viyawada
-
ఎయిర్ షో ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు
సాక్షి, విజయవాడ: నగరంలోని పున్నమి ఘాట్‌లో జరుగుతున్న ఎయిర్ షో ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎయిర్ షో విన్యాసాలను తిలకించిన ఆయన అవి తనను అబ్బురపరిచాయని అన్నారు. అదేవిధంగా అమరావతిలో ప్రతిరోజూ ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నమని తెలిపారు. అందమైన టూరిస్ట్ ప్రదేశాలు, నదులు, రిజర్వాయర్లు, వెయ్యి కిలొమీటర్ల సముద్ర తీరం ఉండటం ఏపీకి వరమన్నారు. టూరిజాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని.. దానికి తగినట్లు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విమాన విన్యాసాలు చూసిన తర్వాత తను కూడా పైలెట్‌గా మారి విన్యాసాలు చేయాలనిపిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో పర్యాటక కేంద్రంగా అమరావతి ప్రపంచంలోనే ఐదు సుందరమైన నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. -
ఆర్థిక స్వావలంబనే ఆంధ్రాబ్యాంక్ లక్ష్యం
విజయవాడ (వన్‌టౌన్): భారతీయుల ఆర్థిక స్వావలంబన కోసమే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ పథకాలకు అనుగణంగా తమ బ్యాంకు పనిచేస్తోందని ఆంధ్రాబ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సురేష్ ఎన్.పటేల్ అన్నారు. నగరానికి వచ్చిన పటేల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని బ్యాంక్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం జోనల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రప్రథమంగా కృష్ణాజిల్లాలో నగదు రహిత రేషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 400 రేషన్ దుకాణాలు ఆంధ్రా బ్యాంక్ సహకారంతో అమలవుతున్నాయన్నారు. వాటిని తాను పరిశీలించానని చెప్పారు. బ్యాంక్ మిత్రా ల ద్వారా అందుతున్న సేవలను పరిశీలించి జోనల్ కార్యాలయంలో వారితో ముచ్చటించారు. ఫైనాన్షియల్ విభాగం జీఎం వినయ్‌వర్మ, విజయవాడ సర్కిల్ జీఎం రంగనా«ద్, జోనల్ మేనేజర్ కృష్ణారావు, సలహాదారు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.