసుకుని మహిళా, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఇంటికి వెళ్లడం, నాటకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడే డబ్బు కట్టలు వదిలివేసి వెళ్లడం టీడీపీ నేతల బరితెగింపునకు అద్దం పట్టింది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఐదు కోట్లతో ఓ ఎమ్మెల్యే ఓటు కొనేందుకు ప్రయత్నించి జైలుపాలైన ఉదంతం మరవకముందే ఏపీ మంత్రి ఇంట్లో బయటపడ్డ నోట్లకట్టల వ్యవహారం తాజాగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన పూర్వ ఉద్యోగి అర్దాల విష్ణువతి దత్తు కుమార్తె కార్నె శ్రీలక్ష్మి తన కుమార్తెకు ఉద్యోగం ఇప్పించుకోవాలని విష్ణువతి సంకల్పించుకున్నారు. గతం లో ఆచంట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సుజాతతో ఆమెకు స్నేహసంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆ స్నేహంతోనే తమ దత్తు కుమార్తెకు డీఎస్సీలో ఉద్యోగం ఇప్పించాలని రూ.10 లక్షలకు మంత్రితో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. అయితే మంత్రి మంగళవారం రాత్రి ఇంటికి చేరుకునేందుకు ఆలస్యం కావడంతో తండ్రి బాబ్జీకి ఈ డబ్బు వ్యవహారం అప్పగించినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ర్ట కార్యదర్శి కూడా అయిన బాబ్జీ తన కూతురి తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెడుతుం టారు. ఒప్పందంమేరకు డబ్బు అందజేసేం దుకు విష్ణువతి మంగళవారం సాయంత్రం వీరవాసరంలోని మంత్రి నివాసానికి వచ్చారు. ఆమె డబ్బు అందజేస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చాటుగా వీడియో తీసినట్టు మంత్రి తండ్రి గుర్తించారు. అంతే... వెంటనే ఆయన సీన్ మార్చేశారు. నోట్ల కట్టల సంచీని బయట పెట్టించి... మతిస్థిమితం లేని మహిళ డబ్బు సంచితో తన ఇంటి ఆవరణలోకి వస్తే ఏం చేస్తున్నారంటూ బందోబస్తు పోలీసులను, టీడీపీ కార్యకర్తలను దబాయించారు. పోలీసులకు ఫోన్ చేసి ఎవరో మతిస్థిమితం లేని మహి ళ డబ్బు కట్టలతో తమ ఇంట్లోకి వచ్చిందని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకుని... తమ ఇంటి వాకిట్లో డబ్బు సంచి పడి ఉందని తమ వ్యక్తిగత సహాయకుడు చికిలే సుబ్బారావుతో ఫిర్యాదు ఇప్పిం చారు. రాత్రి పది గంటల సమయంలో ఇంటికి చేరుకున్న మంత్రి పీతల నేరుగా జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు ఫోన్‌చేసి విచారణ చేపట్టాల్సిందిగా కోరారు. మంగళవారం పొద్దుపోయాక వెలుగుచూసిన ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. -
మంత్రి ఇంట్లో లక్షలు.. పొంతన లేని మాటలు
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఇంట్లో దొరికిన రూ. 10 లక్షల సొమ్ము విషయంలో అందరూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. మంత్రి ప్రకటనకు, డబ్బు తెచ్చిన మహిళ ప్రకటనకు తేడా కనిపిస్తోంది. డబ్బులు తెచ్చిన అద్దాల విష్ణువతి అనే మహిళ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఆమె మాటలకు, ఆమె కుమార్తె శ్రీలక్ష్మి చెప్పే మాటలకు కూడా సంబంధం ఉండట్లేదు. తన కుమార్తెకు టీచర్ ఉద్యోగం ఇప్పించాలని ఆమె అడిగిందని, అయితే తమ వాళ్లు కష్టపడి చదువుకోవాలని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారని మంత్రి సుజాత అన్నారు. కూరగాయల సంచి ఒకదాన్ని ఆమె అక్కడ పెట్టి వెళ్లిపోయిందని చెప్పారు. అయితే, తన తమ్ముడి కూతురు పెళ్లి కోసం పాలకొల్లు స్టేట్ బ్యాంకులో డబ్బులు దాచానని, దాన్ని తీసుకుని మంత్రి సుజాత తండ్రిని కలిసేందుకు వచ్చానని అద్దాల విష్ణువతి పోలీసుల విచారణలో తెలిపారు. అప్పుడే డబ్బు సంచి మర్చిపోయి వెళ్లానన్నారు. కానీ ఆమె కుమార్తె చెప్పే విషయం వేరేలా ఉంది. భూమి కొనుగోలు కోసం పాలకొల్లు బ్యాంకు నుంచి 10 లక్షలు డ్రా చేసినట్లు శ్రీలక్ష్మి చెప్పారు. తన తల్లి ఆ నగదును చర్చిలో ప్రార్థన కోసం తీసుకెళ్లారని, తర్వాత మంత్రిని కలిసేందుకు వెళ్లి అక్కడ నగదు మర్చిపోయిందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నరసాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పాలకొల్లు స్టేట్ బ్యాంకు నుంచి మంగళవారమే నగదు డ్రా చేసినట్లు తెలిసిందని ఆయన తెలిపారు. 10 లక్షల నగదు లావాదేవీపై ఆదాయపన్ను శాఖ సాయం కూడా తీసుకుంటామని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం విష్ణువతిని, ఆమె కుమార్తె శ్రీలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.