voters gifts
-
'ఒక్కొక్కరికి రూ.6,000 ఇస్తాం.. డబ్బులు అందితేనే ఓటెయ్యండి'
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జర్కిహోలి ఓటర్లకు బంపరాఫర్ ఇచ్చారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే ఓటు వేయాలని, ఇందు కోసం ఒక్కొక్కరికి రూ.6,000 ఇస్తామని హామీ ఇచ్చారు. డబ్బు అందితేనే ఓటు వెయ్యాలని లేకపోతే వేయొద్దని స్పష్టం చేశారు. బెలగావి రూరల్‌లోని సులేబావి గ్రామంలో రమేష్ జర్కిహోలి అభిమానులు శుక్రవారం ఓ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జర్కిహోలి.. ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్‌ను ఎలాగైనా ఓడించాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఆమె తన వల్లే గెలిచిందని, ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవనివ్వొద్దని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలోని ఓటర్లకు లక్ష్మీ హెబ్బాల్కర్ మిక్సీలు, కిచెన్ సామాన్లు కానుకగా ఇస్తోందని, వాటి విలువ రూ.3,000 ఉంటుందని రమేశ్ పేర్కొన్నారు. అందుకు రెండింతల డబ్బు తాము ఇస్తామని, బీజేపీకే ఓటు వేయాలని సూచించారు. అయితే ఈ డబ్బులు తాను ఇవ్వనని, తన అభిమానులే సమీకరించి ఓటర్లకు పంపిణీ చేస్తారని జర్కిహోలి పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అందుకు రూ.10 కోట్లు అదనంగా తాము ఖర్చు చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందన.. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ తోసిపుచ్చారు. మహిళలంటే రమేశ్ జర్కిహోలికి చులకన అని, ఎలాగైనా ఓడించాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరికీ కానుకలు, డబ్బు పంచలేదన్నారు. బహిరంగంగా ఓటర్లకు డబ్బు ఇస్తానని చెప్పిన రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో రమేష్ జర్కిహోలి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలోకి మారారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోవడంతో ఉపఎన్నికలు వచ్చి బీజేపీ గెలిచి అధికారం చేపట్టింది. చదవండి: మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు.. -
ఈసీ కంటపడకుండా.. ఎత్తులు, జిత్తులు!
సాక్షి, హైదరాబాద్ : ‘హైదరాబాద్ శివారులో ఓ చిరుద్యోగి తన కుమారుడి పుట్టినరోజు జరిపాడు. దాదాపు 200 మంది స్థానికులు హాజరైన ఆ వేడుకకు అయిన ఖర్చు రూ.2 లక్షలు. ‘కరీంనగర్ జిల్లాలో ఓ టీచర్ ఇంట్లో జరిగిన వ్రతానికి కాలనీవాసులు పెద్దెత్తున హాజరయ్యారు. దీనికి అయిన ఖర్చు రూ.4 లక్షలపైమాటే’. ఈ రెండు కార్యక్రమాలకు హాజరైనవారంతా స్థానికులే. తిరిగి వెళ్లేటప్పుడు అంతా మంచి బహుమతులతో వెళ్లారు. వాస్తవానికి ఈ కార్యక్రమాలు అంత ఆర్భాటంగా జరగడానికి కారణం స్థానిక రాజకీయ నాయకులే. ఎందుకు ఇదంతా అంటారా? ఎన్నికల సమయంలో ఈసీ కంటపడకుండా ఉండేందు కేనట.. ఇలా చాలాచోట్ల గెట్ టుగెదర్, పెళ్లి రోజుల పేరిట ‘స్పాన్సర్’ కార్యక్రమాలకు తెరలేపారు. తెలంగాణలో ఎన్నికల సంగ్రామం మొదలైంది. సోమవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైన దరిమిలా అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఏ అభ్యర్థి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎలా ప్రచారం చేస్తున్నారు? అన్న విషయాలపై ఈసీతోపాటు ప్రత్యర్థి పార్టీలు, మీడియా నిఘా కూడా ఉంటుంది. ఇప్పటికే కుల సంఘాల సమావేశాలపైనా నిఘా ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో వీటిని తప్పించుకోవడానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. దీంట్లో భాగంగా చిన్న చిన్న శుభకార్యాలు, పార్టీలను ఎంచుకుంటున్నారు. ‘స్పాన్సర్’విందులను