visit to India
-
భారత్, శ్రీలంకల మధ్య విజన్ డాక్యుమెంట్
న్యూఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగాక ఆర్థిక భాగస్వామ్య విస్తరణకు ఒక విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఒక పత్రికా ప్రకటనని విడుదల చేశారు. గత ఏడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉన్నప్పుడు భారత్ ఒక స్నేహితుడిలా ఆదుకుందని, ఇరు దేశాల మధ్య భద్రత, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. శ్రీలంకతో ఆర్థిక భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, విద్యుత్, ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధి, అనుసంధానం వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. నావికా బలగం, వైమానిక దళం, ఇంధనం, ప్రజల మధ్య అనుసంధానం వంటివి కూడా బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు శ్రీలంకలో తమిళుల ఆకాంక్షలను తీర్చడానికి సహకరించాలని ప్రధాని మోదీ విక్రమ్ సింఘేను కోరారు. మత్స్యకారుల అంశంలో మానవీయ కోణంలో ఆలోచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
Garath Wynn Owen: హైదరాబాద్ తిండి తెగ నచ్చేసింది!
ఇంటికొచ్చిన అతిథి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం... నచ్చిన వంట వండి పెట్టడం... భారతీయులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు! మరి.. మన దేశానికో కొత్త అతిథి వస్తే...? వారికేమిష్టమో కూడా తెలుసుకోవాలి కదా... అందుకే.. ‘ఫ్యామిలీ’ గారెత్ ఓవెన్ కు హలో చెప్పింది! ఎవరీయన అనుకునేరు... నిత్యం మీటింగ్‌లు, చర్చల్లో బిజిబిజీగా గడిపే బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఈయన! చిరంజీవి పెట్టిన ఆవకాయ అన్నం రుచినీ.. మిర్చిబజ్జీలు, హైదరాబాద్ బిర్యానీ వెరైటీలనూ నెమరేసుకున్న ఆయన ఇంకా ఏమన్నారంటే.... సమోసా, బోండాలు నచ్చేశాయి ‘‘హైదరాబాద్ వచ్చి రెండు నెలలే అయ్యింది. కానీ.. ఉదయాన్నే ఫ్యామిలీతో కలిసి నడక సాగిస్తూంటా. నేనో భోజనప్రియుడిని. థాయ్‌లాండ్‌లో రెడ్ కర్రీ తదితర స్ట్రీట్‌ఫుడ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశా. హైదరాబాద్ ఫుడ్ కూడా బాగా నచ్చేసింది. ముఖ్యంగా చెప్పాల్సింది బోండాల గురించి! పిల్లలు వాటిని డోనట్లని పిలుస్తున్నారు. సమోసాలు, మిర్చిబజ్జీలూ రుచి చూశా. బోర్ కొట్టినప్పుడల్లా మసాలా చాయ్‌లు లాగించేస్తున్నా. ఇక హైదరాబాదీ బిర్యానీల్లో ఉన్న వెరైటీకి ఇప్పటికే ఫిదా అయిపోయా’’ ఆంధ్ర కారం పరీక్ష పెట్టింది ‘‘ఈమధ్యే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రితో భోంచేస్తున్నా. రకరకాల వంటలు వడ్డించారు. బ్రిటిష్ వాడిని, నా శరీరం అన్నింటినీ బాగానే తట్టుకుంటుందని అనుకున్నా కానీ, అక్కడ వడ్డించిన ఓ వంటకం నిజంగానే నాకు పరీక్ష పెట్టింది. కొంచెం రుచి చూడగానే అర్థమైపోయింది. అది మన తాహతుకు మించి మరీ కారంగా ఉందీ అని. అక్కడితో ఆపేశా. ఏమాటకామాట చెప్పుకోవాలి. మంత్రితో సమావేశం, విందూ రెండూ తృప్తినిచ్చాయి’’ హైదరాబాదీ హడావుడి బాగుంది ‘‘రోజంతా హడావుడిగా ఉండే నగరం తెగనచ్చేసింది. స్ట్రీట్‌ఫుడ్ కోసం లేదా వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఒకచోట నిలబడి చుట్టూ జరుగుతున్న హడావుడిని గమనిస్తూ ఉండిపోవడం చాలా ఇష్టం. కొన్ని రోజుల క్రితం చార్మినార్‌కు వెళ్లా. ఓల్డ్సిటీలోనూ తిరిగా... వెస్ట్ మిడ్‌ల్యాండ్ మేయర్‌తో కలిసి వెళ్లా అక్కడికి! అబ్బో.. ఎంత కళకళలాడుతుంటుందో అక్కడ. భలే బాగుంటుంది. ఇంకో మూడేళ్లు ఇక్కడే ఉంటాను కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలన్నీ తిరగాలి.’’ చిరంజీవి ఆవకాయ అన్నం వడ్డించారు ‘‘సినిమాలు, సంగీతం, నాట్యం వంటివి ఇష్టమైనప్పటికీ హైదరాబాద్‌లో ఇంకా వాటిని పెద్దగా ఆస్వాదించలేదు. కాకపోతే... ఈ మధ్యే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశా. ఆయన నాకు స్వయంగా వడ్డించారు కూడా. అందులో ఆవకాయ బాగా నచ్చింది. నాలుగు గంటలపాటు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నిజం చెప్పాలంటే అతిపెద్ద టాలీవుడ్ స్టార్‌తో గడిపానని అస్సలు అనిపించలేదు’’ నా సైకిల్ వచ్చేస్తోంది ‘‘కోవిడ్ నేర్పిన అతిపెద్ద పాఠం శారీరక వ్యాయామాన్ని అస్సలు మరచిపోవద్దూ అని. నాకూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం అంటే ఇష్టం కూడా. హైదరాబాద్‌లో బోలెడన్ని సైక్లింగ్ గ్రూపులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా నా సైకిల్ కూడా లండన్ నుంచి వస్తోంది. ఆ తరువాత నేనూ హైదరాబాద్ రోడ్లపై సైకిల్లో తిరిగేస్తా. హుస్సేన్ సాగర్ చుట్టూ రౌండ్లు కొట్టేస్తా. ఫిట్నెస్ కోసం నేను చేసే ఇంకో పని పంచింగ్ బ్యాగ్‌తో బాక్సింగ్ చేయడం! నిరాశా, నిస్పృహలను వదిలించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది’’ పిల్లలూ కలిసిపోయారు ‘‘నాకు పదకొండేళ్ల అలిసియా, తొమ్మిదేళ్ల థామస్‌లు ఉన్నారు. ఇక్రిశాట్లో ఉన్న స్కూల్లో చేరారు. ఈ ఏడాది కొంచెం ఆలస్యంగానే స్కూలుకెళ్లారు కానీ.. వెళ్లిన వెంటనే పిల్లలతో కలిసిపోయారు. ఉదయాన్నే ఏడు గంటలకల్లా వాళ్లను స్కూల్‌కు వదిలేస్తూంటాం. కొంచెం దూరమే కానీ.. అక్కడి వాతావరణం బాగా నచ్చింది.’’ -
భారత్ లో శ్రీలంక ప్రధానమంత్రి
-
భారత్ లో శ్రీలంక ప్రధానమంత్రి
న్యూఢిల్లీ: శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఇరు దేశాల దైపాక్షిక సంబంధాలపై ఆయన చర్చించనున్నారు. ఆపరేషన్ సర్జికల్ అనంతరం సింఘే భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సార్క్ సమ్మిట్ ఈనెలలో పాకిస్థాన్ లో జరుగనుంది. ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ ల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ లు భారత్ కు మద్దతుగా సార్క్ కు హాజరుకారాదని నిర్ణయించుకున్నాయి. భారత్ ప్రాతినిథ్యం లేకుండా సార్క్ సమావేశం సాధ్యం కాదని విక్రమ సింఘే పేర్కొన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్గరీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కూడా విక్రమ సింఘే సమావేశమవనున్నారు. ఆయన గురువారం ఇండియన్ ఎకనామిక్ ఫోరం సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం కొలంబోకు పయనమవుతారు. -
ప్రాన్స్ అధ్యక్షుడి పర్యటనపై బెదిరింపులు
బెంగళూరు: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె భారత పర్యటనను వ్యతిరేకిస్తూ బెదిరింపు లేఖ రావడం ఉద్రిక్తతను రాజేసింది. గుర్తు తెలియని దుండగలు ఈ హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరులోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయానికి బెదిరింపు లేఖ వచ్చినట్టు గురువారం అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావడాన్ని దుండగులు వ్యతిరేకించారు. దీంతో అసలే ఉగ్రదాడులతో బెంబేలెత్తిపోతున్న అధికారుల్లో మరింత ఆందోళన మొదలైంది. తాజా హెచ్చరికలపై నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. హోలండే పూర్తి భద్రత కోసం ఫ్రాన్స్ డైరక్టరేట్ జనరల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. అటు పఠాన్ కోట్ ఉగ్రదాడి, ఉగ్రవాదులు జనవరి 26న దేశ రాజధానిలో దాడి చేయనున్నారనే వార్తల నేపథ్యంలో పదివేల మంది పారామిలిటరీ సిబ్బందిసహా మొత్తం 80వేల మంది పోలీసు బలగాలతో ఇప్పటికే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జనవరి 26న జరగబోయే గణతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే హాజరు కానున్నారు. గత ఏడాది నవంబరు నెలలో ప్రధాని మోడీ ఫ్రాన్స్ వెళ్లినప్పుడు రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావాలని హోలండేను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే పారిస్ ఉగ్రదాడి, ఎమర్జెన్సీ నేపథ్యంలో జీ20 సదస్సుకు కూడా హోలండే హాజరు కాలేదు. తాజా హెచ్చరికలతో హోలండే రిపబ్లిక్ డే వేడుకలకు హాజరవుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా గత ఏడాది రిపబ్లిక డే వేడకులకు అమెరికా అధ్యక్షుడు ఒమాబా దంపతులు ముఖ్యంగా అతిధులుగా హాజరయ్యారు.