నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం బంగారు బహుమతులు ప్రకటించింది. జిల్లాలో 41 మందికి 212 గ్రాముల బంగారం అంది స్తామని ప్రకటించింది. ఓటు హక్కు వినియోగించుకున్న వారి జాబితా నుంచి ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా 41 మందిని ఎంపిక చేశారు.
100 గ్రాముల బంగారం ఒకరికి, 10 గ్రాముల చొప్పున నలుగురికి, 36 మందికి రెండు గ్రాముల బంగారం అందిస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటిం చింది. బుధవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ రేఖారాణి ఎంపికైన ఓటర్లకు బంగారు బహుమతులు అందించారు. బంపర్ బహుమతి 100 గ్రాముల బంగారం కావలి మండలం చెంచుగానిపాళెంకు చెందిన కె. మాల కొండయ్యకు అందించారు. 41 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో 15 మంది మాత్రమే కలెక్టరేట్‌కు వచ్చి బంగారు బహుమతులు అందుకున్నారు. మిగిలిన వారు కలెక్టరేట్ పరిపాలనాధికారి రమేష్‌నాయుడు సంప్రదిస్తే బంగారు బహుమతులు అందిస్తారు.
ఆర్థం లేని వివరణ:
సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌తో మ్యూజికల్ నైట్, 2కే రన్, సంతకాల సేకరణ, బంగారు బహుమతులు ప్రకటించారు.
బంగారు బహుమతుల బహూకరణ కార్యక్రమంలో జేసీ ఆర్థంలేని వివరణ ఇచ్చారు. బంగారు బహుమతులు ఎందుకు ప్రకటించాం అనే విషయాన్ని పక్కన పెట్టి తమన్ మ్యూజికల్ కార్యక్రమానికి వచ్చిన నగదు, ఖర్చుల వివరాలను తెలిపారు. ప్లాటినం, గోల్డ్ టిక్కెట్లు విక్రయించడం ద్వారా రూ.69 లక్షలు వచ్చిందన్నారు. తమన్ కార్యక్రమానికి రూ.36.63 లక్షలు ఖర్చు అయిందన్నారు. బంగారు బహుమతులకు రూ.6,46,160 ఖర్చు అయిం దని ప్రకటించారు. రూ.25,90,341 నగదు అందుబాటులో ఉందన్నారు. రూ.54.65 లక్షల నగదు పరిశ్రమల నుంచి రావాల్సి ఉందన్నారు. మొత్తం రూ.80,55,341 లక్షల నగదు అందుబాటులో ఉంటుందని, దీంతో కస్తూర్బాకళాక్షేత్రం అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు.
ఓటర్లకు బంగారు బహుమతులు
Published Thu, May 15 2014 3:57 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement