నిర్బంధాల నీడలలో
బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా విన్న తరువాతనే తెలిసింది-ఎమర్జెన్సీ సంగతి.
జయ ప్రకాష్ నారాయణ్,
మొరార్జీ దేశాయ్ వంటి నేతలు ఆ ముందు రాత్రి అరెస్టయిన సంగతి కూడా అలాగే తెలిసింది.
నేను విలేకరులను పిలిచి ఈ చర్యలను ఖండి స్తున్నట్టు చెప్పాను.
జూన్ 12, 1975.
ఆ ముందురోజు రాత్రి నుంచే గుజరాత్ అసెంబ్లీ ఎన్ని కల ఫలితాలు రావడం మొదలైంది. కాంగ్రెస్ పరిస్థితి ఆశా జనకంగా లేదు. మరోవైపు రాయబరేలీ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఇందిరా గాంధీ ఎన్నిక (1971) చెల్లదంటూ సోష లిస్ట్ నాయకుడు రాజ్‌నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జేఎంఎల్ సిన్హా తీర్పు ఇచ్చినట్టు వార్త వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో మిత్రుడు సి. నరసింహారావు రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నాను. వార్త తెలిసిన వెంటనే ‘ఇందిర రాజీనామా చేయాలి’ అన్నాను.
జూన్ 25, 1975
అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద పూర్తిగా స్టే విధించాలని కోరుతూ జూన్ 23న ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లారు. వెకేషన్ జడ్జి వీఆర్ కృష్ణయ్యర్ షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చారు. అది జరిగిన కొన్ని గంటలకే ఇందిరా గాంధీ ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని విధిస్తూ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆ రాత్రే కొద్దిగా జల్లు పడుతోం డగా నేనూ, మా నాన్నగారూ విజయవాడ నుంచి గుం టూరు శివార్లలో ఉండే మా ఇంటికి తిరిగి వచ్చాము. ఒం టిగంటకు తలుపు చప్పుడైంది. ఎదురుగా పోలీసులు.
కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ వెంటనే రమ్మన్నారని చెప్పారు. అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కొంచెం హడా వుడి జరిగింది. ఇంతకీ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన సంగతి నాకు తెలియదు. ఆశ్చర్యంగా పోలీసులు కూడా చెప్పలేకపోయారు. ఇక్కడ నాకు స్నేహితుడు రాఘ వరావు జతయ్యాడు. ఇద్దరినీ ఒక హోటల్‌కు మార్చి, తరు వాత రాజమండ్రి జైలుకు తీసుకువెళతామని తెలియచేశా రు. మరునాడు ఉదయం పదిగంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని మాత్రమే ఆకాశవాణి ప్రకటించిం ది. చివరికి బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా విన్న తరువా తనే తెలిసింది- ఎమర్జెన్సీ సంగతి.
జయప్రకాశ్ నారా యణ్, మొరార్జీ దేశాయ్ వంటి నేతలు ఆ ముందు రాత్రి అరెస్టయిన సంగతి అలాగే తెలిసింది. నేను విలేకరులను పిలిచి ఈ చర్యలను ఖండి స్తున్నట్టు చెప్పాను. రాఘవరావు, నేనూ విజయవాడ బయలుదేరాం. విజయవాడ బస్ డిపో లోనూ, రైల్వే స్టేషన్లోనూ మాకు సాదర స్వాగతం లభిం చింది. జూపూడి యజ్ఞనారాయణ, బి. సుబ్బారెడ్డి, తూమా టి బాలకోటేశ్వరరావులను కూడా ‘మీసా’ (మెయింటె నెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) కింద అరెస్ట్ చేసినట్టు ఇక్కడే తెలిసింది. గొట్టిపాటి మురళీమోహనరావు, కొమర గిరి కృష్ణమోహన్‌రావు, ఎంవీ రామమూర్తి, తుమ్మల చౌదరి, అట్లూరి శ్రీమన్నారాయణ, అయితా రాములు- వీరందరినీ కూడా రాజమండ్రి జైలుకే తరలిస్తున్నట్టు సమాచారం అందింది. దేశమే నిర్బంధం నీడలోకి వెళ్లింది.
అంతటా, భయం అంతర్లీనంగా. ఆ గుబులుకు కొద్దిగా సాంత్వనను ఇచ్చే ఘటనలు కూడా మధ్య మధ్య జరగక పోలేదు. మాకు కాపలా ఉన్న పోలీసుకు రూపాయి ఇచ్చి పత్రికలు తెచ్చి పెట్టమన్నాను. నాలుగు తెచ్చాడు. నాలు గూ ఆంధ్రపత్రిక ప్రతులే. నాలుగు పత్రికలంటే, ఒకే పత్రి క నాలుగు ప్రతులు తెచ్చే మేధావులు ఉన్నంత వరకు ఫర వాలేద నిపించింది. ఇలాంటి వారి సాయంతో ఇందిర నియంత కావాలనుకుంటే కష్టమే అని బయటకే అన్నాను.
