vladimir zirinovsky
-
యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి ఉంది : జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే సత్తా భారత ప్రధాని మోదీకి ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. దీని ద్వారా ఆయనకే కాదు, అంతర్జాతీయంగాను భారత్ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు జెలెన్స్కీ ఇటీవల ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ జోక్యంతో ఉక్రెయిన్, రష్యాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు జెలెన్స్కీ..‘ప్రధాని మోదీ దీనిని నిజం చేయగలవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు భారత్‌లోనే చర్చలు జరగొచ్చు. అయితే, యుద్ధం మా గడ్డపై జరుగుతున్నందున మేమిచ్చే షరతులకు లోబడే సంప్రదింపులు జరగాలి’అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు ప్రయతి్నస్తానన్న మోదీ ప్రకటనపై జలెన్ స్కీ..మాటలు కాదు, చేతలు అవసరమన్నారు. ‘జనాభాపరంగా, ఆర్థికంగా, పలుకుబడిపరంగా భారత్ పెద్ద దేశం. అలాంటి దేశానికి ప్రధాని అయిన మోదీ..యుద్ధాన్ని ఆపేందుకు ప్రయతి్నస్తామని కేవలం మాటగా చెప్పడం సరికాదు. యుద్ధాన్ని ఆపేందుకు పలుకుబడిని ఉపయోగించాలి. రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టాలి. ఆదేశం నుంచి చౌకగా దొరుకుతున్న చమురును, రక్షణ రంగ ఉత్పత్తులను కొనరాదు. ఫలితంగా ఆ దేశ యుద్ధ సామర్ధ్యం దెబ్బతింటుంది’అని తెలిపారు. యుద్ధం సమయంలో ఎత్తుకుపోయిన మా చిన్నారుల్లో కనీసం వెయ్యి మందినైనా తిరిగి మాకు ఇచ్చేలా మోదీ రష్యాపై తన పలుకుబడిని ఉపయోగించాలన్నారు. తటస్థత అంటే రష్యా వైపు ఉన్నట్టే ‘యుద్ధం జరుగుతున్న సమయంలో తటస్థంగా ఉండటమంటే రష్యా పక్షాన ఉన్నట్లే అర్థం. దురాక్రమణదారు, బాధిత దేశం మధ్య తటస్థత అనేదే ఉండదు. అలా ఉండటమంటే పరోక్షంగా రష్యాకు మద్దతివ్వడమే’అని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ‘బ్రిక్స్ శిఖరాగ్రంలో పాల్గొన్న నేతలు కూడా సంక్షోభం సమసేందుకు సహకరిస్తామని చెప్పారు. నా దృష్టిలో అది కూడా మాకంటే రష్యాకే ఎక్కువగా అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నా’అన్నారు. ‘అంతేకాదు, సౌదీ అరేబియా, బ్రెజిల్ వంటి దేశాల నేతలు రానందున బ్రిక్స్ శిఖరాగ్రం విఫలమైనట్లే లెక్క. ప్రపంచాన్ని పుతిన్ పశి్చమ అనుకూల, బ్రిక్స్ అనుకూల దేశాలుగా విభజించాలనుకుంటున్నారు. అందుకే, బ్రెజిల్, చైనాలు తీసుకువచి్చన శాంతి ప్రతిపాదనలను సైతం తిరస్కరించారు. ఈ పరిణామం చైనా, బ్రెజిల్‌లకు చెంపపెట్టు వంటిది’అని చెప్పారు. -
Switzerland Peace Summit: ఉక్రెయిన్‌లో శాంతికి ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక
బెర్న్: ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఎలాంటి శాంతి ఒప్పందానికైనా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక అవుతుందని 80 దేశాలు తేలి్చచెప్పాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తున్నామని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌లో శాంతి సాధన కోసం స్విట్జర్లాండ్‌లో రెండు రోజులపాటు జరిగిన సదస్సు ఆదివారం ముగిసింది. దాదాపు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివారం 80 దేశాల ప్రతినిధులు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ సహా కొన్ని దేశాలు ఈ ప్రకటనలో పాలుపంచుకోలేదు. తుది డాక్యుమెంట్‌పై సంతకం చేయలేదు. యుద్ధం మొదలైన తర్వాత స్వా«దీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలని పలుదేశాలు రష్యాకు సూచించాయి. స్విట్జర్లాండ్ సదస్సు పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశంలో శాంతికి ఇదొక తొలి అడుగు అని అభివరి్ణంచారు. అయితే, ఈ సదస్సుకు రష్యా మిత్రదేశం చైనా హాజరుకాలేదు. రష్యాను ఆహ్వా నించలేదు. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి(పశి్చమ) పవన్ కపూర్ హాజరయ్యారు. -
G7 Summit 2024: జీ7 ప్యాకేజీ ఎప్పుడు? ఎలా?