సృష్టిస్తున్నారు. కార్యకర్తలకు స్పెషల్ టాస్క్‌లు.. ప్రతీ నియోజకవర్గంలోనూ దాదాపుగా అభ్యర్థులంతా ప్రచారం మొదలుపెట్టారు. వీరిలో ముఖ్యంగా నగర నేపథ్యమున్న కాలనీల్లో అభ్యర్థులు పలువురు కార్యకర్తలకు స్పెషల్ టాస్క్‌లు అప్పగిస్తున్నారు. ఎవరి ఇళ్లల్లో శుభకార్యాలు జరుగుతున్నాయో వెదకడమే వీరి పని. ఇప్పటికే చాలాచోట్ల డిసెంబర్ 5 వరకు ఎవరి ఇంట్లో విందులు, శుభకార్యాలు, వ్రతాలు చేస్తున్నారో ముందే సమాచారం తెప్పించుకుని పెట్టుకున్నారు. వీరంతా వెళ్లి శుభకార్యాల నిర్వాహకులను కలసి విందు ఖర్చంతా తామే భరిస్తామని వారిని ఒప్పిస్తున్నారు. మొహమాటానికి పోయి కొందరు, ఖర్చు వారే భరిస్తున్నారుగా అని ఇంకొందరు ఓకే అంటున్నారు. చివర్లో నాయకుల రంగప్రవేశం.. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఆఖర్లో స్పాన్సర్ చేసిన నాయకుడూ సదరు శుభకార్యానికి వస్తాడు. అందరినీ కలుస్తాడు. యోగక్షేమాలు అడుగుతాడు. కలసి భోజనం చేసిన తరువాత అసలు ప్రచారం మొదలవుతుంది. ఈసారి ఓటు తనకే వేయాలని విజ్ఞప్తి చేస్తాడు. కార్యక్రమం చివర్లలో రివర్స్ గిఫ్ట్‌ల పేరిట చీరలు, కానుకలు, నగదు తదితరాలు పంచుతున్నారు. కానుకల్లోనూ వయసుల ఆధారంగా వ్యత్యాసాలుంటున్నాయి. ఎవరి అభిరుచి మేరకు వారిని సంతృప్తి చేసేందుకు బాగానే ఖర్చు చేస్తున్నారు. ఇవే కాకుండా.. చాలామంది కార్యకర్తలు తమ ఇంట్లోనూ ఇలాంటి స్పాన్సర్ కార్యక్రమాలను ‘ఫిక్స్’చేస్తున్నారు. వివిధ రకాల వ్రతాలు, గెట్ టు గెదర్‌ల పేరిట విందులు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి మళ్లీ తమ నేతను ముఖ్యఅతిథిగా పిలుస్తారు. తరువాత అంతా షరామామూలే! -
ఓటర్లకు బంగారు బహుమతులు
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం బంగారు బహుమతులు ప్రకటించింది. జిల్లాలో 41 మందికి 212 గ్రాముల బంగారం అంది స్తామని ప్రకటించింది. ఓటు హక్కు వినియోగించుకున్న వారి జాబితా నుంచి ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా 41 మందిని ఎంపిక చేశారు. 100 గ్రాముల బంగారం ఒకరికి, 10 గ్రాముల చొప్పున నలుగురికి, 36 మందికి రెండు గ్రాముల బంగారం అందిస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటిం చింది. బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రేఖారాణి ఎంపికైన ఓటర్లకు బంగారు బహుమతులు అందించారు. బంపర్ బహుమతి 100 గ్రాముల బంగారం కావలి మండలం చెంచుగానిపాళెంకు చెందిన కె. మాల కొండయ్యకు అందించారు. 41 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో 15 మంది మాత్రమే కలెక్టరేట్‌కు వచ్చి బంగారు బహుమతులు అందుకున్నారు. మిగిలిన వారు కలెక్టరేట్ పరిపాలనాధికారి రమేష్‌నాయుడు సంప్రదిస్తే బంగారు బహుమతులు అందిస్తారు. ఆర్థం లేని వివరణ: సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌తో మ్యూజికల్ నైట్, 2కే రన్, సంతకాల సేకరణ, బంగారు బహుమతులు ప్రకటించారు. బంగారు బహుమతుల బహూకరణ కార్యక్రమంలో జేసీ ఆర్థంలేని వివరణ ఇచ్చారు. బంగారు బహుమతులు ఎందుకు ప్రకటించాం అనే విషయాన్ని పక్కన పెట్టి తమన్ మ్యూజికల్ కార్యక్రమానికి వచ్చిన నగదు, ఖర్చుల వివరాలను తెలిపారు. ప్లాటినం, గోల్డ్ టిక్కెట్లు విక్రయించడం ద్వారా రూ.69 లక్షలు వచ్చిందన్నారు. తమన్ కార్యక్రమానికి రూ.36.63 లక్షలు ఖర్చు అయిందన్నారు. బంగారు బహుమతులకు రూ.6,46,160 ఖర్చు అయిం దని ప్రకటించారు. రూ.25,90,341 నగదు అందుబాటులో ఉందన్నారు. రూ.54.65 లక్షల నగదు పరిశ్రమల నుంచి రావాల్సి ఉందన్నారు. మొత్తం రూ.80,55,341 లక్షల నగదు అందుబాటులో ఉంటుందని, దీంతో కస్తూర్బాకళాక్షేత్రం అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు.