voter awareness programs
-
ఓటర్ల అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఈవీఎం ఏర్పాటు
-
ఇప్పుడైనా సరిచేస్తారా?
బోథ్: రాష్ట్రంలో జనవరి రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు సన్నద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో పౌరులు పోటీ పడతారు. పట్టణాల్లో ఉన్నవారు సైతం వ్యయప్రయాసాలకోర్చి తమ సొంత గ్రామాలకు చేరుకుని ఓటు వేస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తే ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో కంగు తిన్నారు. స్థానికంగా ఉండే వారి పేర్లు సైతం తొలగించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటేసేందుకు వచ్చిన పలువురు ఓటరు జాబితాల్లో పేర్లు లేక ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికలను దష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించే దిశగా ప్రయత్నిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల గల్లంతు ముప్పు తప్పుతుంది. ముసాయిదా ఓటరు జాబితా సవరణలో కీలకంగా వ్యవహరించాల్సిన బీఎల్వోలు విధులు సక్రమంగా నిర్వహించకనే ఈ పరిస్థితి తలెత్తుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేయాల్సింది ఇలా.. పోలింగ్ కేంద్రం పరిధిలోని గ్రామాల్లో ఓటరు నమోదుతోపాటు తొలగింపులో బీఎల్ఓలు ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ముసాయి దా ఓటరు జాబితా సవరణ సమయంలో బూత్ లెవల్ అధికారి ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదుపై చైతన్యం కల్పించాలి. జాబితా నుంచి ఎవరి పేరునైనా తొలగించాలంటే నోటీసు ఇచ్చి విచారణ జరపాలి. నిర్ధారణ చేసుకున్న తర్వాతనే పేరు తొలగించాల్సి ఉంటుంది. సాధారణంగా పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటరు నమోదు కోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపడతారు. ఆ సమయంలో బీఎల్ఓలు స్థానికం గా అందుబాటులో ఉండి అర్హులైన వారి పేర్లు జాబితాలో నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాలి. చేస్తున్నారిలా.. బీఎల్ఓలు స్థానికంగా ఉండకపోవడంతో స్థానిక రాజకీయ నాయకుల మాటలు విని వారు చెప్పినట్లు నడుచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే ఓట్ల తొలగింపు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓటరు జాబితాలో ఒక్కసారి పేరు నమోదైతే తొలగించాలంటే తప్పనిసరిగా ఆ ఓటరు సమీప ఇంటి యజమానుల నుంచి వివరణ తీసుకోవాలి. తర్వాత తొలగాంచాలని నిబంధనలు చెబుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంతోపాటు ఇంటర్నెట్ ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బీఎల్ఓలు తిరస్కరిస్తున్నారు. దీంతో అన్ని అర్హతలుండి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేర్లు నమోదు కాకపోవడం గమనార్హం. పర్యవేక్షణ అవసరం.. బీఎల్ఓల పనితీరు పర్యవేక్షించడంతోపాటు పారదర్శకంగా ఓటరు జాబితాలను రూపొందించేందుకు తహసీల్దార్ నుంచి జిల్లా అధికారుల వరకు పర్యవేక్షణ అవసరం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటరు నమోదు కోసం పలు స్వచ్ఛంద సంస్థలు యువతతోపాటు అర్హులైన వారందకూ తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఫారం–6 పంపిణీ చేసి దరఖాస్తు చేయించారు. రెవెన్యూ అధికారులు ఆ దరఖాస్తులను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. కానీ చాలా మంది పేర్లు జాబితాలో నమోదు కాలేదు. దీంతో ఓటు హక్కును కోల్పోయారు. ట్యాబ్లల్లో చిరునామాలు కూడా అప్లోడ్ చేయకపోవడంతో బీఎల్వోలకు చిరునామాలు దొరకక వాటిని తిరస్కరించారు. వీటన్నింటినీ పర్యవేక్షించి లోటు పాట్లను సరిచేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓటరు జాబితా అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం కొత్త ఓటర్లు, ఓట్లు గల్లంతైన వారికోసం ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని ఇచ్చింది. ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 25 వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగనుంది. అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ అభ్యర్థులు నామినేషన్ వేసే రెండు రోజుల ముందు వరకు కొత్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గల్లంతైన వారు, కొత్త ఓటరు నమోదు చేయదలచిన వారు, మార్పులు, చేర్పుల కోసం బీఎల్ఓలను సంప్రదించాలని అధికారులు పేర్కొంటున్నారు. నా ఓటు తీసేశారు.. ఇప్పటి వరకు చాలా ఎన్నికల్లో ఓటు వేశాను. కానీ ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. నా ఓటు తీసేశారు. ఎలా తీసేశారని అధికారులను అడిగితే సమాధానం ఇవ్వడం లేదు. దీన్ని చాలా అవమానకరంగా భావిస్తున్నా. అధికారుల తప్పిదం వల్ల చాలా మంది తమ ఓటును వేయలేకపోయారు. – రామాయి నారాయణ, సొనాల -
జీహెచ్ఎంసీ అధికారులు వినూత్న ప్రచారం
-
వినూత్న ప్రచారం సరే.. ఇదేమీ నిర్లక్ష్యం?