రాజమండ్రి జైలులో
రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగుపెట్టాం. అక్కడ ఎంవీ ఎస్ సుబ్బరాజు (వ్యవస్థా కాంగ్రెస్) ఉన్నారు. మాకినేని బసవపున్నయ్య (సీపీఎం), కాతా జనార్దనరావు (సోష లిస్ట్), కొల్లా వెంకయ్య (కమ్యూనిస్టు నాయకుడు), పీవీ ఎన్ రాజు (జనసంఘ్) మాదల నారాయణస్వామి (ఎం ఎల్ న్యూడెమోక్రసీ) ఉన్నారు. ‘మీసా’ నిబంధన కింద అరెస్టయిన వారిలో అన్నిరకాలు ఉన్నారు. మీసా నిబం ధనల మేరకు నిర్బంధానికి కారణాలేమిటో బందీలకు చెప్పాలి. గుంటూరు జిల్లా కలెక్టర్‌కు కారణాలు చెబుదామ నిపించింది కాబోలు.
మేము చెరుకుపల్లి పోలీస్‌స్టేషన్ మీద దాడికి వ్యూహం పన్నామట. ఇద్దరు కానిస్టేబుళ్ల మర ణానికి కారణమట. ఆయుధాలు దొంగిలించుకుపోవడా నికి కుట్ర చేశామట. ఇదీ వివరణ. భారతీయ లోక్‌దళ్ కార్యదర్శిగా సంచలనాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా నట. అలహాబాద్ హైకోర్టు తీర్పు తరువాత ఇందిర రాజీ నామా చేయాలని కోరడం, ‘సంపూర్ణ విప్లవం’ కావాలని కోరడం నేరమట. మాకు వివరణ ఇచ్చిన కొన్ని గంటలకే ఇలా కారణాలు చెప్పాలన్న ఆ నిబంధనను (జూన్ 29న) హఠాత్తుగా సవరించారు.
అయితే ఏవో సాంకేతిక కారణా లతో మీసా అరెస్టులు చెల్లవని కర్ణాటక హైకోర్టు ఆగస్టు, 1975లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత నిర్బంధ ఆదేశాలను రద్దు చేసి కొత్తవి జారీ చేసింది. నేను ఎండీ ప్రవేశం కోసం విశాఖపట్నంలో ఇంటర్వ్యూకు హాజ రు కావలసి ఉంది. ఈ సౌకర్యం నాకు ఇవ్వలేదు. కాగా 20 రోజుల వరకు ఈ అరెస్టుల గురించి తెలియచేయలేదు కాబట్టి, ఆ అరెస్టులు చెల్లవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రక టించింది. కానీ పోలీసులు మా విడుదల, మళ్లీ అరెస్టు ఒకేసారి నిర్వహించారు. నేను హైకోర్టు మెట్లు దిగగానే అరెస్టు చేసి, చార్మినార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ రాత్రి పోలీస్ స్టేషన్లోనే నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్న పుడు నిఘా విభాగానికి చెందిన ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులు వచ్చారు.
‘‘జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీదేశాయ్ వంటి పెద్ద నాయకులను అరెస్ట్ చేసినా ప్రజలు మౌనంగానే ఉం డిపోయారు. అంటే ఈ పరిణామాలకు ప్రజా మద్దతులే దని అర్థం కావడం లేదా?’’ అన్నారు. ‘‘ఇందిరా గాంధీని అరెస్టు చేసినా అంతే, జనం మాట్లాడరు!’’ అన్నాన్నేను.
ప్రజావిజయం
కానీ ఆ మౌనం ఎంతోకాలం కొనసాగలేదు. 21 మాసాల తరువాత ఎమర్జెన్సీ ఎత్తివేయక తప్పలేదు. అరెస్టయిన వేలాది మందిని విడుదల చేయక తప్పలేదు. జనతా పార్టీ ఆవిర్భవించింది. 1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ ఘోరం గా ఓడిపోయారు. జూన్, 1975 నుంచి 1977 మధ్య కాలం మన ప్రజాస్వామ్యానికి ఒక పీడకల. దేశం లో పడగ విప్పిన నియంతృత్వాన్నీ, నిర్బంధాన్నీ కూల దోసినవారు ఎవరో కాదు. అలాంటి రాజ్యశక్తిని ఎది రించి, తాము పోగొట్టుకున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలను జాతికి అలవాటైన అహింసా పద్ధతిలో పదిల పరచిన వారు సామాన్య ప్రజానీకమే. ఇందుకు భావితరాలు రుణపడి ఉండాలి.
(వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యులు)
మొబైల్: 98663 76735, యూఎస్ 001-41077 78552
- ఎలమంచిలి శివాజీ