28 నెలలుగా కొనసాగుతున్న రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ చాలావరకు ధ్వంసమైంది. యుద్ధం ఆగేదెన్నడో, ఉక్రెయిన్ పునరి్నర్మాణం మొదలయ్యేదెప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జీ7 దేశాల కూటమి 50 బిలియన్ డాలర్ల (రూ.4.17 లక్షల కోట్లు) రుణ ప్యాకేజీని ప్రకటించడం ఉక్రెయిన్‌కు ఎంతగానో ఊరట కలిగించే పరిణామం అనే చెప్పాలి. వివిధ దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయం నుంచే ఈ ప్యాకేజీని ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నట్లు జీ7 దేశాలు వెల్లడించాయి. దీనిపై ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ విజేతగా నిలవడానికి ఈ సాయం ఒక గొప్ప ముందడుగు అని అభివరి్ణంచారు. ఈ నేపథ్యంలో జీ7 ప్రకటించిన రుణ ప్యాకేజీ, ఉక్రెయిన్‌కు కలిగే లబ్ధి, ఇందులో ఇమిడి ఉన్న ఇబ్బందులు, వివిధ దేశాలు స్తంభింపజేసిన రష్యా ఆస్తుల గురించి తెలుసుకుందాం. 2022 ఫిబ్రవరిలో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై హఠాత్తుగా దాడికి దిగింది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ సైతం ఎదురుదాడి ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. వేలాది మంది సామాన్య ప్రజలు, సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలంటూ పశి్చమ దేశాలు హెచ్చరించినా రష్యా లెక్కచేయడం లేదు. దీంతో రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టడానికి తమ దేశంలో ఉన్న రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను పశి్చమ దేశాలు స్తంభింపజేశాయి. ఈ ఆస్తుల విలువ 300 బిలియన్ డాలర్ల (రూ.25.06 లక్షల కోట్లు) వరకు ఉంటుంది. వీటిపై ప్రతి సంవత్సరం 3 బిలియన్ డాలర్ల (రూ.25 వేల కోట్లు) వడ్డీ, ఆదాయం లభిస్తోంది. రష్యా ఆస్తులు చాలావరకు ఐరోపా దేశాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నందుకు రష్యా పరిహారం చెల్లించాల్సిందేనని అమెరికా సహా పశి్చమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు రష్యా ఒప్పుకోవడం లేదు. దాంతో రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీని, ఆదాయాన్ని పరిహారం కింద ఉక్రెయిన్‌కు ఇవ్వాలని తాజాగా జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇబ్బందులు ఏమిటి? విదేశాల్లో ఉన్న ఆస్తులు ఒకవేళ మళ్లీ రష్యా నియంత్రణలోకి వస్తే రుణాన్ని తిరిగి చెల్లించడం కష్టమే. స్తంభింపజేసిన రష్యా ఆస్తులను శాంతి చర్చల్లో భాగంగా విడుదల చేయాల్సి వస్తే రుణాన్ని చెల్లించడానికి జీ7 దేశాలు మరో మార్గం వెతుక్కోవాలి. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రష్యా ఆస్తులపై కొన్నిసార్లు అనుకున్నంత వడ్డీ గానీ, ఆదాయం గానీ రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులెదురవుతాయి. అలాగే రుణ భారాన్ని జీ7 దేశాలన్నీ పంచుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో వారం రోజుల్లో తుది ప్రణాళికను ఖరారు చేయనున్నారు. యూరప్‌లోని రష్యా ఆస్తులపై ఆంక్షలను కొనసాగించడానికి ప్రతిఏటా యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ఓటింగ్ జరుగుతోంది. ఈయూలోని ఏ ఒక్క సభ్యదేశం వీటో చేసినా ఆంక్షలు రద్దవుతాయి. ఆస్తులు రష్యా అ«దీనంలోకి వెళ్లిపోతాయి. ఈయూలోని హంగేరీ దేశం ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఒకవేళ హంగేరీ వీటో చేస్తే ఉక్రెయిన్ రుణ ప్యాకేజీ ప్రణాళికలు మొత్తం తలకిందులవుతాయి. తమ ఆస్తులపై వచ్చే వడ్డీని, ఆదాయాన్ని పశి్చమ దేశాలు మింగేస్తామంటే రష్యా చూస్తూ కూర్చోదు కదా! కచ్చితంగా ప్రతీకార చర్యలకు దిగుతుంది. రష్యాలోనూ పశి్చమ దేశాల ఆస్తులున్నాయి. వాటిని రష్యా ప్రభుత్వం గతంలోనే స్తంభింపజేసింది. తమ ఆస్తులపై వడ్డీని కాజేసినందుకు ప్రతిచర్యగా పశ్చిమదేశాల ఆస్తులపై వడ్డీని సైతం రష్యా లాక్కొనే అవకాశం లేకపోలేదు. హక్కులు బదిలీ చేయడం సాధ్యమేనా? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నష్టపరిహారంగా ఉక్రెయిన్‌కు ఇవ్వాలనుకోవడం బాగానే ఉన్నప్పటికీ ఇందులో చట్టపరమైన అవరోధాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రష్యా అంగీకారం లేకుండా ఇలా చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటున్నారు. మొండిగా ముందుకెళ్తే తీవ్ర వివాదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తొలుత న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఒక దేశానికి సంబంధించిన ఆస్తులను స్తంభింపజేసిప్పటికీ వాటిపై హక్కులను ఇతర దేశాలకు బదిలీ చేయడం సాధ్యం కాదు. అవి ఎప్పటికైనా సొంత దేశానికే చెందుతాయి. భౌగోళికంగా తమ దేశంలో ఉన్న ఇతర దేశాల ఆస్తులను ఆయా దేశాల అనుమతి లేకుండా స్వా«దీనం చేసుకొని అనుభవిస్తామంటే కుదరదు. రష్యా ఆస్తులను ఎలా వాడుకోవచ్చు? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు ఇచ్చేసే అవకాశం లేదు. జీ7లోని ఏ దేశమైనా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకొని ఆ సొమ్మును ఉక్రెయిన్‌కు ఇవ్వొచ్చు. రుణాన్ని తీర్చేయడానికి రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీ, ఆదాయాన్ని చెల్లించవచ్చు. తమకు అందే సొమ్మును ఆయుధాలు కొనుగోలు చేయడానికి, దేశ పునరి్నర్మాణానికి ఉక్రెయిన్ ఉపయోగించుకొనేందుకు ఆస్కారం ఉంది. జీ7 నుంచి రుణ ప్యాకేజీ ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు చేరే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి రాబోయే పదేళ్లలో 486 బిలియన్ డాలర్లు (రూ.40.58 లక్షల కోట్లు) అవసరం. ఇది ముమ్మాటికీ దొంగతనమే: పుతిన్ రష్యా ఆస్తులపై వచ్చే ఆదాయంతో ఉక్రెయిన్‌కు ప్యాకేజీ ఇవ్వాలన్న జీ7 దేశాల నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ దొంగతనమేనని చెప్పారు. చోరులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తమ ఆస్తుల జోలికి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. పుతిన్ శుక్రవారం రష్యా విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జీ7 దేశాల నిర్ణయంపై చర్చించారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా దొంగతనం కచ్చితంగా దొంగతనమే అవుతుందన్నారు. జీ7 దేశాల నిర్ణయాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా శుక్రవారం ఖండించారు. ఈ నిర్ణయం చట్టపరంగా చెల్లదని తేలి్చచెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి
కీవ్: ఉక్రెయిన్‌లో సైనిక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగా రష్యా సైన్యం క్షిపణిని ప్రయోగించింది. ఈ ఘటనలో 19 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌లోని జపొరిజాజియాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రష్యా క్షిపణి దాడిలో 19 మంది తమ జవాన్లు మరణించినట్లు ఉక్రెయిన్ సోమవారం ధ్రువీకరించింది. వీరంతా 128వ మౌంటెయిన్–అసాల్ట్ బ్రిగేడ్‌కు చెందినవారు. రష్యా క్షిపణి దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. -
Russia-Ukraine War: రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాం
కీవ్: రష్యా దళాలపై తమ సేనలు క్రమంగా పైచేయి సాధిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఖర్కీవ్ నుంచి రష్యా సైనికులను వెనక్కి తరిమేస్తున్నట్లు తెలిపారు. ఈశాన్య ఖర్కీవ్ ప్రాంతంలోని నాలుగు గ్రామాల నుంచి రష్యా జవాన్లను తరిమికొట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం సైతం ప్రకటించింది. తమ ధాటికి తట్టుకోలేక వారు రష్యా సరిహద్దు దిశగా తరలిపోతున్నారని పేర్కొంది. ఉక్రెయిన్ సైన్యంతో పోలిస్తే రష్యా సైన్యం ఎన్నో రెట్లు బలమైనది. అయినప్పటికీ రష్యా ఇప్పటికీ ఉక్రెయిన్‌పై పట్టు సాధించలేకపోవడం గమనార్హం. ఉక్రెయిన్‌లో చాలాచోట్ల రష్యాకు గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. రష్యా టి–90 యుద్ధ ట్యాంకు ధ్వంసం రూ.28 కోట్ల (3 మిలియన్ పౌండ్ల) ఖరీదైన రష్యా టి–90 వ్లాదిమిర్ యుద్ధ ట్యాంకును ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. ఇందుకోసం ఉక్రెయిన్ ఆర్18 అనే సొంత డ్రోన్‌ను ఉపయోగించడం విశేషం. ఈ డ్రోన్ ద్వారా కేవలం రూ.38 వేల విలువైన (400 పౌండ్లు) రాకెట్లను జారవిడిచి టి–90 ట్యాంకును ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఈ దృశ్యాలను ఉక్రెయిన్ డ్రోన్ వార్ఫేర్ యూనిట్ విడుదల చేసింది. ఆర్18 డ్రోన్ 5 కిలోల పేలోడ్లను మోసుకెళ్లగలదు. రష్యా గ్యాస్ సరఫరా నిలిపివేత ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలయ్యాక తొలిసారిగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ నుంచి యూరప్ దేశాలకు సరఫరా అవుతున్న సహజ వాయువును ఓ ఉక్రెయిన్ ఆపరేటర్ నిలిపివేశాడు. యూరప్‌కు గ్యాస్ రవాణాకు రష్యా ఇక ఇతర మార్గాలు చూసుకోవాల్సిందేనంటున్నారు. రష్యా గ్యాస్‌లో నాలుగింట మూడొంతులు ఉక్రెయిన్ గుండానే సరఫరా అవుతోంది. రష్యా విస్తరణ యత్నాలకు ఎదురు దెబ్బ నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్‌లో రష్యా దళాలపై ఉక్రెయిన్ సైన్యం ఎదురు దాడికి దిగుతోందని బ్రిటిష్ మిలటరీ తెలిపింది. నల్లసముద్రంలో పెత్తనాన్ని విస్తరించేందుకు రష్యా ప్రయత్నాలకు ఇది విఘాతమని ట్వీట్ చేసింది. హిట్లర్/స్టాలిన్ కంటే పుతిన్ డేంజర్ హిట్లర్/స్టాలిన్ వంటి నియంతల కంటే పుతిన్ ప్రమాదకారి అని పోలండ్ ప్రధాని మాటిసుజ్ మోరావీకి అన్నారు. పుతిన్‌ది రాక్షస భావజాలమని, దాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 20వ శతాబ్దపు నియంతల వద్ద ఉన్నవాటికంటే ఎక్కువ అపాయకరమైన మారణాయుధాలు పుతిన్ వద్ద ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్ లేని ప్రపంచం(డిపుతినైజేషన్) సాకారం కావాలని మోరావికీ ఆకాంక్షించారు. రష్యా అధ్యక్షుడి సిద్ధాంతం కేవలం ఉక్రెయిన్‌కే కాదు, మొత్తం యూరప్‌కు ముప్పేనని ఉద్ఘాటించారు. నలుగురు రష్యా రీజినల్ గవర్నర్ల రాజీనామా పశ్చిమ దేశాల ఆంక్షలతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నలుగురు రష్యన్ రీజినల్ గవర్నర్లు పదవులకు రాజీనామా చేశారు. టామ్స్క్, సరాటోవ్, కిరోవ్, మారీ ఎల్ గవర్నర్లు పదవుల నుంచి తప్పుకున్నారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని రైజాన్ రీజినల్ గవర్నర్ చెప్పారు. ఈ ఐదు రీజియన్లకు వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. -
ట్రంప్ కావాలా.. అణుయుద్ధం కావాలా?
వచ్చే నెలలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌నే ఎన్నుకోవాలని.. లేనిపక్షంలో అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహిత సహచరుడు ఒకరు హెచ్చరించారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలుచేస్తూ.. రష్యన్ ట్రంప్‌గా పేరొందిన వ్లాదిమిర్ జిరినొవ్స్కీ రాయిటర్స్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. మాస్కోకు.. వాషింగ్టన్కు మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించగల ఏకైక వ్యక్తి ట్రంప్ మాత్రమేనని ఆయన తెలిపారు. అదే హిల్లరీ క్లింటన్ ఎన్నికైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పకపోవచ్చని జిరినొవ్స్కీ హెచ్చరించారు. గత నెలలో జరిగిన రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో జిరినొవ్స్కీ ప్రాతినిధ్యం వహించే లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ రష్యా మూడోస్థానంలో నిలిచింది. అయితే రష్యాలో చాలామంది ఆయనను ఒక జోకర్లా భావిస్తుంటారు. అందరి దృష్టి తనమీద పడాలన్న ఉద్దేశంతో ఆయన ప్రతి అంశం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. క్రెమ్లిన్ విధానాలకు బాగా కట్టుబడి ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి ఒక్కోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు ఇప్పటి కంటే దారుణంగా అయ్యేందుకు అవకాశం లేదని.. యుద్ధం మొదలైతేనే అవి మరింత క్షీణిస్తాయని జిరినొవ్స్కీ అన్నారు. భూగ్రహం మీద శాంతి ఉండాలంటే అమెరికన్లు ట్రంప్‌కే ఓటు వేయాలని, కానీ వాళ్లు హిల్లరీని ఎన్నుకుంటే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం.. అది కూడా అణుయుద్ధం తప్పదని చెప్పారు. ప్రతిచోటా హిరోషిమా, నాగసాకిలే కనపడతాయని హెచ్చరించారు.