సాక్షి, హైదరాబాద్ : ఓటర్లకు అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు వినూత్న ప్రచారం నిర్వమించారు. హుస్సేన్ సాగర్లో బోటు మీద ప్రయాణించి.. బుద్ధ విగ్రహం వద్దకు చేరుకున్న అధికారులు.. ఈ నెల 25వ తేదీ వరకు కొత్తవారు ఓటర్లుగా నమోదుచేసుకోవాలని, ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రచారం నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ వినూత్న ప్రచారంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సెఫ్టీ జాకెట్లు వేసుకోకుండానే ఓ ఐఏఎస్ అధికారితోపాటు 50 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులు బోటులో ప్రయాణించారు. బోటులో సెఫ్టీ జాకెట్లు ఉన్నా.. వారు ధరించలేదు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రాణాల మీదకు చేటు తెచ్చే ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండి తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని నిత్యం చెప్పే అధికారులే.. తమదాకా వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. -
ఓటేస్తే బహుమతి
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటోంది. టాటా, బిర్లా, హీరో, ఇన్ఫోసిస్ వంటి బడా కార్పొరేట్ దిగ్గజాలు తమ సిబ్బందితో పాటు సాధారణ పౌరులు కూడా ఓటు వేసేలా చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఓటు హక్కును వినియోగించుకున్న ఉద్యోగులకు బహుమతులను, ప్రోత్సాహకాలను కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పోలింగ్ రోజు కావాలంటే సెలవు తీసుకోండి... కనీసం ఒక పూటైనా లీవు తీసుకుని ఓటు వేసి రండని చెబుతున్నాయి. అంతేనా, అనేక కంపెనీలు ఓటరు నమోదు ప్రక్రియకు ఇతోధికంగా దోహదపడుతున్నాయి. ఓటు వేసేలా ఉద్యోగులను ప్రేరేపించేందుకు దృశ్య, శ్రవణ కార్యక్రమాలు, పోస్టర్లతో పాటు ఓటు హక్కు వినియోగించుకున్న వారి అనుభవాలను కూడా కంపెనీలు వివరిస్తున్నాయి. ఓటు హక్కు వినియోగంలో ప్రజల్లోని ఉదాశీనతను పోగొట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. టాటా భారీ ప్రచారం... భారతీయ మహిళా ఓటర్లలో చైతన్యం నింపేందుకు ‘పవర్ ఆఫ్ 49’ పేరుతో సృజనాత్మక ప్రచార కార్యక్రమాన్ని టాటా గ్రూప్ చేపట్టింది. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 49% కావడంతో ప్రచారానికి ఆ పేరు పెట్టింది. ఓటర్ల నమోదులో ఇన్ఫోసిస్ ... బెంగళూరులో ఓటు హక్కుపై చైతన్యాన్ని పెంచేందుకు ఇన్ఫోసిస్ నడుం బిగించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల కోసం ఓ రిసోర్స్ హబ్నూ ఏర్పాటు చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయంతో కలసి ఇన్ఫోసిస్ ఈ కార్యక్రమాలను అమలు చేస్తోంది. వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు, క్విజ్లు, ఎస్ఎంఎస్ ప్రచారం వంటి పలు కార్యక్రమాలను నిర్వహించింది. కాగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్యూఎల్ కూడా ఓటు హక్కుపై భారీ ప్రకటనలతో ప్రచారాన్ని చేపట్టింది. ఐడియా సెల్యులార్, హీరో మోటోకార్స్, ఐటీసీ, టాటా టీ, గూగుల్ ఇండియా, ఎంటీవీ ఇండియా వంటి కంపెనీలు కూడా ఇలాంటి పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి.